Ammayi garu Serial Today May 20th: అమ్మాయి గారు సీరియల్: బంటీని అడ్డు పెట్టుకొని రుక్మిణి తల్లిదండ్రుల పెళ్లిరోజు జరిపిస్తుందా!
Ammayi garu Today Episode తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుక జరపాలి అని రుక్మిణి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప రాజు ఇద్దరూ ఎమోషనల్‌గా మాట్లాడుకుంటారు. నా అమ్మాయిగారు చనిపోయారు అని తెలియగానే నేను చనిపోవాలి అనుకున్నా అమ్మాయిగారు కానీ మన ప్రేమకు ప్రతిరూపం అయిన బంటీ కోసం జీవచ్ఛవంగా బతుకుతున్నా అని రుక్మిణిగా ఉన్న రూపతో చెప్తాడు. దానికి రూప మనం ఒకరిని విడిచి ఒకరం ఉండలేం అది భూలోకంలో అయినా పై లోకంలో అయినా కలిసే ఉంటామని అంటుంది.
సూర్యప్రతాప్, విరూపాక్షిలను ఎలా అయినా కలపాలి అని ఇద్దరూ అనుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో అది జరగదేమో అనుకుంటారు. కానీ రుక్మిణి ఇద్దరి పెళ్లి రోజు వేడుక జరపాలి అని చెప్తుంది. అది కష్టం అని రాజు అంటే బంటీని అడ్డు పెట్టుకొని ప్రయత్నిద్దాం అని అంటుంది. ముందు ఇద్దరూ కలిసి భోజనం చేసేలా చేద్దామని అనుకుంటారు. అందుకు రుక్మిణి తండ్రి గది దగ్గరకు వెళ్తుంది. సూర్యప్రతాప్ రూప గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. రుక్మిణి భోజనానికి పిలుస్తుంది. సూర్యప్రతాప్ రాను అని చెప్తారు. దాంతో ఇంటి పెద్ద అయిన మీరు తినకపోతే ఇంట్లో ఎవరూ తినరు. బంటీ కూడా తినడు అని అంటుంది. ఇంతలో రాజు బంటీని తీసుకొని వస్తాడు. రాజు సూర్యప్రతాప్‌ని పిలుస్తాడు.
బంటీ తాతతో తాతయ్య బాగా ఆకలిగా ఉంది మీరు వస్తే తిందాం అని అంటాడు. బంటీ కోసం సూర్యప్రతాప్ కిందకి వస్తాడు. సుమ విరూపాక్షితో రోజు వంట చేస్తున్నా కానీ ఎవరూ ముద్ద కూడా తినడం లేదు.. కానీ ఎప్పుడైనా తినాలి అనిపిస్తే లేదు అని చెప్పలేక వండుతున్నా అని బాధ పడుతుంది. దానికి చంద్ర మనకే రూప లేదని ఇంత బాధగా ఉంటే అన్నయ్యకు ఇంకా ఎలా ఉంటుందో ఆలోచించు అని అంటాడు. సూర్యప్రతాప్ రావడం చూసి విరూపాక్షి వెళ్లిపోతుంటే రుక్మిణి ఆపుతుంది.
రుక్మిణి సూర్యప్రతాప్‌ని కూర్చొమని చెప్తుంది. సూర్యప్రతాప్ విరూపాక్షిని చూసి కూర్చొరు. విజయాంబిక, దీపక్‌లు అందరూ కలిసిపోయేలా ఉన్నారు ఎలా అయినా విడదీయాలి అనుకుంటారు. రూప ఆత్మ శాంతిస్తుంది ఇద్దరూ కలిసి తినండి అని రుక్మిణి చెప్తుంది. విరూపాక్షి కూర్చొపోతే విజయాంబిక ఆపి దీపక్‌ని కూర్చొబెట్బోతుంది ఇంతలో రుక్మిణి కావాలని అత్త కాలిలో కాలు పెడుతుంది. విజయాంబిక మీద సాంబారు పడుతుంది. దీపక్ కింద పడిపోతాడు. ఇద్దరూ కుయ్యోముర్రో అంటారు. కేవలం బంటీ కోసం ఇంట్లో వాళ్ల కోసమే తింటున్నా అని చెప్పి సూర్యప్రతాప్ కూర్చొంటాడు. అందరూ భోజనాలు చేస్తారు.
సూర్యప్రతాప్ వెళ్లిపోతుంటే రుక్మిణి ఆపి రాజు బావ రేపు మీ పెళ్లి రోజు అని చెప్పారు అది చేస్తే అక్క ఆత్మ శాంతిస్తుందని చెప్తుంది. సూర్యప్రతాప్ కాస్త కోప్పడతారు. విరూపాక్షి కూడా రుక్మిణితో అలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తుంది. పెళ్లి రోజు చేసుకోకపోతే వెళ్లిపోతా అని రుక్మిణి అంటుంది. బంటీ రుక్మిణితో చిన్నప్పటి నుంచి నాకు అమ్మ లేదు అమ్మ ఉంది అనుకునే లోపు అమ్మ చనిపోయింది. ఇప్పుడు నువ్వు అమ్మలేని లోటు తీర్చుతా అన్నావ్ నువ్వు కూడా వెళ్లిపోతావా నేను మళ్లీ ఒంటరి వాడినేనా అని ఏడుస్తాడు. బంటీని చూస్తే అందరి కళ్లలో నీరు తిరుగుతారు. రుక్మిణి పెళ్లి రోజు చేసుకోమని సూర్యప్రతాప్‌తో చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ మెడలో వారసత్వ నగ.. ముడిపడిన లక్ష్మీ, సహస్రల తాళి!





















