Chinni Serial Today May 21st: చిన్ని సీరియల్: కావేరికి చీర ఇచ్చి కోరిక తీర్చకపోతే చిన్నిని చంపేస్తానని బెదిరించిన దేవా.. కావేరి ఏం చేయనుంది?
Chinni Today Episode కావేరికి దేవా వార్నింగ్ ఇవ్వడం తాను చెప్పినట్లు చేయకపోతే చిన్నిని చంపేస్తా అని బెదిరించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్ర వర్మ వెనక్కి రావడం చూసి కావేరి వెళ్తుంది. దేవా కావేరితో నా భార్య చనిపోయిన తర్వాత నేను చెప్పినట్లు నువ్వు చేసుంటే నువ్వు జైలు పాలు అయ్యేదానివి కాదు ఈ రోజు నీ అన్నయ్య చనిపోయేవాడు కాదు ఆ బాలరాజు ఇప్పుడు జైలుకి వెళ్లేవాడు కాదు అంటాడు. ఇప్పటికైనా తాను చెప్పిన దాని గురించి ఆలోచించకపోతే చిన్నిని వదలను అని ఎన్జీఓ నుంచి కనిపెట్టడం నాకు కష్టం కాదు అక్కడి నుంచి తప్పించడం కూడా కష్టం కాదు అని అంటాడు.
దేవా వార్నింగ్‌తో కావేరి చాలా టెన్షన్ పడుతుంది. చిన్ని అక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని అనుకుంటుంది. వెంటనే ఎన్జీఓ వాళ్లకి కాల్ చేసి చిన్నితో మాట్లాడుతుంది. చిన్నిని ఎన్జీఓతో వెళ్లొద్దు అంటుంది. నీ ప్రాణానికి ప్రమాదం ఉంది అని చెప్తుంది. దానికి చిన్ని వద్దని అత్తయ్య వాళ్లకి నీ తోడు కావాలి నేను ఎన్జీఓలో ఉండి నాన్న ఏ తప్పు చేయలేదు అని నిరూపిస్తా అని చెప్తుంది. అది అంత ఈజీ కాదని నేనే మీ అమ్మని అని చెప్తానని కావేరి అంటుంది. నాన్న అలా నిజం చెప్పొద్దు అన్నారని నువ్వు ఏ తప్పు చేయలేదు అని నిరూపించే వరకు నువ్వు కావేరి అని చెప్పొద్దు అన్నారు అని అంటుంది. ఇంతలో చిన్ని దగ్గరకు భారతిని తీసుకొని ఆఫ్ టికెట్ వస్తాడు.
కావేరి ఎన్జీఓ వాళ్లతో చిన్ని వాళ్ల నానమ్మతో ఉండొచ్చు కదా అని చెప్పి ఆవిడతో ఉండేలా చెప్తుంది. ఆఫీసర్ భారతితో సంతకం పెట్టించుకొని చిన్నిని అప్పగిస్తుంది. బాలరాజు మీ అన్నయ్యని చంపుతున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా తల్లీ కానీ బాలరాజు పొరపాటున కూడా అలాంటి తప్పు చేయడు అని అంటుంది. సాక్ష్యాలు అలాగే ఉన్నాయి కదా అని కావేరి అంటుంది. చిన్నిని భారతితో పంపిస్తుంది. దేవాకి చిన్ని గురించి తెలీదు కాబట్టి ప్రాబ్లమ్ లేదు అని అనుకుంటుంది. ఇక సరళ ఇంటికి నాగవల్లి వాళ్ల ఇంటి నుంచి క్యారేజ్ పంపిస్తారు. సరళతో ఫోన్‌లో మాట్లాడి తినమని చెప్తాడు. సరళ పిల్లల్ని తీసుకొని వెళ్లి తిందామని అంటుంది. మరో క్యారేజ్ కావేరికి తీసుకెళ్లి ఇస్తారు. వాడు నాకు క్యారేజ్ పంపడం ఏంటి అని కావేరి తిట్టుకుంటుంది. వెంటనే దేవా కావేరికి కాల్ చేస్తాడు. కావేరి లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ చేస్తాడు. దాంతో కావేరి కాల్ లిఫ్ట్ చేస్తుంది.
కావేరి నా ఫోన్ కట్ చేస్తున్నావేంటి. ఒకసారి క్యారేజ్ ఓపెన్ చేయ్ నీకు ఓ గిఫ్ట్ ఉంది అంటాడు. నాకు ఏం అక్కర్లేదు అని కావేరి తోసేస్తుంది. దానిలో చీర ఉంటుంది. నువ్వు ఎవడ్రా నాకు చీర పంపడానికి అని కావేరి అంటుంది. దానికి మర్యాదగా మాట్లాడు లేదంటే నీ కూతుర్ని నీ అన్న దగ్గరకే పంపిస్తా. రెండు రోజుల్లో నేను చెప్పినట్లు చేయాలి నేను ఇచ్చిన చీర కట్టుకోవాలి లేదంటే నీ కూతురు అని నవ్వుతాడు. కావేరి చాలా టెన్షన్ పడుతుంది. ఈ దుర్మార్గుడి నుంచి చిన్నిని ఎలా కాపాడుకోవాలి అని కావేరి ఆలోచిస్తుంది. చిన్ని తండ్రి కోసం ఏడుస్తుంది. నానమ్మ నాన్నకి మామయ్య చాలా ఇష్టం మామయ్యతో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించాడో ఎవరికీ తెలీదు. అలాంటిది నాన్న హత్య చేశారు అని ఎలా నమ్ముతున్నారు అని ఏడుస్తుంది. చిన్ని నాన్న దగ్గరకు తీసుకెళ్లమని ఆఫ్ టికెట్‌ని అడుగుతుంది.
భారతికి కావేరి కాల్ చేసి చిన్ని గురించి అడుగుతుంది. చిన్నితో మాట్లాడుతుంది. జైలుతో బాలరాజు బాధ పడుతూ ఉంటాడు. కావేరి ఉదయం బయటకు వెళ్తుంటే బండి మీద ఓ గిఫ్ట్ ఉంటుంది. అది చూసి కావేరి చాలా టెన్షన్ పడుతుంది. ఓపెన్ చేస్తే అందులో ఓ ప్యాకెట్స్‌లో చిన్నపిల్లల చిటికెన వేలు ఉంటుంది.అది చూసి కావేరి దూరంగా విసిరేసి గజగజ వణికిపోతుంది. ఇంతలో దేవా కాల్ చేస్తే చిన్ని ఎక్కడఉంది అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీని అడ్డు పెట్టుకొని రుక్మిణి తల్లిదండ్రుల పెళ్లిరోజు జరిపిస్తుందా!





















