Nindu Noorella Saavasam Serial Today December 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఘనంగా భాగీ సీమంతం వేడుకలు – విధ్వంసం సృష్టించేందుకు రెడీగా ఉన్న మను
Nindu Noorella Saavasam serial Today Episode December 8th: భాగీ సీమంతం వేడుకలో విధ్వంసం సృష్టించేందుకు మనోహరి ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ సీమంతానికి ఊర్లో వాళ్లను ఆహ్వానించడానికి ఆరు వెళ్తుంది. ఇంటింటికి వెళ్లి ఊరందరినీ పిలవాలని తిరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి తనను పరిచయం చేసుకుని సీమంతానికి రమ్మని చెప్తుంది. ఒక ఇంటి ముందు నిలబడి ఇంట్లో వాళ్లను పిలుస్తుంది.
ఆరు: పిన్ని గారు.. పిన్ని గారు
ఆవిడ: ఎవరమ్మా నీవు
ఆరు: నా పేరు అరుంధతి రేపు నా చెల్లి భాగమతి సీమంతం మీరు తప్పకుండా రావాలి
ఆవిడ: భాగుమతి అంటే రామ్మూర్తి గారి చిన్న అమ్మాయి కదూ ఇంతకీ నువ్వు ఎవరమ్మా ఎప్పుడూ చూడలేదు
ఆరు: నేను రామ్మూర్తి గారి కూతురు లాంటిదాన్నే
ఆవిడ: ఓ అవునా రామ్మూర్తి గారికి పెద్ద కూతురు ఉండేది పాపం చనిపోయిందట.. బతికుంటే నీలాగే ఉండేది. తన పేరు కూడా అరుంధతే
ఆరు: సీమంతానికి తప్పకుండా రావాలి మా చెల్లిని మంచిగా ఆశీర్వదించాలి వస్తాను
అంటూ మరో ఇంట్లోకి వెళ్తుంది.
ఆరు: నా పేరు అరుంధతి.. రామ్మూర్తి గారు ఉన్నారు కదా ఆయన కూతురుకు రేపు సీమంతం ఉంది మీరు తప్పకుండా రావాలి
అంటూ అందరినీ ఆహ్వానిస్తూ వెళ్తుంది ఆరు. వెనకాలే మనోహరి, చంభా తాబూలాలు తీసుకుని అందరినీ పిలవడానికి వెళ్తుంటారు.
మను: ఆ చంభా ఆ ఇంట్లోకి వెళ్దాం పద..
చంభా: ఆగు మనోహరి మనం భాగీని చంపడానికి వచ్చినట్టు లేదు. దగ్గరుండి తన సీమంతం జరిపించడానికి వచ్చినట్టు ఉంది
మను: కంగారు పడకు చంభా నీకు ముందే చెప్పాను కదా ఇది భాగీ సీమంతం పిలుపు కాదు ఇది దాని చావుకు ఊరిని పిలిచినట్టు
చంభా: భాగీ చస్తుందో.. మనం దొరికిపోతామో అని ఆ టెన్షన్‌తో చచ్చిపోతున్నాను
మను: కంగారు పడకు చచ్చిపోయేది భాగీనే.. నువ్వేం టెన్షన్ పడుకు పద.. ఇంట్లో వాళ్లను పిలవు చంభా
చంభా అమ్మా అని పిలవగానే ముష్టొళ్లు అనుకుని చేయి కాలిగా లేదు తర్వాత రాపో అంటుంది ఇంట్లో ఆవిడ. దీంతో మనోహరి పిలుస్తుంది. ఇంట్లో వ్యక్తి వస్తుంది.
వ్యక్తి: ఎవరు మీరు.. మహిళా సంఘాల నుంచి వచ్చారా.? ఈ మధ్య సిటీ నుంచి చాలా మంది చందాల కోసం వస్తున్నారు..? మీరు వాళ్లేనా..?
మను: మేము చందాల కోసం రాలేదు. రేపు రామ్మూర్తి కూతురు సీమంతం రేపు మీరు రావాలి. చంభా అదేదో బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వు
వ్యక్తి: ఈ పిలుపు చూస్తుంటే. సీమంతానికి రమ్మన్నట్టు లేదు.. రావొద్దు అన్నట్టు ఉంది. ఇలా పిలిస్తే ఎవరైనా వస్తారా..?
మను: ఇంకెలా పిలవాలి
వ్యక్తి: అయినా ఇందాక ఒకరు వచ్చి పిలిచారు కదా..?
మను: ఎవరొచ్చారు..? ఎప్పుడొచ్చారు..?
వ్యక్తి: మీరు ఇంతకీ ఆ ఇంటి నుంచే వస్తున్నారా..? పేరంటానికి పిలవడానికి ఎవరొచ్చారో తెలియకుండా మళ్లీ వచ్చారా..?
అని ఆవిడ తిట్టగానే మనోహరి, చంభా అక్కడి నుంచి వెల్లిపోతారు. ఏ ఇంటికి వెళ్లినా అక్కడ ఇప్పుడే ఒకావిడ వచ్చి పలిచారు కదా మళ్లీ మీరెందుకు పిలుస్తున్నారు అని చెప్పడంతో మను, చంభా షాక్ అవుతారు. ఆరు ఫోటో చూపించి ఈవిడే మిమ్మల్ని పిలిచారా అని అడగ్గానే అవునని చెప్తారు. దీంతో చంభా మనోహరి భయంతో అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత భాగీ కూర్చునే కుర్చీ కింద బాంబు పెడతారు. సరిగ్గా భాగీ వచ్చి కూర్చోగానే స్విచ్ ఆన్ చేస్తే బాంబు పేలుతుందని భాగీ రాగానే నువ్వు దూరంగా వచ్చేయ్ అని మనోహరి, చంభాకు చెప్తుంది. సరే అంటుంది చంభా. ఇంతలో భాగీ వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















