Chinni Serial Today December 8th: చిన్ని సీరియల్: మధు కిడ్నాప్! మ్యాడీ, శ్రేయ పెళ్లికి ఆటంకమా? నాగవల్లి ప్లాన్ బెడిసికొట్టిందా?
Chinni Serial Today Episode December 8th శ్రేయ, మ్యాడీతో నాగవల్లి పూజ చేయించాలనుకోవడం పూజ ప్రారంభంలోనే మధు కిడ్నాప్ అయిందని మ్యాడీ లేచి వెళ్లిపోవాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మహి తన మాట విని పెళ్లికి ఒప్పుకున్నందుకు దేవా మహికి థ్యాంక్స్ చెప్తాడు. శ్రేయ వాళ్లంతా సంతోషంగా సెల్ఫీలు తీసుకోవడం నాగవల్లి చూసి మహి వాళ్లకి చూపించి ఇంట్లో అందరూ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తుంది.
దేవా మహితో నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడుగుతాడు. నా గురించి ఆలోచించి మీ సంతోషం పాడు చేసుకోవద్దు డాడీ.. మీతో పాటు ఈ ఇంట్లో అందరూ ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుణ్ని కోరుకుంటా అని మహి అంటాడు. మహి మన ట్రాక్‌లోకి వచ్చేశాడు ఇక ఏ టెన్షన్ లేదు అని అంటాడు. దానికి నాగవల్లి త్వరలోనే శ్రేయ,మహిల పెళ్లి చేసేయాలి అని అంటుంది. ఇక నుంచి అదే పనిలో ఉందామని దేవా అంటాడు.
మ్యాడీ తన తల్లి చావుకి చిన్ని తల్లి కారణం అని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ బైక్ మీద వెళ్తూ ఉంటాడు. సంజు మ్యాడీని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి అనుకుంటాడు. సంజు మ్యాడీని ఆపి నీ వెనక మధు ఉండాలి కదా.. నువ్వు మధు ఫ్రెండ్స్‌నా లవర్స్ అని అడుగుతాడు. మ్యాడీ కోపంతో సంజుని కొడతాడు. అప్పుడే సంజు బ్యాగ్‌లో నుంచి మధు ఫొటో కింద పడుతుంది. అది చూసి మ్యాడీ నీ దగ్గర మధు ఫొటో ఎందుకు ఉంది అని అడుగుతాడు. మధుని నేను లవ్ చేస్తున్నా కాబట్టి తన ఫొటో నా దగ్గర ఉంది అని సంజు అంటాడు. నేను మధుని లవ్ చేస్తున్నా అంటే నువ్వు ఎందుకు అలా అయిపోతున్నావ్ నువ్వు తనని లవ్ చేయడం లేదు కదా.. తను నీకు ఫ్రెండే కదా అని అంటాడు.
సంజు మధు ఫొటో చూసి లవ్‌యూ అని నా డార్లింగ్ ఎంత ముద్దొస్తుందో అని ఫోటోకి ముద్దు పెట్టుకోబోతే మ్యాడీ సంజుకి ఒక్కటిస్తాడు. సంజుని కొడతాడు. ఇంకోసారి నా ఫ్రెండ్ గురించి ఇలాంటి మాటలు మాట్లాడితే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. సంజు జోలికి వస్తే ఏం చేస్తాడో నీకు చూపిస్తారా.. ఏ మధు కోసం నన్ను కొట్టావో ఆ మధు నీకు కనిపించకుండా చేస్తా అని సంజు అనుకుంటాడు.
నాగవల్లి ఇంట్లో పూజకు ఏర్పాట్లు చేయడం చూసి లోహిత నాగవల్లితో ఏంటి పిన్ని నాతో వరుణ్‌తో కలిసి ఏమైనా వ్రతం చేయిస్తున్నారా అని అడుగుతుంది. అంత సీన్ మీకు లేదు అని నాగవల్లి అంటుంది. మరి ఇందంతా ఏంటి అని అడిగితే మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం కంటే ముందు వాళ్లతో ప్రత్యేకమైన పూజ చేయించమని పంతులు చెప్పారని నాగవల్లి చెప్తుంది. ఇంతలో మహి వచ్చి మధుని కలవడానికి వెళ్తున్నా అని అంటాడు. నాగవల్లి మహికి పూజ గురించి చెప్పి రెడీ అవ్వమని అంటుంది. నాగవల్లి వరుణ్‌తో ఇది మీ చెల్లి పెళ్లి మ్యాడీ ఒక వేళ పెళ్లి ఇష్టం లేదా అని అంటే ఒప్పించే బాధ్యత నీదే అని అంటుంది.
మధు ఫ్యామిలీతో కలిసి పూజ చేయడానికి గుడికి బయల్దేరుతుంది. ఇంతలో మధుని కొందరు కిడ్నాప్ చేస్తారు. సుబ్బు, స్వరూప, చంటి కారు వెనక పరుగెడతారు కానీ ఫలితం ఉండదు. ఇక మ్యాడీ, శ్రేయ కలిసి రావడం చూసి అందరూ చాలా సంతోషపడతారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని పూజ మొదలు పెడతారు. అయితే మహికి సుబ్బు కాల్ చేసి మధు కిడ్నాప్ గురించి చెప్తాడు. దాంతో మ్యాడీ ఉన్నపళంగా పూజ వదిలేసి బయల్దేరుతాడు. నాగవల్లి వాళ్లు షాక్ అయిపోతారు. మ్యాడీ నాగవల్లితో మధుని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తాడు. పంతులు మ్యాడీతో పూజ ప్రారంభం అయిన తర్వాత లేచి వెళ్లిపోతే ఇంటికే అపశకునం అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















