Chinni Serial Today December 24th: చిన్ని సీరియల్: మ్యాడీ నిశ్చితార్థం, షాకింగ్‌గా మధు రియాక్షన్! నాగవల్లి ప్లానేంటి!
Chinni Serial Today Episode December 24th మధుని నాగవల్లి ఇంటికి రావడం మ్యాడీ నిశ్చితార్థం అని తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చందు దిగులుగా ఉంటే ఏమైందని సరళ అడుగుతుంది. చందు తల్లితో నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని చెప్తాడు. సరళ బిత్తరపోతుంది. నెలరోజులు గడువు ఇచ్చారు.. ఈ లోపు వివరణ ఇవ్వకపోతే పర్మినెంట్‌గా ఉద్యోగం ఉండదు అని అంటాడు. అంత తప్పు ఏం చేశావురా అని అడిగితే నేను కాదు లోహిత.. గత సెమిస్టర్‌లో క్వశ్చిన్ పేపర్ లీక్ చేసింది. తనతో పాటు ఉన్న ఫ్రెండ్ పలుకుబడి ఉన్నందుకు ఆమె తప్పించుకుంది కానీ లోహిత తప్పించుకోలేదు అని అంటాడు.
సరళ కోపంగా అది ఇలా తయారైంది ఏంట్రా.. తను నాశనం అవ్వడమే కాకుండా నిన్ను కూడా నాశనం చేస్తుందా అని వెంటనే లోహితకు కాల్ చేసి అర్జెంటుగా ఇంటికి రావే నీ వల్ల మీ అన్నయ్య జాబ్ పోయింది అని విషయం చెప్తుంది. అనవసరంగా ఆ బోడి ఉద్యోగం అవసరం లేదులే మినిస్టర్ మేనకోడలు నా ఫ్రెండ్ తనతో చెప్పి అన్నయ్యకి ఏదో ఒక జాబ్ ఇప్పిస్తానులే అంటుంది. చందు, సరళ ఇద్దరూ షాక్ అయిపోతారు. అంత పెద్దదానివి అయిపోయావే నువ్వు అని సరళ అడిగితే మీ సంపాదన మీద బతకడం లేదు కదా నేను పార్ట్ టైం చేసుకొని నా డబ్బుతో బతుకుతున్నా అని అంటుంది లోహిత.
చందు కోపంగా ఆ పీజీ ఎక్కడో చెప్పవే నేను వచ్చి చూస్తా ఎంత సంపాదిస్తున్నావో అని అడుగుతాడు. దానికి లోహిత నా పరీక్షలు కాగానే చెప్తా అప్పుడు పుట్టింటికి తీసుకెళ్లండి అని అంటుంది. పుట్టిళ్లు ఏంటే నువ్వు ఏదో అత్తింట్లో ఉన్నట్లు అని సరళ అంటే పీజీ అంటే అత్తిళ్లు అని మధు అంది కదా అని కవర్ చేస్తుంది. లోహితను చూస్తే ఏదో అనుమానంగా ఉంది ముందు అదేంటో తెలుసుకోవాలి అంటాడు.
నాగవల్లి, ప్రమీల మ్యాడీ దగ్గరకు వెళ్తారు. నిశ్చితార్థం జరుగుతుంటే సంతోషంగా ఉండాలి నాన్న అని చెప్తుంది. ఇక తన వెంట తెచ్చిన బంగారంలో ఓ గోల్డ్ చైన్ తీసి ఇది పార్వతి అక్కది ఈ శుభసమయంలో తను ఉండుంటే తన చేతితో నీ మెడలో వేసేది కానీ మనకు అంత అదృష్టం లేకుండా చేసిందని ఆ చిన్ని వాళ్ల అమ్మ అని నాగవల్లి ఎమోషనల్ అయిపోతుంది. చిన్ని వాళ్ల అమ్మ చేసిన దారుణాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోను అని మ్యాడీ కోపంగా ఉంటాడు. నిశ్చితార్థం అయిన వరకు మర్చిపోనాన్న అని నాగవల్లి చెప్పి నిశ్చితార్థం సందర్భంగా ఆ అమ్మ వేయాల్సిన చైన్ ఈ అమ్మ వేస్తుందని సంతోషంగా ఉండు నాన్న అని నాగవల్లి మ్యాడీ మెడలో చైన్ వేస్తుంది.
నాగవల్లి వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మ్యాడీ తల్లి ఫోటో ఏంటమ్మా నా ఇష్టం లేకుండా మమ్మీడాడీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటమ్మా అని బాధ పడతాడు. నా కోసం మమ్మీ తన జీవితమే వదులుకుంది. చిన్ని వాళ్ల అమ్మే నిన్ను చంపిందని తెలిసినా.. నేను చిన్నిని ఇష్టపడ్డాను అని నాకు చెప్పలేదు. గడువు పూర్తవ్వడంతో నేను పిచ్చోడిని అయిపోతా అని అప్పుడు చెప్పారు.. కానీ ఇప్పుడు నీ నిశ్చితార్థానికి టైం ఇవ్వకుండా చేసేస్తున్నారు. ఇప్పుడు నా బాధని నువ్వు, మధు మాత్రమే అర్థం చేసుకుంటున్నారు అమ్మా అని బాధ పడతాడు.
మధు నాగవల్లి ఇంటికి వస్తుంది. ఇంటికి డెకరేషన్ చేయడం చూసి ఏమై ఉంటుందా అని అనుకుంటారు. ఇంట్లో ఏ ఫంక్షన్ జరుగుతున్నా సరే దేవా అంకుల్‌లో మా అమ్మ గురించి మాట్లాడాలి అని మధు అంటుంది. మధుని శ్రేయ, లోహిత చూసి ఇదేంటి దీనికి ఎవరు చెప్పారు అని అనుకుంటారు. ఇంతలో నాగవల్లి వెళ్లి వెల్ కమ్ మధు అని చెప్పి నీకు ఇస్తానన్న సర్‌ఫ్రైజ్ ఏంటో తెలుసా మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం అని మధుకి షాక్ ఇస్తుంది. మ్యాడీ నిశ్చితార్థం నువ్వే దగ్గరుండి చేయాలి.. రేపు పెళ్లి కూడా ఇలాగే చేయాలి అని అంటుంది.
నిన్ను ప్రేమించిన వాడి పెళ్లి కల్లారా చూసి కల్లారా ఏడుస్తావ్ అది అదృష్టమే కదా వెళ్లు వెళ్లు మ్యాడీ గదిలో రెడీ అవుతున్నాడు. వెళ్లి వాడి పనులు ఏమైనా ఉన్నాయేమో చూడు హ్యాపీగా చేద్దువు గానీ అని అంటుంది. మధు మ్యాడీ దగ్గరకు వెళ్తుంది. మధు నువ్వా అని మ్యాడీ అంటాడు. నాకు తెలీకుండా నిశ్చితార్థం చేసుకుంటావా అలిగాను అని మధు అంటుంది. రాత్రే తెలిసింది అని నీకు చెప్దామంటే లోహిత వాళ్లు ఆ రాక్షసి గురించి మాట్లాడారు. ఆ చిన్ని గురించి మాట్లాడితే కోపంగా ఫోన్ విసిరేశా అని అంటాడు. చిన్ని మీద ఇంక కోపంగా ఉందా మ్యాడీకి అని మధు అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















