News
News
X

Devatha September 27th Update: దేవిని ఆదిత్యతో మాట్లాడమని ఒట్టు వేయించుకున్న చిన్మయి- షాక్లో మాధవ్, ఇల్లు విడిచి వెళ్ళనన్న రాధ

రాధని పెళ్లి చేసుకోవడానికి తల్లి అడ్డం వచ్చిందని జానకిని మెట్ల మీద నుంచి తోసేస్తాడు మాధవ్. దీంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

జానకికి పక్షవాతం వచ్చిందని చెప్పడంతో దేవి, చిన్మయి చాలా ఏడుస్తారు. వాళ్ళకి ఆదిత్య ధైర్యం చెబుతుంటే మాధవ్ కోపంగా చూస్తూ ఉంటాడు. నేను ఇచ్చిన మెడిసిన్ కరెక్ట్ గా వాడితే తప్పకుండా ఆమె కోలుకుంటారు అని డాక్టర్ చెప్పడంతో మాధవ్ మరో ప్లాన్ వేస్తాడు. నర్స్ వచ్చి రాధని మళ్ళీ పిలుస్తుంది. మీరు రండి ఒకసారి పేషెంట్ ఏదో చెప్పాలని ట్రై చేస్తుందని రమ్మని పిలుస్తుంది. అక్కడ అత్తమ్మ ఉంటది ఎలా పోవాలి అని టెన్షన్ పడుతూనే వెళ్తుంది. రాధని చూసిన జానకి బాధగా ఏడుస్తూ తనని దగ్గరకి రమ్మని అంటుంది. అప్పుడే రామూర్తి, దేవుడమ్మ వాళ్ళు కూడా అటువైపు వస్తూ ఉంటారు. వాళ్ళని చూసిన రాధ వెళ్ళి కనిపించకుండా దాక్కుంటుంది.

Also Read: సా గు తు న్న వసంత్ ఎంగేజ్మెంట్- వేద, యష్ కీచులాట, చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చిన పంతులు

వచ్చి ఇంతసేపైనా నీ భార్య కనిపించడం లేడు ఏంటి అని దేవుడమ్మ మాధవ్ ని అడుగుతుంది. రాధ దాక్కోవడం గమనించిన నువ్వు ఇప్పుడు అలా దాక్కోవడమే నాకు కావలసింది నీ మెడలో తాళి కట్టిన తర్వాత నేనే నా భార్యగా పరిచయం చేస్తాను అని మాధవ్ మనసులో అనుకుంటాడు. ఏంటి మాట్లాడవు అని దేవుడమ్మ అని నేనే వెళ్ళి చూస్తాను అని వెళ్లబోతుంటే చిన్మయి ఆపుతుంది. ఎన్ని సార్లు వచ్చినా రాధని చూడటం మాత్రం కుదరడం లేదని దేవుడమ్మ అంటుంది. మీ అమ్మగారు బాగు అవడం మీ చేతుల్లోనే ఉంది.. దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని దేవుడమ్మ చెప్తుంది. మా అమ్మని చూసుకోవడానికి నా భార్య రాధ ఉందిగా అని మాధవ్ అనేసరికి ఆదిత్య కోపంగా చూస్తాడు.

సత్య చీకట్లో కూర్చుని ఉంటే దేవుడమ్మ, ఆదిత్య వస్తారు. ఏంటి సత్య చీకట్లో కూర్చున్నావ్ అని ఆదిత్య అంటే ఓహ్ ఆంటీ ఉన్నారని త్వరగా వచ్చావా అని వెటకారంగా అంటుంది. జానకి వీల్ చైర్లో కూర్చుని మాధవ్ తనని మెట్ల మీద నుంచి తోసేసిన ఘటన గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.  మాధవ గిటార్ ప్లే చేస్తుంటే అది విని జానకి చాలా భయపడుతుంది. అప్పుడే ఏమైంది ఎందుకు అంత పరేషన్ అవుతున్నారు అని రాధ అడుగుతుంది. మీకేమి కాదు నేను ఉన్నా కదా అని ధైర్యం చెప్పేందుకు చూస్తుంది కానీ జానకి మాత్రం వినదు. ఇంట్లో నుంచి వెళ్లిపో అని జానకి సైగ ద్వారా చెప్తుంది. ఇలా మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్లలేను అని రాధ అంటుంది. జానకి మాత్రం తాళి బొట్టు చూపించి నిజం చెప్పడానికి ట్రై చేస్తుంటే రాధ మాత్రం అర్థం చేసుకోలేదు.

Also Read: వసు కోసం మల్లెపూలు కొన్న రిషి - నాకోసం వచ్చేస్తావా వసుధార అని అడిగేసిన మిస్టర్ ఇగో

మీ బిడ్డ కథ నేను చూసుకుంటా మీరు పరేషన్ కాకండి, ఇలాంటి టైమ్ లో అయినా మీ పక్కన నిలబడి రుణం తీర్చుకొనివ్వండి అని రాధ అడుగుతుంది. మీరు నాగురించి పరేషన్ అవొద్దు మీరు పూర్తిగా కోలుకున్న తర్వాతే వెళ్తాను నా పెనిమిటి వచ్చి రమ్మని అడిగినా వెళ్ళను అని రాధ చెప్పడంతో జానకి చాలా ఎమోషనల్ అవుతుంది. జానకికి ప్రేమగా అన్నం తినిపిస్తుంది. తర్వాత పిల్లలిద్దరికి అన్నం తినిపిస్తుంటే దేవి నువ్వు ఆఫీసర్ అంకుల్ తో మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా అని చిన్మయి అంటుంది. ఆ మాటలు మాధవ్ వింటాడు. మనం ఎన్ని సార్లు వెళ్ళినా ఎంత అల్లరి చేసినా ఒక్క మాట అయినా అన్నారా అలాంటిది పిన్ని ఏదో కోపంలో అలా అంటే నువ్వు మాట్లాడకుండా ఉంటే ఎలా చెప్పు అని అంటుంది. నువ్వు ఇలాగే ఉంటే నా మీద ఒట్టే అని చిన్మయి అనేసరికి మాధవ్ షాక్ అవుతాడు.

Published at : 27 Sep 2022 08:13 AM (IST) Tags: devatha serial devatha serial today episode Devatha Serial Today Devatha Serial Today Episode Written Update Devatha Serial September 27th

సంబంధిత కథనాలు

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ - కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Unstoppable With NBK: బాలయ్య బర్త్‌డే పార్టీకి పవర్ స్టార్ - ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్!

Unstoppable With NBK: బాలయ్య బర్త్‌డే పార్టీకి పవర్ స్టార్ - ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్!

టాప్ స్టోరీస్

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Lokesh Padayatra : నెల్లూరు నుంచి జగన్ పతనం స్టార్ట్, పెద్దిరెడ్డి లోకల్ వీరప్పన్ - లోకేశ్

Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Thalapathy67 Title Reveal: రక్తంతో తడిసిపోయిన తలపతి - టైటిల్ అనౌన్స్‌మెంట్ రేపే!