Chinni Serial Today May 30th: చిన్ని సీరియల్: కావేరి, బాలరాజుల్ని పెళ్లికి ఒప్పించిన చిన్ని.. శత్రువుల్ని పెళ్లిబట్టల్లో చూసి షాక్‌లో దేవా!
Chinni Today Episode మళ్లీ పెళ్లి చేసుకోమని చిన్ని కావేరి, బాలరాజులను ఒప్పించి గుడికి తీసుకురావడం దేవా ఇద్దరినీ పెళ్లి బట్టల్లో చూసి బాలరాజుని చంపాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని నానమ్మతో అమ్మానాన్నలకు మళ్లీ పెళ్లి చేస్తే ఇద్దరితో నేను కలిసి ఉండొచ్చు అని చిన్ని అంటుంది. ఇద్దరూ ఒప్పుకోరు అని భారతి అంటే గుడికి తీసుకెళ్లి చెప్పకుండా పెళ్లి చేసేద్దాం అని చిన్ని అంటుంది. రాజుతో రేపు గుడికి వెళ్దాం అని చెప్తుంది. ఉదయం నాగవల్లి రెడీ అయితే ప్రమీల చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అక్క ఇలా చూస్తున్నావ్ అంటే మహి గుడికి వెళ్దామని అన్నాడని చెప్తుంది.
మహి వచ్చి చిన్ని కోసం మొక్కుకున్నాను అనడంతో నాగవల్లి, దేవేంద్ర వర్మ పని ఉందని రామని అంటారు. మహి పట్టు పట్టడంతో వస్తామని అంటారు. నాగవల్లిని ఒప్పించి దేవా తీసుకెళ్తాడు. ఇక చిన్ని రెడీ అయి కావేరి కోసం ఎదురు చూస్తుంది. కావేరి రావడంతో చీర ఇచ్చి కొట్టుకొని రమ్మని చెప్తుంది. బాలరాజు పట్టు బట్టలు కట్టుకొని వస్తాడు. తర్వాత కావేరిని పట్టు చీరలో చూసి అలా చూస్తూ ఉండిపోతాడు. చిన్ని కావేరిని తీసుకొచ్చి మా అమ్మ అచ్చం పెళ్లి కూతురిలా ఉంది అంటుంది. దానికి భారతి నా కొడుకు అచ్చం పెళ్లి కొడుకులా ఉందని అంటుంది. అందరూ కలిసి గుడికి వెళ్తారు.
లాయర్ హరి పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో చిన్ని వాళ్లు రావడం చూసి వాళ్ల దగ్గరకు వెళ్తాడు. అందరి ముందు చిన్ని అమ్మ నీకు నాన్నకి పెళ్లి చేస్తున్నాను అని చెప్తుంది. ఏంటే నువ్వు ఇలా చేస్తున్నావ్ అని కావేరి చిన్నిని అడుగుతుంది. భారతి కావేరితో తనేం అర్థం లేకుండా చేయడం లేదు మంచే చేస్తుంది అంటుంది. చిన్ని చేస్తున్నది తప్పు అని చెప్పొచ్చు కదా అని బాలరాజు అంటే తనేం తప్పు చేయలేదు అని భారతి అంటుంది. చిన్ని కావేరితో నాన్నని నువ్వు అర్థం చేసుకున్నావ్ తప్పు చేయలేదు అని నమ్మావు. నాన్నతో వెళ్లిపోవడానికి కూడా సిద్ధ పడ్డావు కదా అందుకే పెళ్లి చేసుకో అమ్మా అని అంటుంది. కావేరి చిన్నితో నీ కోసమే నేను తనతో వెళ్లాలని అనుకున్నా అని అంటుంది.
బాలరాజు చిన్నితో అమ్మని బాధ పెట్టకు చిన్ని అని అంటాడు. దానికి చిన్ని నా సంతోషం అమ్మ ఎలా కోరుకుంటుందో నేను అమ్మ సంతోషం అలాగే కోరుకుంటున్నా నాన్నా అని చిన్ని ఏడుస్తుంది. నీ భర్త ఎవరు అని అందరూ జైలులో అడిగినా తనలోనే తాను కుమిలిపోయింది అని తల్లి బాధని చిన్ని తండ్రికి చెప్తుంది. అమ్మ పక్కన నువ్వు ఉంటే అమ్మకి గౌరవం పెరుగుతుందని చిన్ని చెప్తుంది. లాయర్ హరి కూడా కావేరికి చిన్ని చెప్పింది నిజమే ఆలోచించు కనపడని శత్రువుతో నువ్వు పోరాడాలి అంటే బాలరాజు నీ పక్కనే ఉండాలి. మీరు ఇద్దరూ కలిసి ఉంటే నిన్ను జైలుకి పంపిన వ్యక్తి మీ ఇద్దరూ కలిసి తనని ఎక్కడ శిక్షిస్తారో అని భయపడతారు కదా ఆలోచించు అని అంటాడు. భారతి, ఆఫ్ టికెట్ కూడా కావేరికి ఒప్పించాలని ప్రయత్నిస్తారు.
చిన్ని కావేరి కాళ్లు పట్టుకొని మా నాన్నని పెళ్లి చేసుకో అమ్మ అని బతిమాలుతుంది. కావేరి చిన్నిని పైకి లేపి గుండెలకు హత్తుకొని సరే అని చెప్తుంది. కావేరిని రెడీ చేయడానికి భారతి, చిన్ని రెడీ చేయడానికి తీసుకెళ్తారు. బాలరాజుని హరి, ఆఫ్ టికెట్ తీసుకెళ్తారు. మరోవైపు మహిని తీసుకొని దేవా గుడికి వస్తాడు. మహి తండ్రితో డాడీ పూజ చేయిస్తున్నాం కదా దేవుడు చిన్ని కోరిక తీరుస్తాడు కదా అని అడుగుతాడు. దాంతో తీరుస్తాడు అని దేవా అంటాడు. ఇక ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లి కావేరి పెళ్లి కూతురిలా రెడీ అవడం చూసి షాక్ అయిపోతాడు. అసలు ఇక్కడేం జరుగుతుంది అని చూస్తాడు. బాలరాజు కూడా పెళ్లి కొడుకులా రెడీ అవడం చూసి కావేరి మెడలో తాళి కట్టిన బాలరాజుని ఇక్కడే చంపేస్తా అని అనుకొని రౌడీకి కాల్ చేసి రమ్మని చెప్తాడు. ఇక కావేరి, బాలరాజు పెళ్లి బట్టల్లో పెళ్లి పీటల దగ్గరకు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్..!





















