Chinni Serial Today May 26th: చిన్ని సీరియల్: బాలరాజుకి అండగా కావేరి.. వారం గడువు.. రాజు నిర్దోషని ఆ ముగ్గురూ నిరూపిస్తారా!
Chinni Today Episode కావేరి బాలరాజుని నమ్మి కోర్డులో బాలరాజు ఏ తప్పు చేయలేదని మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరి, చిన్ని కోర్టుకి వెళ్తారు. లాయర్ హరి అక్కడే ఉంటే వెళ్లి కలుస్తారు. చిన్ని హరితో నాన్న ఇంకా రాలేదా అంకుల్ అంటే ఇంకా లేదమ్మా తీసుకొస్తున్నారు అని అంటారు. బాలరాజుని బయటకు తీసుకురావడం మీ చేతిలోనే ఉంది హరి గారు అని చిన్ని అంటే గారు అవసరం లేదు కావేరి హరి అంటే చాలా అని అంటాడు. తను కావేరి కాదు ఉష అని చిన్ని అంటుంది. మీ మామయ్య నాతో అంతా చెప్పాడు అని హరి అంటారు. కావేరి షాక్ అయిపోతుంది. ఇంతలో పోలీసులు బాలరాజుని తీసుకొస్తారు.
చిన్ని తండ్రి దగ్గరకు పరుగులు తీస్తుంది. మీ నాన్నకి 14 ఏళ్ల శిక్ష పడుతుంది అని పోలీసులు అంటారు. చిన్ని కావేరి దగ్గరకు వెళ్లి ఏడుస్తుంది. కావేరి ధైర్యం చెప్తుంది. దేవేంద్ర వర్మ తన లాయర్‌కి కాల్ చేస్తాడు. బాలరాజుని ఇప్పుడే తీసుకొచ్చారని వాడికి 14 ఏళ్ల శిక్ష పడుతుందని లాయర్ చెప్తాడు. అందరూ కోర్టు లోకి వెళ్తారు. కేసు హియరింగ్‌కి వస్తుంది. బాలరాజు పట్టపగలే నడిరోడ్డు మీద కత్తితో ఒక మనిషిని నరికి చంపాడని పీపీ అంటారు. అందుకు సంబంధించిన వీడియో చూపిస్తారు. బాలరాజు జడ్జితో సార్ నేను ఈ హత్య చేయలేదు సత్యంబాబు పొట్టలో గుచ్చుకున్న కత్తి తీశాను అంతే అని అంటాడు. ఆ వీడియో మార్ఫింగ్ చేశారని లాయర్ హరి చెప్తాడు. దానికి పీపీ బాలరాజు గతంలో చాలా కిడ్నాప్, మర్డర్ కేసులు అతని మీద ఉన్నాయని అందుకే అతన్ని శిక్షించాలని కోరుతారు.
జడ్జి పాత రికార్డ్స్ తిరగేస్తుంటారు. ఇంతలో కావేరి నో అని గట్టిగా అరుస్తుంది. అతను ఆ హత్య చేయలేదు అని అరుస్తుంది. జడ్జి కావేరితో కోర్టులో అరవకూడదమ్మా ఏమైనా చెప్పాలి అనుకుంటే బోనులోకి వచ్చి చెప్పమ్మా అంటారు. కావేరి బోను లోకి వస్తుంది. తను పీఈటీ టీచర్ అని నేను పని చేసే స్కూల్‌లో పిల్లల్ని తీసుకొస్తుంటారు అని పిల్లలకు అతను అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. ఎదుటి వ్యక్తికి సాయం చేసి కూడా ఆ విషయం చెప్పకుండా గోప్యంగా ఉంచే గొప్ప మనిషి అతను అని చెప్తుంది. కావేరి మాటలకు బాలరాజు ఎమోషనల్ అయిపోతాడు. బాలరాజు ఈ హత్య చేశాడు అంటే నేను నమ్మను అంటుంది. ఇంతలో పీపీ మీరు నమ్మకపోయినా కోర్టు నమ్ముతుంది అతనికి గతంలో అంత ట్రాక్ రికార్డ్ ఉంటే అతన్ని ఎవరు నమ్ముతారు అంటే నేను నమ్ముతా అని చిన్ని అంటుంది.
చిన్ని కూడా బోనులోకి వస్తుంది. మా నాన్న గతంలో తప్పు చేయొచ్చు కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని చెప్తుంది. అడవి జంతువుల్ని వేటాడిన వాల్మికి ఒక్క సంఘటనతో మారిపోయి ఆదికావ్యం రామాయణం రాసినట్లు నేను చదివాను సార్ అలాగే మా నాన్న కూడా ఒక్క సంఘటనతో మారిపోయాడు. దయచేసి మా నాన్నని నమ్మండి తను నిర్దోషి అని నిరూపించుకొనే అవకాశం ఇవ్వండి అని ఏడుస్తూ జడ్జికి దండం పెట్టి అడుగుతుంది. అందరూ ఎమోషనల్ అవుతారు. దానికి జడ్జి వారం రోజులు గడువు ఇస్తానని అంటారు. అందరూ చాలా సంతోషిస్తారు. చిన్ని తండ్రిని హగ్ చేసుకుంటుంది. జడ్జి వారం గడువు ఇచ్చారు అంటే నువ్వు నిర్దోషి అని నమ్మినట్లే అని చిన్ని అంటుంది. దానికి బాలరాజు మీ టీచరమ్మ నన్ను నమ్మి నేను నిర్దోషి అని చెప్పినప్పుడే నాకు నమ్మకం వచ్చేసిందమ్మా మీ ముగ్గురు నన్ను బయటకు తీసుకొస్తారు అని అంటాడు.
కావేరి మనసులో బాలరాజు బయటకు వచ్చాక ఆ నాగవల్లి, దేవాల సంగతి చూడాలని అనుకుంటుంది. నాగవల్లి, దేవాలు మాట్లాడుకుంటారు. సత్యంబాబుని చంపినట్లు బాలరాజు, కావేరిని చంపేస్తేనే నాకు మనస్శాంతి అని అంటుంది. మా అక్కని చంపిన వ్యక్తి నా కళ్ల ముందు తిరుగుతుంటే భరించలేకపోతున్నా అని అంటుంది. దానికి దేవా కావేరిని ఒక్క సారి చంపడం నాకు ఇష్టం లేదు క్షణక్షణం చంపాలని ఇలా చేస్తున్నా అంటాడు. అన్న లేడు.. భర్త జైలులో ఉన్నాడు.. ఒంటరిగా అది కూతుర్ని ఎలా కాపాడుకోవాలో తెలీక క్షణం క్షణం చస్తుంది అంటాడు. ఇంతలో కావేరి వాళ్ల స్కూటీ, దేవా కారు ఎదురెదురు పడతారు. దేవా మంచిగా చిన్నితో మాట్లాడుతాడు. చిన్నితో నీకు ఎన్జీఓలో ఉండటం ఇష్టం లేకపోతే మా ఇంటికి వచ్చేయ్ మహి కూడా ఉంటాడు అని అంటారు. కావేరి చిన్ని అలా చూస్తూ ఉంటారు. చిన్ని ఒంటరి కాదు తనకు ఎవరి పంచన ఉండాల్సిన అవసరం లేదు తన నానమ్మతో ఉంది అని కావేరి చెప్తుంది. తర్వాత చిన్నిని తీసుకొని వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















