Chinni Serial Today May 23rd: చిన్ని సీరియల్: బాలరాజుకి అండగా కావేరి.. లాయర్‌ని కలిసిన చిన్ని.. రాజుకి 14 ఏళ్ల జైలు శిక్ష తప్పదా!
Chinni Today Episode తన అన్నయ్యని భర్త బాలరాజు చంపలేదని కావేరి నమ్మి రాజుకి ఫుడ్ తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరి వదిన, పిల్లల కోసం ఫుడ్ పార్శిల్ తీసుకొస్తుంది. సరళ తనకు వద్దని పిల్లలకు పెట్టమని చెప్తుంది. కావేరి తనకు బాధగా ఉందని పోయిన వారి గురించి ఆలోచిస్తూ ఉంటే కాదని ఉన్న పిల్లల గురించి ఆలోచించాలి అని ధైర్యం చెప్పి వడ్డిస్తుంది. సరళ, పిల్లలు తింటారు. చందు ఉషని చిన్ని గురించి అడుగుతాడు. తన గురించి ఎందుకు అని సరళ అంటే చిన్ని తప్పు లేదు కదా వాళ్ల నాన్న తప్పు చేశారు కదా అంటే మనకు ఇంత అన్యాయం చేసిన వాళ్ల పేర్లు మన ఇంట్లో వద్దు అంటుంది.
చిన్ని ప్రస్తావన వద్దని లోహిత చెప్తుంది. చిన్నిని ఇంటికి తీసుకురాకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదని అంటుంది. సరళ ఏడుస్తూ తినకుండా మధ్యలోనే లేచేస్తుంది. సరళని చూసి లోహిత కూడా చాలు అని లేచేస్తుంది. తర్వాత చందు కావేరితో అత్తయ్య మామయ్య ఎందుకు అలా చేశాడు నాన్నని ఎందుకు చంపేశాడు.. అమ్మ చిన్ని మీద కోపం పెంచుకుంటుంది. అమ్మని చూస్తే నాకు భయంగా ఉంది అమ్మ ఏమైపోతుందో అని బాధగా ఉంది అంటాడు. నువ్వు మాకు ఉన్నావ్ అత్తయ్య కానీ అక్కడ చిన్నికి ఎవరు ఉన్నారు అని అంటాడు.
చిన్ని, ఆఫ్ టికెట్ ఇద్దరూ కలిసి లాయర్ హరిచంద్ర దగ్గరకు బయల్దేరుతారు. ఆయన ఇంటి కోసం మొత్తం తిరుగుతారు. సత్యం ఫ్రెండ్ లాయర్ హరిని చిన్ని కలుస్తుంది. మా నాన్నని కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకొని మా నాన్నని విడిపించండి అంటుంది. నేను రాను సత్యంని పొట్టన పెట్టుకున్న వాడితో నేను మాట్లాడను అని హరి అంటాడు. దాంతో చిన్ని హరిని బతిమాలుతుంది. మా నాన్నతో మాట్లాడి తప్పు చేయకపోతే బయటకు తీసుకురండి అని బతిమాలుతుంది. దాంతో హరి సరే అంటాడు.
కావేరి చిన్ని కోసం క్యారేజ్ రెడీ చేస్తుంది. చందు తాను చిన్ని దగ్గరకు వెళ్తాను అంటే సరళ కోప్పడుతుంది. ఇంత జరిగినా బుద్ధి రావడంలేదా దాని దగ్గరకు వెళ్తా అంటున్నావ్ అని తిడుతుంది. కావేరి దగ్గరున్న క్యారేజ్‌ని సరళ విసిరేస్తుంది. మేం బాధలో ఉన్నాం కదా మాకు సాయం చేస్తున్నావ్ అనుకుంటే దానికి సేవలు చేస్తావా.. నీకు దాని మీద అంత ప్రేమ ఉంటే నువ్వు కూడా మీ ఇళ్లు ఖాళీ చేయి వెళ్లిపో అంటుంది. దానికి కావేరి నేను ఎలా వెళ్లిపోతా అండీ తను నన్ను సొంత చెల్లికంటే ఎక్కువగా చూసుకున్నారు. నేను ఎలా వెళ్లిపోతాను అంటుంది. దానికి సరళ అయితే ఇంకెప్పుడు చిన్ని గురించి మాట్లాడొద్దు మమల్ని బాధ పెట్టొద్దు అంటుంది. కావేరి సరే అంటుంది.
చిన్ని బాలరాజు కోసం క్యారేజ్ తీసుకెళ్తానని రెడీ అవుతుంది. భారతి, ఆఫ్ టికెట్ వద్దని అంటే చిన్ని వినదు. ఇంతలో అక్కడికి కావేరి వస్తుంది. ఎందుకు ఇలా చీటికి మాటికి బయటకు వస్తున్నావ్ అని అంటుంది. నాన్న బాధలో ఉన్నాడు తినకుండా ఉంటాడు. నువ్వు నాతో రా అమ్మ వెళ్లి వచ్చేద్దాం అని చిన్ని పిలుస్తుంది. కావేరి సరే అని తీసుకెళ్తుంది. కావేరి లాంటి భార్య, చిన్ని లాంటి కూతురు ఉన్నందుకు నా కొడుకు చాలా అదృష్టవంతుడు అని భారతి అనుకుంటుంది. కావేరి చిన్ని ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కి వస్తారు. బాలరాజు వాళ్లని చూసి సంతోషడతాడు.
కావేరి వచ్చి భోజనం చేయమని బాలరాజుని పిలుస్తుంది. బాలరాజు కావేరితో మీ అన్నయ్యని నేను చంపలేదు అని నువ్వు నమ్మావా లేదా కావేరి అని అడుగుతాడు. కావేరి శ్రేయాభిలాషిగా బాలరాజు చేసిన సాయం గుర్తు చేసుకుంటుంది. నమ్ముతున్నాను అని చెప్తుంది. చిన్ని చాలా సంతోషపడుతుంది. బాలరాజు కూడా హ్యాపీగా ఫీలవుతాడు. అమ్మ నేను కలిసి నిన్ను బయటకు తీసుకొస్తాం నాన్న అని చిన్ని అంటుంది. బాలరాజు సంతోషంగా భోజనం చేస్తాడు. ముగ్గురి బంధానికి సంబంధించిన సీన్ చూడ ముచ్చటగా ఉంటుంది. ఇంతలో కానిస్టేబుల్‌కి ఓ కాల్ వస్తుంది. షాక్ అయిపోతారు. బాలరాజు దగ్గరకు వచ్చి రేపు నిన్ను కోర్టుకి తీసుకెళ్తామని సాక్ష్యాలు అన్నీ నీకు వ్యతిరేకంగా ఉన్నాయి నాకు తెలిసి నీకు 14 ఏళ్లు శిక్ష పడొచ్చు అని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!





















