అన్వేషించండి

Jagadhatri Serial Today December5th: మినిష్టర్‌ను చంపడానికి మీనన్‌ వేసిన ప్లాన్‌ ఫలించిందా...? గుడిలో పెట్టిన బాంబులు దొరికాయా.?

Jagadhatri Serial Today Episode December5th: మినిష్టర్‌ను చంపడానికి మీనన్‌ వేసిన ప్లాన్‌ ఫలించిందా...? గుడిలో పెట్టిన బాంబులు దొరికాయా.?

Jagadhatri Serial Today Episode: డ్రగ్స్‌ ముఠాను పట్టుకునేందుకు జేడీ,కేడీ  ప్రయత్నిస్తుంటారు. ఇదే విషయంపై వారు సీనియర్‌ అధికారులతో మాట్లాడుతుండగా...మీనన్‌ గ్యాంగ్‌లోని రూసూల్ నుంచి టి‌ప్ వచ్చిందంటూ జూనియర్‌...ఓ చిట్‌ తీసుకువచ్చి జగధాత్రికి ఇస్తుంది. అందిలో ఈగిల్‌ అని రాసి ఉంటుంది. కేదార్ ఏమైందని అడగ్గా....ఏదో పెద్ద బ్లాస్ట్‌కు ప్లాన్ చేస్తున్నారని జేడీ చెబుతుంది. కోడ్‌ రెడ్‌ అంటే ఆల్రెడీ ప్లాన్ రెడీ అయిపోయిందంటుంది. ఇంకాసేపట్లో  బ్లాస్ట్ జరగబోతోందని ఆమె అంటుంది.అందుకు సీనియర్ అధికారి స్పందిస్తాడు. అంత పెద్ద బ్లాస్ట్‌ జరగాలంటే  పెద్ద మొత్తంలో ఆర్డీఎక్స్‌ కావాలని....సిటీలోకి ఆర్డీఎక్స్‌ వచ్చినట్లు ఎక్కడా మనకు సమాచారం రాలేదు కదా అంటాడు. మూడోరోజుల క్రితం వైజాగ్‌లో ఓ కంటైనర్‌ మిస్ అయినట్లు మాకు సమాచారం ఉందని...ఆ మిస్‌ అయిన కంటైనర్‌లోనే ఆర్డీఎక్స్‌ వచ్చి ఉంటుందని జేడీ అంటుంది.  ఇంతపెద్ద సిటీలో వాళ్లు ఎక్కడ ఆర్డీఎక్స్‌ దాచారో...ఎక్కడ దాన్ని పేల్చబోతున్నారో  తెలుసుకోవడం ఎలా అంటారు.

దేవదాయశాఖ మంత్రి రంగరాజు సిటీలోకి వస్తున్నారని ....ఆయన్నే టార్గెట్ చేసి ఉంటారని జేడీ అనుమానిస్తుంది. ఆయన రానున్న నరసింహస్వామి గుడి వద్దే బ్లాస్ట్ జరగబోతుందని జేడీ అంటుంది. వెంటనే మనం అక్కడికి వెళ్లి ఈ బ్లాస్ట్‌ను అడ్డుకోవాలని భావిస్తారు.  వెంటనే  వారిద్దరూ గుడికి బయలుదేరతారు..

అటు మీనన్‌....జేడీపై గెలవబోతున్నందుకు  చాలా ఆనందపడతాడు. మరోవైపు గుడివద్ద మీనన్‌ మనుషులు  గుడి వద్ద బాంబులు పెడుతుంటారు.  ఈలోగా మినిష్టర్‌ను కలవడానికి  కౌషికి కూడాగుడి వద్దకు వస్తుంది. మినిష్టర్‌ గుడివద్దకు వచ్చి లోపలకి వెళ్తుంటాడు. 
అటు మినిష్టర్ వద్ద ఉండే రాజేందర్‌ కాల్‌ లిప్ట్ చేయకపోవడంతో  జేడీ అసహనం వ్యక్తం చేస్తుంది. వాళ్లు చాలా  త్వరగా  గుడికి రావడానికి ట్రై చేస్తుంటారు. వాళ్లు మినిష్టర్‌ లైవ్‌ చూస్తుండగా.... అక్కడ  కౌషికిని చూసి షాక్‌కు గురవుతారు. మనం ఇప్పుడు కేవలం మినిష్టర్‌తోపాటు  వదినను కూడా కాపాడాలని జేడీ అనుకుంటుంది. అటు మీనన్‌ మాత్రం కౌషికిని చూసి మరింత ఆనందపడిపోతాడు.  ఇక మీనన్‌ తన మనుషులకు ఆదేశాలు ఇస్తాడు. బాంబులు వెంటనే పేల్చాలని చెబుతాడు. మీనన్‌ మనుషులు  ఆర్డీఎక్స్‌ బ్యాగ్‌ను  మినిష్టర్‌కు దగ్గరగా తీసుకురావడంతో పోలీసులు అనుమానించి పట్టుకుంటారు. ఈలోగా  జేడీ అక్కడ ఉన్న పోలీసు ఆఫీసర్‌కు ఫోన్ చేసి గుడిలో బాంబు పెట్టారని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది. కానీ ఆ విషయం పోలీసు ఆఫీసర్‌కు వినిపించదు. ఈలోగా మినిష్టర్‌ గుడిలోకి వెళ్లిపోతాడు. దీంతో టార్గెట్‌ మిస్‌ అయ్యిందని మీనన్‌ బాధపడుతుంటాడు.మినిష్టర్ గుడిలో పూజ ముగించుకుని బయటకు వచ్చే వరకు వెయిట్‌ చేసి అప్పుడు బ్లాస్ట్ చేయాలని మీనన్ దేవాను ఆదేశిస్తాడు.

  గుడిలో సిగ్నల్‌ లేకపోవడంతో మనం చెప్పేది వారికి వినిపించలేదని జేడీ అంటుంది.  ఇప్పటి వరకు బాంబు పేల్చలేదంటే....అక్కడ ఏదో మిస్టేక్ జరిగిందని....ఖచ్చితంగా  వాళ్లు వేరే ప్లాన్‌ చేసి ఉంటారని అంటుంది.అప్పుడే పోలీసు ఆఫీసర్ రాజేందర్‌ ఫోన్ చేయగా...నేను వచ్చేవరకు మినిష్టర్‌గారిని గుడిలోనే ఉంచాలని జేడీ చెబుతుంది. గుడిలోపల జనాలు మొత్తాన్ని క్లియర్ చేయమని చెబుతుంది.  దీంతో పోలీసులు గుడిలో ఉన్న భక్తులను బయటకు పంపిస్తుండటంతో  తమ ప్లాన్‌ జేడీకి తెలిసిపోయిందేమోనని మీనన్‌ అనుమానిస్తాడు. అక్కడ ఏం జరుగుతోందే తెలియడం లేదని దేవా మీనన్‌తో అంటాడు.ఇలాంటిది ఏదో జరుగుతోంది అంటే...అక్కడికి జేడీ వచ్చిందని అర్థంరా అంటాడు. ఇంతలో జేడీ అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాళ్లను వీడియోలో చూసి మీనన్‌ షాక్‌ తింటాడు. బ్లాస్ట్‌ చేసి జేడీపై గెలుద్దామనుకున్నానని....ఇప్పుడు  ఏకంగా జేడీనే బ్లాస్ట్‌లో లేపేస్తానని అంటాడు. అనుకున్న సమయానికి అనుకున్నట్లు  బ్లాస్ట్ చేయాలని....ఒక్కదెబ్బకు మినిస్టర్‌, జేడీ, కేడీ,  కౌషికి అందరూ మాడి మసైపోవాలంటాడు. అటు జేడీ, కేడీ బాంబుల గురించి వెతుకుతుంటారు. ఈ విషయాన్ని అక్కడే ఉన్న పోలీసు అధికారికి కూడా ఈ విషయం చెప్పి....మినిస్టర్‌ను బయటకు రాకుండా నువ్వు చూసుకో....బాంబులు ఎక్కడెక్కడ ఉన్నాయో మేం కనిపెడతామని జేడీ అతనితో చెబుతుంది. మినిష్టర్‌ బయటకు వచ్చేప్పుడే చంపాలని వాళ్లు ప్లాన్ చేసి ఉంటారు కాబట్టి....ఆ మార్గంలోనే బాంబులు ఉండి ఉంటాయని జేడీ చెప్పడంతో  ఈరోజు ఏపిసోడ్‌ ముగిసిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nindu Noorella Saavasam Serial Today November 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మీద కోప్పడిన అమర్ – ఎమోషనల్‌ అయిన మను  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి మీద కోప్పడిన అమర్ – ఎమోషనల్‌ అయిన మను  
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: అంబిక టార్గెట్ మహా! సుభాష్‌కి సుపారీ! కాఫీ పంచుకున్న విహారి, మహా!
Godavari Serial Today November 21st: 'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
'గోదావరి' సీరియల్: జాను కోసం పుస్తెలు కొన్ని నందు! జాను అందానికి సంజయ్ ఫిదా!
Nindu Manasulu Serial Today November 21st: నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!
నిండు మనసులు: రాజశేఖరాన్ని అరెస్ట్ చేసిన గణ, ప్రేరణ! విజయానంద్‌ మీద మంజులకు అనుమానం వచ్చిందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget