అన్వేషించండి

Podharillu Serial Today December24th: మహా రిజిస్ట్రర్ మ్యారేజీ ఖచ్చితంగా ఆపించేస్తానన్న చక్రి..? మాహాతోపాటు వాళ్ల ఇంటికి చక్రి ఎందుకు వెళ్లాడు..?

Podharillu Today Episode December 24th: పెళ్లి షాపింగ్ ముగియడంతో మహా సహా అందరూ తిరుగుప్రయాణం అవుతారు. చక్రి కూడా వాళ్లతోపాటు వెళ్తాడు. రిజిస్ట్రర్ మ్యారేజీ జరగకుండా చూస్తానని మహాకు హామీ ఇస్తాడు.

 Podharillu Serial Today Episode: మహా రిజిస్ట్రర్‌ మ్యారేజీ పనులు చురుగ్గా సాగుతుంటాయి. హైదరాబాద్‌లో పెళ్లి షాపింగ్ పూర్తవ్వడంతో....యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకుని మహావాళ్లు తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. దీంతో చక్రిని ఇకపై రావొద్దని ఆది చెబుతాడు.  ఆ మాటలకు చక్రి చాలా ఫీలవుతాడు. మహాను  లైన్‌లో పెడదామనుకుంటుంటే... ఇప్పుడు డ్రైవర్‌ ఉద్యోగం నుంచి వెళ్లిపొమ్మంటున్నారే అనుకుంటాడు. తమను యాదగిరిగుట్టలో దింపి నువ్వు వెళ్లిపోవచ్చని ఆది చెబుతుండగా....అప్పుడే  అక్కడికి వచ్చిన ప్రతాప్‌...మాకు పెళ్లి అయ్యేవరకు తాత్కాలిక డ్రైవర్‌ కావాలని నువ్వు మా  ఊరు వచ్చి ఉండగలవా అని అడగడంతో చక్రి ముఖంలో వెలుగు వస్తుంది. తప్పకుండా తానే వస్తానని ప్రతాప్‌తో అంటాడు. దీంతో అందరూ కలిసి యాదగిరి గుట్ట బయలుదేరతారు.

యాదగిరి గుట్ట వెళ్తుండగా మార్గమధ్యలోచిన్న స్పీడ్‌బ్రేకర్ వద్ద కారు ఎత్తివేయడంతో ప్రతాప్‌ కంగారుపడి  మహాకు ఏమైనా అయ్యిందా అని అడుగుతాడు. చక్రిని చిన్నగా బండి పోనివ్వాలని అరుస్తాడు. అలాగే దారిలో మహాకు ఇష్టమైన స్వీట్‌ కొనాలి ఆపమని డ్రైవర్‌ను ఆదేశిస్తాడు. దీంతో మహా వాళ్ల నాన్నపై కోప్పడుతుంది. నాకు చిన్న దెబ్బతగిలినా ఓర్చుకోలేని మీరు...నా లైఫ్‌కు సంబంధించిన విషయంలో మాత్రం ఎందుకు ఇంత కఠినంగా ఉంటున్నారని నిలదీస్తుంది. నాకు ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేస్తున్నారని మండిపడుతుంది. ఈ డిష్కషన్‌లో మహాకు భూషణ్‌ను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదన్న సంగతి చక్రికి తెలిసిపోతుంది. అందరూ  స్వీట్స్‌ కొనడానికి కిందకు దిగడంతో  మహా ఒక్కరే కారులో ఉంటుంది. దీంతో చక్రి ఆమెకు ధైర్యం చెప్పడానికి  ట్రై చేస్తుంటాడు. ఈ రిజిస్ట్రర్ మ్యారేజీ ఆగిపోతుందని...మీరు భయపడొద్దని చెబుతాడు.
 
ఇంటికి తిరిగివచ్చిన మహా భోజనాల దగ్గర మళ్లీ ఈ పెళ్లివద్దని గొడవ చేస్తుంటుంది. అతని సంగతి తెలిసే వాళ్ల అమ్మానాన్న ఈపెళ్లి ఎక్కడ చెడగొడతాడోనని ముందుగానే రిజిస్ట్రర్‌ మ్యారేజీ చేయాలని అనుకుంటున్నట్లు ఉన్నారని వాళ్ల నాన్నతో అంటుంది.  ఒక ఆడపిల్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వని వాడితో జీవితాంతం ఎలా కాపురం చేయాలని అంటుంది. నువ్వు నెగిటివ్‌గా ఆలోచించవద్దని... ప్రతాప్ సర్దిచెబుతాడు. ఈవిషయంలో ఎలాంటి మార్పు లేదని....అతనిపై నీకు ఉన్న అభిప్రాయం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని తల్లి తేల్చి చెబుతుంది. దీంతో మహా అలిగి అన్నం తినకుండా  వెళ్లిపోతుంది.

బయట ఆకలితో చక్రి అటూ ఇటు తిరుగుతుంటాడు. ఇంతలో మహా అక్కడికి వచ్చి కూర్చుంటుంది. నేను బయటకు వెళ్లి అన్నం తిని రావాలా అని అడుగుతాడు. మీ భోజనాల దగ్గర ఏదో గొడవ జరిగినట్లు ఉంది కదా...నాకు అన్నం పెడతారో లేదో అని అంటాడు. దీంతో మహా లోపలికి వెళ్లి అన్నం పట్టుకుని వస్తుంది. చక్రి వాటిని తీసుకుని కిందకూర్చుని తినబోతుంటే..ఛైర్‌లో కూర్చుని తినమని చెబుతుంది. అతను తింటూ  మీ చేతివంట అద్భుతంగా ఉందని చెప్పడంతో....నాకు వంట చేతగాదని మహా చెబుతుంది.

ఇంతలో రిజిస్ట్రర్ మ్యారేజీ నేను ఆపిస్తానని చెప్పాను కదండి...మీరు మళ్లీ బాధపడొద్దని అంటాడు. దీంతో మహాకు కోపం వచ్చి చక్రిపై అరుస్తుంది. నీకు ఈవిషయంతో ఏం సంబంధం...నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని నిలదీస్తుంది. అసలు నా పెళ్లి ఆపడానికి నువ్వు ఎవరని గట్టిగా మండిపడుతుంది. ఒక ఆడపిల్లకు సాయం చేయడం కూడా తప్పా అని అంటాడు. రిజిస్ట్రర్ మ్యారేజీ జరగకుండా చూస్తానని హామీ ఇస్తాడు. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today July 8th Episode: ఇదిగో తాళి, చక్రి నా భర్త, వరాలుకి ఇచ్చి పడేసిన మహాలక్ష్మి - పొదరిల్లు జూలై 08 ఎపిసోడ్!
పొదరిల్లు జూలై 08 ఎపిసోడ్: ఇదిగో తాళి, చక్రి నా భర్త, వరాలుకి ఇచ్చి పడేసిన మహాలక్ష్మి
Gundeninda Gudigantalu July 08 Episode: బాలు త్యాగం, బుద్ధి చూపించిన రోహిణి, మనోజ్ కి చూపు వస్తుందా? గుండెనిండా గుడిగంటలు జూలై 08 ఎపిసోడ్!
గుండెనిండా గుడిగంటలు జూలై 08 ఎపిసోడ్: బాలు త్యాగం, బుద్ధి చూపించిన రోహిణి, మనోజ్ కి చూపు వస్తుందా?
Karthika Deepam 2 Serial Today July 8th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని దక్షిణామూర్తి కోడలా? అంటే సూరజ్‌ తల్లా..! అసలు నిజం తెలిసేదెప్పుడు?
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని దక్షిణామూర్తి కోడలా? అంటే సూరజ్‌ తల్లా..! అసలు నిజం తెలిసేదెప్పుడు?
Brahmamudi Serial Today July 8th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేత బలవంతంగా సంతకం చేయిస్తున్న రేఖ – మధ్యలో అడ్డుపడిన నందు
‘బ్రహ్మముడి’ సీరియల్: ఇందు చేత బలవంతంగా సంతకం చేయిస్తున్న రేఖ – మధ్యలో అడ్డుపడిన నందు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Gambhir Silence Broken: సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
సంజూ శాంసన్ ను పక్కన పెట్టడంపై క్లారిటీ.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై సంచలన కామెంట్స్!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Vizag Fishermen Missing: మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొల్లు రవీంద్రను అడ్డుకున్న మత్స్యకారులు.. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో తీవ్ర ఉద్రిక్తత
Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Embed widget