Illu Illalu Pillalu Serial Today December 24th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వ ప్రేమ ట్రాప్.. ధీరజ్, ప్రేమల మధ్య పెద్ద గొడవ! అమూల్యని అలా చూసేసిన నర్మద!
Illu Illalu Pillalu Today Episode Dec 24th అమూల్య తనని ప్రేమిస్తుందని వద్దని చెప్పినా వినకుండా పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా అంటుందని విశ్వ ప్రేమకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode వల్లీ క్లాస్‌కి వెళ్తే పిల్లలు మొత్తం ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ పాఠం చెప్పమని అడుగుతారు. చెప్తా కంగారు పడకండిరా అని వల్లీ అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడమని అంటారు. చివరకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించకుండా ట్వింకిల్ ట్వింకిల్ లిటిలిస్టార్ అని నేర్పిస్తుంది. ఇది మేం నర్సరీలోనే నేర్చేశాం అని అంటారు.
పిల్లలు వచ్చి వాళ్ల డౌట్లు అడిగితే వల్లీ దెబ్బకి కళ్లు తిరిగి పడిపోతుంది. వల్లీని భాగ్యం, ఆనంద్‌రావులు తీసుకెళ్లి కూర్చొని ఎంతకి మాట్లాడుకున్నావ్ నాకు సగం జీతం ఇవ్వు అని అడుగుతారు.దాంతో వల్లీ ఇద్దరినీ బాటిల్ పట్టుకొని కొట్టడానికి తరుముతుంది. మీరేమో ఎంఏ ఇంగ్లీష్ అన్నారు.. నర్మద, ప్రేమలు ఇక్కడ పడేశారు.. నాకు పొట్ట విప్పితే అక్షరం రాదు అని తల బాదుకుంటుంది. ప్రేమ, నర్మద నాతో ఫుడ్ బాల్ ఆడుతున్నారు.. ఇక మీరు నన్ను వదిలేయండి అని అంటుంది. అయితే ఆ విశ్వ ఇచ్చిన పది లక్షల సంగతి ఏంటి అని అడుగుతారు.
వల్లీ వెళ్లపోతుంటే విశ్వ అక్కడికి వస్తాడు. నన్ను ప్రశాంతంగా ఉంచవారా చచ్చిపోతున్నా అంటే ధీరజ్ నన్ను, అమూల్యని చూసేశాడని విశ్వ చెప్తాడు. వల్లీ టెన్షన్ ఫ్రస్టేషన్‌తో ఏడుస్తుంది. ఇప్పుడేం చేయాలా అని అనుకుంటూ భాగ్యంతో నాకు అడ్డమైన సలహాలు ఇచ్చి గుండె పోటు వరకు తెచ్చారు కదా తనకు కూడా ఓ సలహా ఇవ్వు లేదంటే మా మామయ్య చంపేస్తాడు అని అంటుంది. భాగ్యం విశ్వతో ప్రేమించుకున్న వాళ్లు చాటుగా ఉండాలి అలా ఇలా అని నీతులు చెప్తే విశ్వ బెల్ట్ తీస్తాడు. దాంతో భాగ్యం ఐడియా చెప్తా అని అంటుంది. వాళ్లలో వాళ్లు కొట్టుకు చావాలి.. నీకు అమూల్యకి పెళ్లి అవ్వాలి అంటే వెంటనే మీ చెల్లికి కలువు అంటుంది. దాంతో వెంటనే విశ్వ ప్రేమ దగ్గరకు వెళ్తాడు. ఇదేంటిఇలా వెళ్లిపోయాడు అని వల్లీ అంటే అక్కడేం జరుగుతుందో నేను నీకు చెప్తా అని అంటుంది.
ప్రేమ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే విశ్వ వెళ్తాడు. నీతో మాట్లాడాలి ప్రేమ అని అంటాడు. నువ్వేం మాట్లాడుతావో నాకు తెలుసు ధీరజ్‌ని వదిలేయ్.. మన ఇంటికి వచ్చేయ్ అంటావు నాకు నీతో మాట్లాడాలి అని లేదు అంటుంది. దానికి విశ్వ ధీరజ్ గురించి కాదు అమూల్య గురించి అని అంటాడు. దాంతో ప్రేమ షాక్ అయిపోతుంది. అమూల్య గురించి ఏంటి అని అడుగుతుంది. అన్నీ వివరంగా చెప్తాను అని ప్రేమని పక్కకి తీసుకెళ్తాడు.
ధీరజ్‌ని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంటే కోపం వచ్చింది కానీ అది తప్పు కాదు అని తర్వాత తెలిసింది ఎందుకంటే నువ్వు ధీరజ్‌ని ప్రేమించినట్లు అమూల్య నన్ను ప్రేమిస్తుందని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్‌రా అని ప్రేమ అన్న కాలర్ పట్టుకుంటుంది. అమూల్య తనని తనలా చూసిందని.. నేనంటే ప్రాణం అంట.. నేను లేకపోతే చచ్చిపోతా అని అంటుంది అని అమూల్యనే తనని ప్రేమించి అమూల్యనే తనకి ప్రపోజ్ చేసినట్లు విశ్వ ప్రేమకి అబద్ధం చెప్తాడు. అమూల్య పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటా లేదంటే చచ్చిపోతా అని అంటుందని వద్దని చెప్పినా వినడం లేదు అని చెప్పి నువ్వు అమూల్యతో మాట్లాడు అని అంటాడు.
ఇంతలో ధీరజ్ వచ్చి నా చెల్లినే ట్రాప్ చేస్తావా అని విశ్వని కొడతాడు. ప్రేమ ఎంత అడ్డుకున్నా ఆగడు. ఓ పెద్ద బండరాయితో విశ్వని కొట్టబోతే ప్రేమ ధీరజ్‌ని తోసేసి చెంప మీద కొడుతుంది. తర్వాత ధీరజ్ కూడా ప్రేమని కొడతాడు. నా చెల్లినే కొడతావా అని విశ్వ వస్తే ప్రేమ విశ్వని ఆపేసి పంపేస్తుంది. ప్రేమ, ధీరజ్ కోపంగా చూసుకుంటారు. ఇదీ జరిగబోయేది అని భాగ్యం వల్లీతో చెప్తుంది.
విశ్వ వేసిన మంటతో ప్రేమ, ధీరజ్ మధ్య మంట మొదలైందని ఇక నర్మద దగ్గర మరో మంట అంటుకోవాలని చెప్తుంది. నర్మద డ్యూటీ అయి అప్పుడే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే నర్మదకు ఎదురుగా విశ్వ, అమూల్య ఒకే బైక్‌లో వెళ్లాలి అంటుంది. నర్మద ఇద్దరినీ చూసి షాక్ అయిపోతుంది. నర్మద వెంటనే సాగర్‌కి కాల్ చేస్తుంది. అమూల్య గురించి మాట్లాడాలిరా అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















