Chinni Serial Today May 27th: చిన్ని సీరియల్: తండ్రి కోసం సరళ కాళ్లు పట్టుకొన్న చిన్ని.. సరళ రాజు నిర్దోషి అని నమ్ముతుందా!
Chinni Today Episode బాలరాజు సత్యంబాబుని చంపలేదు అని అతని మీద అనుమానం లేదని కోర్టులో చెప్పమని సరళ చిన్నిని బతిమాలడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి సరళకు కాల్ చేస్తుంది. ఉష తిన్నింటి వాసాలు లెక్కపెడుతుందని మీ పసుపు కుంకుమలు చెరిపేసిన ఆ బాలరాజు మంచి వాడని కోర్టులో చెప్పిందని అలాంటి మనిషిని ఇంట్లో పెట్టుకోవడం పాముకి పాలు పోసి పెంచినట్లే అని అంటుంది. దానికి సరళ ఫోన్ పెట్టేసిన తర్వాత నా ఇంట్లో ఉంటూ నాకు సపోర్ట్ చేయకుండా ఆ బాలరాజుకి సపోర్ట్ చేస్తుందా చెప్తా దాని సంగతి అని అనుకుంటుంది.
కావేరి ఇంటికి రావడం చూసి పెట్టే విసిరేస్తుంది. ఏమైంది అలా ఉన్నారు అని కావేరి అడిగితే చేయాల్సింది అంతా చేసి అలా అడుగుతున్నావా కోర్టుకి వెళ్లి వాడికి సాక్ష్యం చెప్తావా.. బ్రో బ్రో అని మా ఆయన మీద చూపించిన ప్రేమ అంతా నాటకమేనా.. ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్నా చెల్లి గుండెల మీద తన్ని బాలరాజుతో వెళ్లిపోయింది. తర్వాత చిన్ని వచ్చి మాకు ప్రశాంతత లేకుండా చేసింది. మా ఆయన ఎవరి మీద ప్రేమ పెంచుకున్నారో వాళ్లంతా మా కొంప ముంచిన వారే ఇప్పుడు నువ్వు కూడా ఆ లిస్ట్‌లోకి చేరిపోయావ్ అని అడుగుతుంది. కావేరి వదినతో నేను మీకు సపోర్ట్ చేశాను. బాలరాజు నిజంగా ఆ నేరం చేయలేదు వేరే ఎవరో చేసి బాలరాజు మీద వేశారు అంటుంది.
సరళ ఏం చెప్పొద్దు అని బాలరాజుకి సపోర్ట్ చేసిన వాళ్లు నా ఇంట్లో ఉండకూడదు అని వాడికి ఉరి శిక్ష పడాలి అని ఏడుస్తూ సరళ వెళ్లిపోతుంది. లాయర్ హరి పోలీస్ స్టేషన్‌కి వెళ్తాడు. బాలరాజుతో మాట్లాడుతాడు. వారం రోజులో నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవడానికి మనకు సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు అన్నీ వాళ్లకే బలంగా ఉన్నాయి. అసలు ఆ రోజు ఏం జరిగిందో నువ్వు నాకు వివరంగా చెప్పు అంటారు. బాలరాజు మొత్తం చెప్తాడు. మనల్ని ఈ కేసులో దేవా బలంగా ఇరికించేశాడు. ఇంతలో లాయర్‌కి చిన్ని కాల్ చేస్తుంది. బాలరాజుతో మాట్లాడుతుంది. అంతా నా తప్పే నాన్న నేను నిన్ను మంచి వాడిలా మార్చేశాను. మా నాన్న అని చెప్పాను. అంతా నా వల్లే అని ఏడుస్తుంది.
బాలరాజు చిన్నిని అలా అనొద్దు అని ఈ కేసులో నేను ఇరుక్కోవడానికి కారణం ఎవరో నాకు తెలుసు వాళ్లు నన్ను ఇలా చేశారు. నేను త్వరలోనే నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాను అని చెప్తాడు. లాయర్ హరి బాలరాజుతో నేను మొత్తం ఎంక్వైరీ చేస్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తాడు. చిన్ని తనతో బయటకు రావడానికి కష్టంగా ఉందని చెప్పాడని భారతి, ఆఫ్ టికెట్‌తో చెప్తుంది. ఆఫ్ టికెట్ చిన్నితో మీ సరళ అత్త కోర్టులో జడ్జి గారితో మీ నాన్న తప్పు చేయలేదు అని చెప్తే మీ నాన్నకి శిక్ష పడదు అని అంటాడు. చిన్ని వెంటనే వెళ్దామని అంటుంది. భారతి చిన్నిని ఆపుతుంది. మీ అత్తయ్య ఒప్పుకోదని అంటుంది. నేను అత్తయ్యని ఒప్పిస్తాను అని చిన్ని అంటుంది.
చిన్ని, ఆఫ్ టికెట్, లాయర్ సరళ ఇంటికి వెళ్తారు. లోహిత చిన్నిని చూసి సరళకు చెప్తుంది. చిన్ని మీతో ఏదో మాట్లాడాలి అని లాయర్ చెప్తే నాకు ఎవరితో మాట్లాడటం ఇష్టం లేదని చెప్తుంది. చిన్ని సరళతో మా నాన్న మామయ్యని చంపలేదు అత్తయ్య నువ్వు కోర్టుకి వచ్చి మా నాన్న తప్పు చేయలేదు అని చెప్పు అత్త అని కాళ్లు పట్టుకొని బతిమాలుతుంది. కావేరి కూడా సరళని ఒప్పించాలని ప్రయత్నిస్తుంది. నేను చెప్పను నా భర్తని కత్తితో పొడిచిన వీడియో చూసి కూడా వాడికి నేను ఎలా సపోర్ట్ చేస్తాను అని సరళ అంటుంది. మీరు వెంటనే వెళ్లిపోండి ఇంకొక్క నిమిషం ఇక్కడ ఉన్నా ఏం చేస్తానో నాకే తెలీదు అని సరళ అంటుంది. ఎవరు ఎంత బతిమాలిన సరళ ఒప్పుకోదు.. పోయిన నా భర్తని ఎవరు తీసుకొస్తారు అని ఏడుస్తుంది. చిన్నిని నెట్టేస్తుంది. కావేరి పట్టుకొని మీ అత్తయ్య మనసు మారదు మీరు వెళ్లిపోండి అంటుంది. నాన్నకి ఇక బెయిల్ రాదా అని చిన్ని ఏడుస్తుంది. సరళ ఇంటికి దేవా, నాగవల్లి, మహి వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















