Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 8th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి తెలిసిన నిజమేంటి? అంబిక వర్సస్ విహారి.. రణరంగమే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode Dec 8th లక్ష్మీ అమ్మిరాజు మీద అనుమానంతో సంధ్యని కలిసి విషయం చెప్పడం, విహారి అంబికను లక్ష్మీ గురించి నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారికి అంబిక మీద అనుమానం వచ్చి ఆవేశంగా ఇంటికి వెళ్తాడు. లక్ష్మీకి కూడా అంబిక, అమ్మిరాజుల మీద అనుమానం వస్తుంది. అమ్మిరాజు జైలులో ఉన్నాడు కదా అనుకుంటుంది. వెంటనే ఎస్‌ఐ సంధ్య దగ్గరకు వెళ్లాలి అనుకుంటుంది.
అమ్మిరాజు రగిలిపోతూ కావేరిని ఎలా అయినా దక్కించుకోవాలి అనుకుంటాడు. కావేరి ఏడుస్తూ తన వల్లే లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోయింది అనుకుంటుంది. విహారి ఇంటికి రాలేదు ఏంటా అని అంబిక అనుకుంటూ ఉంటుంది. లక్ష్మీని తలచుకొని ఈ అంబికతో పెట్టుకుంటుందా.. లక్ష్మీ లేకపోతే విహారిని సైడ్ చేయడం చాలా సింపుల్.. విహారిని సైడ్ చేసేస్తే మళ్లీ నా అధికారం నాకు వచ్చేస్తుంది. మకుటం లేని మహారాణిని నేను అవుతా అని నవ్వుకుంటుంది.
సహస్ర, విహారిల బిడ్డ లక్ష్మీ కడుపులో ఉండటం వల్ల పద్మాక్షి, సహస్ర చాలా టెన్షన్ పడతారు. ఎంతో కష్టపడి బావకి తెలీకుండా సరోగసీ చేశాం కదమ్మా,, ఇప్పుడు లక్ష్మీ లేకపోతే నా పరిస్థితి ఏంటి.. నా బిడ్డను ఆ లక్ష్మీ తీసుకున్నట్లే కదా అని ఏడుస్తుంది. అమ్మిరాజు బయటకు వెళ్తుంటే వీర్రాజు అపుతాడు. ఎక్కడికి వెళ్తావ్‌రా అని అడుగుతాడు. నాకు కాబోయే భార్య దగ్గరకు నేను వెళ్లి దాన్ని పెళ్లి చేసుకుంటా అని అంటాడు. వీర్రాజు అమ్మిరాజుని ఆపి అంబిక నిన్ను జైలు నుంచి విడిపించింది ఆవేశ పడటానికి కాదు.. తను ఓ ప్లాన్ వేసింది అది వర్కౌట్ అయ్యేలా చేయాలి అని అంటాడు. వీర్రాజు కొడుకుతో మంచిగా మాట్లాడి కాళ్లు చేతులు కట్టేసి గదిలో బంధించేస్తాడు.
లక్ష్మీ రాత్రి సంధ్య ఇంటికి వెళ్తుంది. లక్ష్మీ సంధ్యకి జరిగింది చెప్తుంది. అమ్మిరాజు మీద అనుమానం ఉందని లక్ష్మీ అంటే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని సంధ్య అంటుంది. వద్దు అని లక్ష్మీ చెప్పి ఆడపిల్ల జీవితం అని కంప్లైంట్ ఇవ్వకుండా ఎంక్వైరీ చేయమని అంటుంది. అమ్మిరాజు జైలులో ఉన్నాడు కదా ఎలా చేస్తాడు అని సంధ్య పోలీస్‌లకు ఫోన్ చేసి అమ్మిరాజు గురించి అడుగుతుంది. అతను రికార్డ్స్ చెక్ చేసి అమ్మిరాజు నిన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు అని చెప్తారు. సంధ్య షాక్ అయిపోతుంది. లక్ష్మీతో నీ అనుమానం నిజం అవ్వడానికి ఛాన్స్ ఉంది నిన్నే ఆ అమ్మిరాజు బెయిల్ మీద దొరికాడని అంటుంది.
లక్ష్మీ తన దగ్గర ఉన్న అమ్మిరాజు నెంబరు సంధ్యకి ఇస్తుంది. సంధ్య ట్రాప్ చేయాలని అనుకుంటే అమ్మిరాజు, వీర్రాజు ఇద్దరూ ఫోన్‌లు ఆపేసుంటారు. ఇక విహారి కోపంగా అత్తయ్యా అత్తయ్యా అని అరుచుకుంటూ అంబిక దగ్గరకు వెళ్తాడు. ఏంటి అరుస్తున్నావ్ అని అంబిక అడుగుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. ఎందుకు అత్తయ్య మీకు లక్ష్మీ మీద అంత కోపం.. లక్ష్మీని రిజైన్ చేయించి మరీ నువ్వు పంపించేశావ్.. లక్ష్మీని నువ్వు ఏదో చేశావ్.. లక్ష్మీ ఎక్కడుంది అని అడుగుతాడు. నాకు అంత ఖర్మ పట్టలేదు అని అంబిక అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో నువ్వేం చేశావో నాకు తెలుసు విహారి అంటాడు. దానికి అంబిక అవును లక్ష్మీ దగ్గర ఉన్న 200 ఎకరాలు తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి వెళ్లా.. ఎందుకంటే ఆస్తి మనది.. నాకేం తెలీదు అనుకుంటున్నారా.. తెలీకుండానే నువ్వు లేనప్పుడు బిజినెస్‌లు చూసుకున్నానా.. నాకు మన ఆస్తులు మన దగ్గర ఉండటమే నాకు ముఖ్యం అని అంటుంది.
యమున అంబికతో ఏదో పొరపాటుగా అడిగాడు అని అంటే అలా ఎలా అడుగుతాడు. పని మనిషి కోసం మేనత్తని ప్రశ్నిస్తున్నాడు అని అంటుంది. అత్తయ్యా లక్ష్మీ పని మనిషి కాదు అని విహారి అంటే నీకు.. నీకు అది పనిమనిషి కాదేమో కానీ నాకు మాత్రం అది పనిమనిషే అని అంటుంది. అది పనిమనిషిగానే ఇంట్లోకి వచ్చింది నేను దాన్ని అలాగే గుర్తు పెట్టుకుంటా.. నాకు ఇలాంటి శాస్తి బాగా జరగాల్సిందే.. మీ అమ్మని పెళ్లి చేసుకొని మీ నాన్న నిన్ను కని కొన్నేళ్లకు పోయాడు.. నేను నీ కోసం మగరాయుడిలా నిల్చొని నా కలలు అన్నీ వదిలేసి ఇలా ఇంటిని నిలబెట్టినందుకు నాకు ఇలా జరగాల్సిందే.. అయినా అది కాదురా విహారి ఏనాడు అయినా ఈ ఇంట్లో వాళ్ల కోసం ఇంతలా మాట్లాడని నువ్వు ఆఫ్ట్రాల్ ఆ పనిమనిషి కోసం ఏంట్రా ఇంతలా నోరేసుకొని పడిపోతున్నావ్.. నీకేంట్రా అది అంటే అంత స్పెషల్ ఇంట్రస్ట్ ఏంట్రా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















