ఫరియా అబ్దుల్లా హైట్... బర్త్ డే... పర్సనల్ డీటెయిల్స్ తెలుసా?

Published by: Satya Pulagam

'జాతి రత్నాలు'తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. ఆవిడ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోండి.

'జాతి రత్నాలు' ట్రైలర్ లాంచ్‌లో ఫరియా అబ్దుల్లాను చూసి 'ఈ అమ్మాయి ఏంటి? ఇంత హైట్ ఉంది!' అంటారు ప్రభాస్. ఆమె హైట్ 5.8 అడుగులు.

ఉర్దూ స్పీకింగ్ ముస్లిం ఫ్యామిలీలో ఫరియా అబ్దుల్లా జన్మించింది. సంజయ్ అబ్దుల్లా, కౌసర్ అబ్దుల్లా ఆమె పేరెంట్స్.

జూన్ 21, 1998లో ఫరియా అబ్దుల్లా జన్మించింది. ఆమె హైదరాబాదీ అమ్మాయి. పుట్టిందీ, పెరిగిందీ సిటీలోనే.

సికింద్రాబాద్‌లోని లయోలా కాలేజీలో ఫరియా అబ్దుల్లా చదువుకుంది. మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ చేశారు.

ఫరియా అబ్దుల్లా థియేటర్ ఆర్టిస్ట్. హీరోయిన్ అవ్వక ముందు స్టేజి షోలు చేశారు. ఆవిడ మంచి డ్యాన్సర్ కూడా!

ఫరియా అబ్దుల్లాలో హీరోయినే కాదు... మ్యూజిషియన్ కూడా ఉన్నారు. ఆవిడ సాంగ్స్ కంపోజ్ చేసి పాడారు కూడా.

'మత్తు వదలరా 2'లో 'డ్రామా నక్కో మామ' సాంగ్ రాసిందీ, పాడినదీ ఫరియా అబ్దుల్లానే. 'గుర్రం పాపిరెడ్డి' కోసం మరో సాంగ్ చేశారు.

ఆహా ఓటీటీలో 'డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2'లో జడ్జిగా చేశారు ఫరియా అబ్దుల్లా. కొన్ని టీవీ షోస్ చేశారు.