Chinni Serial Today September 20th: చిన్ని సీరియల్: డ్రాయింగ్‌లో ట్విస్ట్.. మహిలో ఆశలు! బాలరాజుకి దశదినకర్మ ఏంటి?
Chinni Serial Today Episode September 20th బాలరాజు చనిపోయినట్లే దేవా వాళ్లు యాడ్ ఇవ్వడం.. చందు చూసి తల్లి, చెల్లికి చూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీకి లవర్ ఉందని తెలిసి మధు చాలా ఏడుస్తుంది. మ్యాడీ కాఫీ షాప్ నుంచి మధుని డ్రాప్ చేస్తే మధు ఏడుస్తూ వెళ్తుంటుంది. ఇంతలో మ్యాడీ వెనక్కి వచ్చి ఏమైంది మధు ఎందుకు డల్‌గా ఉన్నావ్..అని మధుని నవ్వించి లోపలికి పంపిస్తాడు.
మధు ఏడుస్తూ గదిలోకి వెళ్లడం స్వప్న చూస్తుంది. స్వప్న దగ్గరకు వెళ్లి ఏమైందని అడుగుతుంది. మ్యాడీకి నీ లవ్ మేటర్ చెప్పావా అంటే చెప్పలేదే అని మధు ఏడుస్తుంది. మ్యాడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తన మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు.. తను వేరే వాళ్లని ఇష్టపడుతున్నాడు అని తెలిసి కూడా నేను ప్రేమించడం స్వార్థం అవుతుంది. మ్యాడీ తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా ఉండాలి అనుకుంటుంది. స్వప్న అని మధు చాలా చాలా ఏడుస్తుంది.
దేవా వాళ్లతో పాటు మహి, వరుణ్ అందరూ భోజనానికి కూర్చొంటారు. వరుణ్‌కి సెంట్రల్ మినిస్టర్ కూతురితో సంబంధం కుదిరిందని శ్రేయ మహికి చెప్తుంది. మహి వరుణ్‌కి కంగ్రాట్స్ చెప్పి నీకు పొలిటికల్స్ ఇష్టం కాబట్టి నీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని అంటాడు. ఇంతలో వసంత మహితో అన్నీ కుదిరితే ఒకే ముహూర్తానికి రెండు పెళ్లిళ్లు జరిగిపోతాయని మహి, శ్రేయల పెళ్లి గురించి అంటుంది. మహి అత్తతో బావ గురించి మాట్లాడుతున్నారు సంతోషంగా ఉంది కానీ ఆ పెళ్లికి నా పెళ్లిని పోల్చుతూ నా పెళ్లి గురించి మాట్లాడి డిసప్పాయింట్ అవ్వడం అవసరమా అని అంటాడు. నాకు చిన్ని వస్తుందనే నమ్మకం ఉంది అంటాడు. దేవా మహితో నీకు ఇచ్చిన గడువు అయిపోతుందని గుర్తు పెట్టుకో అని అంటాడు. నా చిన్ని ఎక్కడున్నా నాకు దొరుకుతుంది.. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని మహి అనగానే దేవా భోజనం చేయకుండా కడిగేసి నీ డెడ్ లైన్ అయిపోతే మేం చెప్పినట్లు నువ్వు చేయాలి.. రేపు సెంట్రల్ మినిస్టర్ వస్తారు. రెండు పెళ్లిళ్లు గురించి మాట్లాడాలి.. వరుణ్ నీకు కూడా మీ బావలా ప్రేమ అనే వైరస్ ఉందా అంటే వరుణ్ లేదు అనేస్తాడు. మంచిది నువ్వు అయినా ఈ మామయ్య గౌరవం కాపాడావు అని అంటాడు.
వల్లి కూడా భోజనం ఆపేసి వెళ్లిపోతుంది. అందరూ వెళ్లిపోతారు. మహి బాధ పడుతుంటే వరుణ్ వెళ్లి ధైర్యం చెప్తాడు. నువ్వు నిజం నీ ప్రేమ నిజం నీలాంటి మంచోడికి ఆ దేవుడు ఓడిపోనివ్వడు అని చెప్తాడు. ఇక మ్యాడీ అక్కడే ఉన్న మ్యాడీ డ్రాయింగ్ చూసి ఇదేంటి అని అడుగుతాడు. చాలా బాగుంది అని వరుణ్ చెప్తాడు. ఆ డ్రాయింగ్ బ్యాక్ సైడ్ మహి చిన్నప్పటి డ్రాయింగ్ చూసి ఇది చూశావా బావ అని చూపించి ఇప్పటి నీ ఫొటో చూసి చిన్నప్పటి ఫొటో వేశాడు అంటే అతను జీనియస్ అని వరుణ్ అంటే మహి చాలా సంతోషపడతాడు.
మహి సంతోషంతో ఇప్పటి నా ఫొటో చూసి చిన్నప్పటి ఫొటో గీశాడు అంటే చిన్న చిన్నప్పటి ఫొటో చూసి ఇప్పుడు ఎలా ఉందో వేస్తాడు కదా అని అంటే కచ్చితంగా అని వరుణ్ అంటాడు. ఇక మహి అతనికి ఫోన్‌పే చేసిన నెంబరుకి కాల్ చేస్తాడు. కనెక్ట్ కాదు ఉదయం మాట్లాడాలి అనుకుంటాడు. చిన్ని నువ్వు ఎలా ఉంటావో రేపు చూస్తా అని అనుకుంటాడు.
లోహిత వరుణ్‌కి మినిస్టర్ సంబంధం వచ్చినందుకు చాలా భయపడుతుంది. ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు నా పరిస్థితి ఏంటా అనుకుంటుంది. వరుణ్‌కి మెసేజ్ చేద్దాం అని ఫోన్ చూస్తే కనిపించదు.. ఎక్కడ పెట్టానా అని వెతుకుతుంది. ఇక చందు పేపర్ చూస్తూ బాలరాజు దశదిన ఖర్మ అని యాడ్ చూస్తాడు. కంగారుగా సరళని పిలుస్తాడు. పేపర్ చూపించి మామయ్యది దశదిన ఖర్మ అంట అని చెప్తాడు. లోహిత పేపర్ చింపేసి వీడు మనకు మామయ్య ఏంటి.. ఈ వెదవ వల్లే కదా మన నాన్న చనిపోయారు.. అయినా ఎవడు మామయ్య ఎవరికి మామయ్య అని కోప్పడుతుంది. సరళ కూడా తిడితే చనిపోయిన వాళ్ల మీద కోపం ఎందుకు అమ్మ నా కోసంరా ఆ అడ్రస్‌కి వెళ్దాం అని చందు అంటే సరళ మనసులో ఆస్తి ఏమైనా ఉందేమో దాని కోసం అయినా వెళ్దాం అని అనుకుంటుంది. సరళ, చందు ఇద్దరూ వెళ్తారు. వల్లి తన మనుషులకు కాల్ చేసి దశదిన ఖర్మ ఏర్పాటు చేస్తుంది. అక్కడ అందర్ని కనిపెడుతూ ఉండమని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















