అన్వేషించండి

Ammayi garu Serial Today June 10th: అమ్మాయి గారు సీరియల్: రాజు, కీర్తిలకు పెళ్లి చేస్తానని మాటిచ్చేసిన సీఎం.. భర్తపై విరూపాక్షి ఫైర్!

Ammayi garu Today Episode రూప బతికే ఉందని తెలియని సూర్య ప్రతాప్‌ రాజుకి కీర్తికి పెళ్లి చేస్తానని మీడియా సాక్షిగా మాట ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజు, సూర్యప్రతాప్‌లతో పాటు ఫ్యామిలీ మొత్తం కీర్తిని చూడటానికి హాస్పిటల్‌కి వెళ్తారు. డాక్టర్ కీర్తి కండీషన్ అవుట్ ఆఫ్‌ డేంజర్ అని చెప్తారు. పంతులు కీర్తితో నీ కోసం సీఎం సార్ వచ్చారని చెప్తారు. కీర్తికి సూర్యప్రతాప్‌ ఏం జరిగిందని అడిగితే కీర్తి రాజు చెప్పినట్లు జరిగింది చెప్తుంది.
 
సూర్యప్రతాప్‌ కీర్తితో ఎవరో చేసిన తప్పునకు నువ్వు ఇలా చేయడం ఏంటి అమ్మా.. మన తప్పు లేకపోయినా మన మీద ఏమైనా నింద పడితే అది మన తప్పు కాదమ్మా ఎవరో చేసిన తప్పునకు నువ్వు శిక్ష వేసుకోవడం ఏంటి అమ్మా అని అడుగుతారు. దానికి కీర్తీ కన్నీరు పెట్టుకొని నా తప్పు లేదు అని నన్ను నమ్మే ఒక్క మనిషి కూడా లేకపోతే నేనేం చేయాలి సార్ అని కీర్తి ఏడుస్తుంది. నీకు మేం అంతా ఉన్నాం సూర్యప్రతాప్‌ కీర్తికి ధైర్యం చెప్తారు. ఇక పంతులు రాజునే తన కోసం సూర్యప్రతాప్‌ గారు చెప్పిన అబ్బాయి అని చెప్తారు. నీ రాజే నిన్ను కాపాడుకున్నాడమ్మా అని కీర్తితో పంతులు చెప్తారు.

సూర్యప్రతాప్‌ కీర్తితో మా రాజుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అమ్మా అని అడుగుతారు. ఎవరూ లేని నాకు మీరంతా ఉన్నారు అనే ధైర్యం ఇచ్చారు సార్.. మీ లాంటి వాళ్లని నేను ఎందుకు వద్దు అనుకుంటాను సార్.. తెలియని అమ్మాయిని కాపాడిన రాజు తన సొంత మనిషిని ఇంకెలా చూస్తారో అర్థమైంది సార్ నాకు ఇష్టమే అని కీర్తి చెప్తుంది. రూప, రాజులు షాక్ అయిపోతారు. రాజు మనసులో ఈ పెళ్లి జరగదు ఆ విషయం తొందర్లోనే మీకు తెలుస్తుందని అనుకుంటాడు. సూర్యప్రతాప్‌ కీర్తిని తన ఇంటికి తీసుకెళ్తానని చెప్తాడు. 

మరోవైపు బయట సూర్యప్రతాప్‌ గురించి మాట్లాడుతారు. సూర్యప్రతాప్‌ కీర్తిని తీసుకొస్తుంటే కేసు సెటిల్ చేసుకున్నారా.. మీ అల్లుడి వల్ల నష్టపోయిన ఈ అమ్మాయిని ఏ విధంగా న్యాయం చేస్తారు అని అడుగుతారు. ఏం జరిగిందో ఆ అమ్మాయే సూర్యప్రతాప్‌ అంటారు. కీర్తి మీడియాతో మాట్లాడుతుంది. తాను ఓ అనాథ అని తనకు దేవుడు తప్ప ఎవరూ లేరని ఎప్పటిలా గుడికి వెళ్లి వస్తుంటే అని జరిగింది మొత్తం చెప్తుంది. అమ్మాయి చెప్పింది నిజమే అని పంతులు చెప్తారు. ఇక సూర్యప్రతాప్‌ ఈ సంఘటన జరగకముందే ఈ అమ్మాయికి మా రాజుకి పెళ్లి చేయాలి అనుకున్నాం ఇప్పుడు కూడా నిర్ణయంలో మార్పు లేదు రాజు, కీర్తిల పెళ్లి చేస్తానని చెప్తారు. 

సూర్యప్రతాప్‌ని కావాలనే దీపక్, మీడియా రెచ్చగొడతారు. రుక్మిణి మనసులో నాన్నకి కావాలనే రెచ్చగొడుతున్నారని మీడియాని కోప్పడి తండ్రిని వెళ్లిపోదాం అంటుంది. కానీ సూర్యప్రతాప్‌ ఆపి ఇది మా కుటుంబ విషయం మీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు కానీ చెప్తున్నా కీర్తి, రాజులకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తా అని మాట ఇస్తారు. మీడియా రాజుకి పెళ్లి ఇష్టం లేదని బలవంతం చేస్తున్నారని అడుగుతారు. దాంతో రాజుని సూర్యప్రతాప్‌ కూడా ప్రశ్నిస్తాడు. దాంతో రాజు తనకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తాడు. కీర్తి ఇక అనాథ కాదని తనకి కూతురిలాంటిదని తన ఫ్యామిలీతోనే ఉంటుందని చెప్పి తీసుకెళ్తారు. 

ఇంట్లో ఉన్న వారంతా ఆ న్యూస్ చూసి షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్‌ కీర్తిని తీసుకొని ఇంటికి వస్తాడు. సూర్యప్రతాప్‌ సుమని పిలిచి రాజు, కీర్తిలకు దిష్టి తీయమని చెప్తాడు. సుమ దిష్టి తీస్తుంది. విరూపాక్షి కోపంగా ఉంటుంది. విరూపాక్షి సూర్యని ఆపుతుంది. ఇంట్లోకి రాగానే సూర్యప్రతాప్‌కి ఎదురెళ్లి నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్‌ కాదు అని చెప్తుంది. నా ఇంట్లో నేను తీసుకున్న నిర్ణయం గురించి నాకు ఎవరూ చెప్పనవసరం లేదు ఎవరు ఎంతలో ఉండాలో అంతలో ఉంటే మంచిది అని అంటాడు. ఇది నీ ఇళ్లు నీ ఇంటికి నీకు ఇష్టం వచ్చిన వాళ్లని తీసుకురా అది నీ ఇష్టం నేనేం అనను కానీ ఈ అమ్మాయిని నా కూతురి స్థానంలోకి తీసుకొస్తా అంటే మాత్రం నేను ఒప్పుకోను అని విరూపాక్షి అంటుంది. నా కూతురి  స్థానంలోకి ఈ అమ్మాయే కాదు ఇంకే అమ్మాయి వచ్చినా ఒప్పుకోను అంటుంది. 

విజయాంబిక విరూపాక్షితో నీ కూతురికి నా తమ్ముడు అన్యాయం చేయలేదు. బంటీ, రాజుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటుంది. వాళ్ల కోసం ఆ నిర్ణయం తీసుకుంటే ఇద్దరూ సంతోషంగా ఉండాలి కదా వాళ్ల కళ్లలో ఆ సంతోషం ఉందా అని అంటుంది. సూర్యతో కీర్తిని బంటి, రాజుల జీవితాల్లోకి తీసుకొని రావడానికి నీకు హక్కు లేదు అంటుంది. నువ్వు ఎవరు నా తమ్ముడిని హద్దులు పెట్టడానికి అని విజయాంబిక అంటే నన్ను అనడానికి నువ్వు ఎవరు విజయాంబిక.. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకుంటే సరే లేదంటే పళ్లు రాలతాయ్ అంటుంది. ఇంతలో సూర్యప్రతాప్‌ రాజుకి భార్యగా బంటీకి తల్లిగా ఈ అమ్మాయి ఉంటుంది ఇది ఫైనల్ అంటాడు. దానికి విరూపాక్షి ఒకరి భార్య స్థానంలోకి ఇంకో అమ్మయి భార్యగా రావడం అంత ఈజీ కాదు ఆ విషయం ఇక్కడ ఉన్న అందరి కంటే నీకే బాగా తెలుసు అంటుంది. 

విరూపాక్షి సూర్యప్రతాప్‌తో గొడవ పడుతుంటే రుక్మిణి ఆపుతుంది. నాయన ఏం చేసినా మంచే చేస్తాడు అని అంటుంది. రాజు కీర్తిలకు కూడా పెళ్లి ముహూర్తం పెట్టించమని చంద్రతో సూర్యప్రతాప్‌ చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రహస్యం ఆదికేశవ్‌కి తెలిసిపోతుందా.. క్షణక్షణం ఉత్కంఠ!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
Illu Illalu Pillalu Serial Today August 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద ప్లాన్ చాటుగా వినేసిన వల్లీ! గుడిలో అలా జరగకుండా అడ్డుకుంటుందా!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
Embed widget