Chinni Serial Today June 11th: చిన్ని సీరియల్: బాల దగ్గర ఉన్న సాక్ష్యం ఏంటి? చిన్ని కిడ్నాప్.. దేవాకి షాక్ ఇచ్చిన మహి!
Chinni Today Episode పార్వతిని దేవా చంపినట్లు సాక్ష్యం ఉందని బాల చెప్పడంతో దేవా చిన్నిని కిడ్నాప్ చేయమని తన రౌడీలను పంపడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode కావేరి బాలరాజుని తీసుకొని వెళ్లి నాగవల్లిని కలుస్తుంది. మీ అక్కని చంపింది నేను కాదు అని కావేరి చెప్తే దానికి నాగవల్లి నువ్వు కాకపోతే మా బావ చంపారా అని అడుగుతుంది. అవును అని కావేరి అంటే మా బావకి మా అక్క అంటే ప్రాణం మరి మా బావ ఎందుకు చంపుతాడు అని వల్లి అడుగుతుంది. దానికి కావేరి నేను కారణాలు చెప్పలేను కానీ దేవానే పార్వతిని చంపాడు అని చెప్తుంది.
బాలరాజు కూడా వచ్చి నిజం చెప్పబోతే వల్లి వద్దు అనేస్తుంది. ఈ నిజం ఇప్పుడెండుకు చెప్తున్నావ్ అని నాగవల్లి అడిగితే నువ్వు ఇప్పుడు మీ బావని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్ అని తెలిసి నిజం చెప్తున్నాం అంటారు. ఆ దేవుడు చెప్పినా మా బావ అక్కని చంపాడు అంటే నేను నమ్మను అని అంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో దేవా నాగవల్లితో కావేరి, బాలరాజు మంచోళ్లు కాదు మీ అక్కని చంపింది నేనే అని చెప్పినా చెప్పొచ్చు నమ్మొద్దు అని అంటాడు. నాగవల్లి అది గుర్తు చేసుకొని నువ్వు చెప్పినట్లే అయింది బావ అనుకుంటుంది. ఇక కావేరి, బాలరాజు మాణిక్యం ఎక్కడున్నా కనిపెట్టి నిజం నాగవల్లికి చెప్పించాలి అనుకుంటారు.
బాలరాజు కావేరిలు వెళ్తుంటే ఓ చోట దేవా వాళ్లని చూసి ఆపుతాడు. బెయిల్ మీద వచ్చినా పెళ్లాన్ని బాగానే స్కూటీ మీద తిప్పుతున్నావ్ అని అంటాడు. దానికి బాల నువ్వు మాత్రం నీ పెళ్లాంతో చచ్చినా ఇలా తిరగలేవు అర్థం కాలేదా నీ మరదల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావ్ కదా అది ఈ జన్మలో జరగదు అని బాల కౌంటర్ ఇస్తాడు. ఎంత మంది అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావ్‌రా నువ్వు బంగారం లాంటి పార్వతిని చంపేశావ్ ఇప్పుడు నాగవల్లి జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నావా అని కావేరి అడుగుతుంది. నీ పక్కన మొగుడు ఉన్నాడనా రెచ్చిపోతున్నావ్ రేపు నీ మొగుడు మళ్లీ జైలుకి వెళ్లిపోతాడు అని దేవా అంటే బాలరాజు నవ్వు జైలుకి వెళ్లేది నువ్వేరా.. నీ భార్యని చంపిన వీడియో కాలిపోయింది కదా కానీ మరో కాపీ ఉంది అది కోర్టులో చూపిస్తే నీ పని అంటే ఇక సత్యంబాబుని హత్యచేసింది నువ్వే అని చెప్తే ఇక అయిపోతావ్ అని వార్నింగ్ ఇస్తాడు. దేవా షాక్ అయిపోతాడు.
కావేరి బాలరాజుతో మన దగ్గర ఏ సాక్ష్యం లేదు కదా మరి ఎందుకు అలా చెప్పావ్ అని అడుగుతుంది. కొందరు నిజాలకు భయపడని వాళ్లు అబద్ధాలకు భయపడతారు అని అంటాడు. దేవా తన మనుషులకు కాల్ చేసి బాలరాజు ఇంటికి వెళ్లి తనకు సంబంధించిన సాక్ష్యం వెతకమని చిన్నిని ఎత్తుకొని వచ్చేయమని చెప్తాడు. రౌడీలు బాల ఇంటికి వెళ్తారు. రౌడీలు ఇళ్లంతా వెతికి చిందర వందర చేసి ఆఫ్ టికెట్‌ని కొట్టి చిన్నినీ తీసుకెళ్లబోతే చిన్ని రౌడీని కరిచేసి పారిపోతుంది. ఇంతలో మహి వస్తుంటే మహి వాళ్ల కారు దగ్గర పడిపోతుంది. మహి చూసి చిన్నిని ఇంటికి తీసుకెళ్తాడు.
బాలరాజు, కావేరిలు ఇంటికి వెళ్లి చూసి ఏమైందని అడుగుతారు. ఆఫ్ టికెట్ తలకి గాయం అవుతుంది. ఆఫ్ టికెట్ ఏడుస్తూ జరిగింది చెప్తాడు. చిన్నిని కాపాడు అన్న అని ఏడుస్తాడు. కావేరి, బాలరాజు ఇద్దరూ ఇదంతా దేవా పని అని అనుకొని చిన్నిని వెతకడానికి వెళ్తారు. రౌడీలకు దేవా కాల్ చేస్తే సాక్ష్యాలు దొరకలేదని చిన్నిని పట్టుకునే టైంకి మహి బాబు వచ్చారని రౌడీలు చెప్తారు. ఇంతలో మహి చిన్నిని తీసుకొని ఇంటికి వస్తాడు. అది చూసిన దేవా అర్థమైందిలే అని ఫోన్ పెట్టేస్తాడు. మనసులో వీడేంటి ప్రతీ సారి చిన్ని విషయంలో ఇలా అడ్డుపడుతున్నాడు అనుకుంటాడు. చిన్ని ఇంట్లో అందరికీ విషయం చెప్తాడు.
మహి నాగవల్లికి ఫోన్ అడిగి చిన్ని ఇంటికి ఫోన్ చేసి చెప్తా పిన్ని లేదంటే వాళ్లు కంగారు పడతారు అని ఫోన్ చేస్తాడు. కావేరికి కాల్ చేస్తాడు. చిన్ని వెంట రౌడీలు పడ్డారు టీచర్ అందుకే చిన్నిని మా ఇంటికి తీసుకొచ్చాను అని అంటాడు. కావేరి వెంటనే వస్తామని చెప్తుంది. ఇక దేవా మనసులో నాగవల్లిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ రేపు ఎప్పుడైనా నాగవల్లికి పార్వతిని చంపింది నేనే అని తెలిసినా ప్రాబ్లమ్ ఉండదు అని అనుకుంటాడు. చిన్నికి మహి జ్యూస్ ఇస్తాడు. చిన్ని మహితో మీ డాడీని పిన్నిని పెళ్లి చేసుకోమని ఒప్పించు అదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పి పంపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!





















