Chinni Serial Today December 6th: చిన్ని సీరియల్: మ్యాడీ చిన్నిని వదిలేసి మధుని లవ్ చేస్తున్నాడా! శ్రేయకి వరుణ్ ఏం చెప్పాడు!
Chinni Serial Today Episode December 6th మధు మ్యాడీకి నిజం తెలిసేలా చేయాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి మధుకి సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వే చిన్ని అని నాకు తెలుసు అని చెప్పి మధుకి షాక్ ఇస్తుంది. మ్యాడీ ఫ్రెండ్‌లా ఇంటికి వస్తూ ఉండు.. కానీ నువ్వే చిన్ని అని చెప్పావు అంటే ఏం చేస్తానో చెప్పను.. చేసి చూపిస్తా అని అంటుంది.
మధు నాగవల్లి మాటలు గుర్తు చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మ్యాడీ తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వరుణ్ రాగానే వరుణ్‌ని పట్టుకొని ఏడుస్తాడు. ఏంటి బావ అసలు ఏం జరుగుతుంది అని వరుణ్ మ్యాడీని అడుగుతాడు. చిన్ని అంటే నీకు ప్రాణం.. చిన్ని కోసం అమెరికా నుంచి ఇక్కడికి వచ్చావ్,, అలాంటి నువ్వు చిన్నిని కాదని శ్రేయని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఏంటి అని అడుగుతాడు.
మ్యాడీ వరుణ్‌తో కన్నీరు పెట్టుకొని అమ్మానాన్నల కోసం చేసుకుంటున్నా.. నా తల్లిని చిన్ని వాళ్ల అమ్మ చంపింది అని తెలిసిన వెంటనే చిన్ని మీద నాకున్న ప్రేమ చచ్చిపోయింది.. నాకు అమ్మని దూరం చేసిన ఆ నీచురాలి కూతురి మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది బావ.. పదేళ్ల పాటు నన్ను తల్లిప్రేమకు నోచుకోని అభాగ్యుడిగా చేసిన ఆ మహాతల్లి కూతురి మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది బావ. స్నేహితురాలిగా చూసిన మనిషిని డబ్బు కోసం చంపేసిన ఆ దుర్మార్గురాలి కూతురి మీద నాకు ప్రేమ ఎలా ఉంటుంది బావ.. ఎలా ఉంటుంది.. నా మీద ప్రేమతో పిన్నినాకు అమ్మగా మారింది.. నాకు అమ్మ లేని లోటు తీర్చింది.. లేకపోతే నా పరిస్థితి ఏంటి బావ. చిన్ని నా ఫ్రెండ్ అని తెలిసి వాళ్లమ్మ గురించి నాకు మమ్మీడాడీ చెప్పలేదు.. ఆ చిన్ని కోసం వెతికినప్పుడు చెప్పలేదు.. ఆ చిన్నిని పెళ్లి చేసుకుంటా అని చెప్పినప్పుడు చెప్పలేదు.. చిన్ని లేకపోతే ఏం అయిపోతా అని గడువు కూడా ఇచ్చారు.. గడువు పూర్తయిపోయిన తర్వాత నేను ఏమైపోతానా అని నిజం చెప్పారు.. నా కోసం ఇంత చేసిన వాళ్లు నాకు అడిగిన ఒకే ఒక్క కోరిక శ్రేయని పెళ్లి చేసుకోమని.. నా కోసం అంత చేసిన మమ్మీ డాడీల కోరిక తీర్చడం కోసం నేను శ్రేయని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా ఇది నా బాధ్యత.. ఇది నా ధర్మం అని మ్యాడీ వరుణ్‌కి చెప్తాడు.
మధు ఇంటికి రాగానే తల్లిదండ్రులు మధు డల్‌గా ఉండటం చూసి ఏమైందని అడుగుతారు. దాంతో స్వప్న మ్యాడీ, శ్రేయలకు పెళ్లి అని చెప్పారని.. అలా చెప్పగానే మధు గుండె పగిలిపోయిందని స్వప్న అంటుంది. నీ ప్రేమ మేం ఓడిపోనివ్వమమ్మా అని సుబ్బు, స్వరూప అంటారు. నువ్వే చిన్ని అని మ్యాడీకి తెలియాలి.. మీ అమ్మ నిర్దోషి అన్న సాక్ష్యాలు మ్యాడీకి చూపిస్తే కానీ నీ ప్రేమ నీ దగ్గరకు రాదు అని అంటారు. మధు కావేరి ఫొటో చూసి అమ్మా నువ్వు తప్పు చేయవు అని నాకు తెలుసు.. అమ్మ చేస్తే అది తప్పు కాదు అని కూడా నాకు తెలుసు. ఈ విషయం మ్యాడీకి తెలిసేలా చేస్తా.. నువ్వు నిర్దోషి అని అతని నోటితో అతనే చెప్పేలా చేస్తా అని మధు అనుకుంటుంది.
శ్రేయ లోహితకు థ్యాంక్స్ చెప్తుంది. మా బావతో నా పెళ్లి ఫిక్స్ అవ్వగానే ఈ ప్రపంచం జయించినంత సంతోషంగా ఉందని అంటుంది. ఇంతలో వరుణ్ వచ్చి అంత సంతోషపడకండీ.. అనుకోనిది కూడా జరగొచ్చు అని అంటాడు. నాకు బావకి పెళ్లి అవ్వడం నీకు ఇష్టం లేదా అన్నయ్యా అని అడుగుతుంది. దానికి వరుణ్ నేను ఎవరి ప్రేమని ఓడిపోవాలి అనుకోను.. చిన్ని మీద కోపంతో బావ పెళ్లికి ఒప్పుకున్నాడు కానీ మనసులో నీకు స్థానం ఇవ్వలేదు అని నాకు అనిపిస్తుంది. భర్త మనసులో స్థానం లేకుండా ఏ భార్య జీవితం బాగోదు అని అంటాడు. ఇప్పుడు బావకి చిన్ని మీద కోపం ఉంది రేపు అది పోతే ఏంటి పరిస్థితి అని అంటాడు. మీ పెళ్లి జరగడానికి ఎంత అవకాశం ఉందో జరగకపోవడానికి కూడా అంతే అవకాశం ఉందని అంటాడు. శ్రేయ మ్యాడీ మనసులో స్థానం దక్కించుకుంటుంది నువ్వు అలా అనకు వరుణ్ అని లోహిత అంటుంది. నీకు మ్యాడీకి పెళ్లి అనగానే మీ అందరి కంటే నేనే ఎక్కువ సంతోషపడేవాడిని కానీ ఇప్పుడున్న పరిస్థితి అది కాదు కదా.. అందుకే నీ జీవితం ఏమైపోతుందో అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిన్ను హెచ్చరిస్తున్నా దయచేసి అర్థం చేసుకో అని అంటాడు.
లోహిత శ్రేయతో మీ అన్నయ్య బాధ నాకు అర్థమైంది.. నీ ప్రేమ గెలుస్తుంది.. నిన్ను పెళ్లి తర్వాత మ్యాడీ ప్రేమిస్తాడు. ధైర్యంగా ఉండు అని లోహిత చెప్తుంది. ఇక మధు పార్టీ నుంచి వెళ్లిపోయింది ఏంటి అని మ్యాడీ మధుకి కాల్ చేస్తాడు. పార్టీ లేటు అవుతుందని చెప్పడంతో వచ్చేశా అని అంటుంది. ఇక మ్యాడీ మధుతో మాట్లాడి చిన్నప్పుడు చిన్ని కూడా నాకు చాలా క్లోజ్ తర్వాత ఇద్దరం దూరం అయిపోయాం.. ఇప్పుడు నువ్వు కూడా దూరం అయిపోతావేమో అని భయంగా ఉందని అంటాడు. దానికి మధు అలా అందరికీ జరగదు.. కళ్ల ముందు కనిపించే ప్రతీది నిజం కానట్లే మనం ఆలోచించే ప్రతీ ఆలోచన నిజం కాదు అని అంటుంది.
మధుతో మాట్లాడిన తర్వాత మ్యాడీ మనసులో చిన్ని విషయంలో అంత గాయం అయిన తర్వాత కూడా నిలబడ్డాను అంటే దానికి కారణం నా మధునే అని అనుకుంటాడు. దేవా నాగవల్లితో అందరూ హ్యాపీనేనా అని అడుగుతాడు. అందరూ హ్యాపీ కానీ మ్యాడీ ఎలా ఉన్నాడో చూడాలి అని ఇద్దరూ వెళ్తారు. నీ పుట్టినరోజు వేడుకలో అలా సడెన్‌గా అనౌన్స్ చేసినందుకు బాధ పడుతున్నావా.. హ్యాపీగా ఉన్నావా అని దేవా అంటాడు. అలా ఏం లేదు అని మ్యాడీ అంటాడు. నా నిర్ణయాన్ని మీరంతా అంగీకరించినందుకు సంతోషంగా ఉంది.. పార్వతిని చంపిన వాళ్ల కూతురు ఇంటి కోడలు కాకుండా ఉన్నందుకు సంతోషంగా ఉందని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















