Chinni Serial Today july 29th: చిన్ని సీరియల్: డ్రాయింగ్ చిన్ని, మహిలను కలుపుతుందా.. వర్షంలో కలిసిన మనసులు.. రెయిన్‌బో రహస్యం!
Chinni Serial Today Episode july 29th వర్షంలో మహి, చిన్ని ఇద్దరూ ఒకరికి తెలీకుండా ఒకరు ఇంద్రధనస్సుతో ఫొటో తీసుకోవడం, మహి చిన్ని వేసిన డ్రాయింగ్ చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode దేవేంద్రవర్మ, నాగవల్లిని గుడికి ఎందుకు వెళ్లావని మహిని ప్రశ్నిస్తారు. చిన్ని కోసం వెతకడానికి వెళ్లానని మహి చెప్పడంతో దేవా అరుస్తాడు. చిన్ని చిన్ని చిన్ని.. తన కోసం వెతికి వెతికి పిచ్చోడయ్యేలా ఉన్నావ్.. బుద్ధిగా చదువుకో తన గురించి మర్చిపో అని దేవా చెప్తాడు.
మహి తండ్రితో మీకు ఎక్కువ ఎవరు ఇష్టం అని అడుగుతాడు. నువ్వే అని దేవా చెప్తాడు. మామ్ నీకు ఎవరు ఇష్టం అని అంటే నువ్వే అని నాగవల్లి కూడా చెప్తుంది. నేను లేకుండా మీరు ఉండగలరా అని మహి అడగ్గానే ఇద్దరూ షాక్ అయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. సపోజ్ నేను పోతే అని అంటాడు. మహి ఏంటి ఆ మాటలు అని నాగవల్లి ఏడుస్తుంది. ఫీలవ్వకు మమ్మీ చెప్పండి అంటే ప్రాణాలతో ఉండలేం అని నాగవల్లి అంటే ఉండగలరు.. మహా అయితే వారం, నెల, సంవత్సరం తర్వాత అయినా మర్చిపోయి రొటీన్‌లో పడిపోతారు. పాలిటిక్స్ చూసుకుంటారు. అంటే మీకు ప్రేమ లేదు అని కాదు కానీ ఎవరైనా అంతే కానీ నేను మర్చిపోలేను.. నాలో ప్రాణం ఉన్న వరకు చిన్ని నాతోనే ఉంటుంది. లైఫ్‌లో నేను చిన్నిని మర్చిపోలేను.. అర్థం చేసుకోండి అని మహి కన్నీరు పెట్టుకొని వెళ్లిపోతాడు.
నాగవల్లి కుప్పకూలిపోతుంది. ఏంటి బావా వీడు ఇలా మాట్లాడుతున్నాడు.. వీడిని చూస్తుంటే నువ్వు అన్నట్లు పిచ్చి ఎక్కిపోయేలా ఉన్నాడు అని ఏడుస్తుంది. దేవా వల్లిని బాధ పడొద్దని ఓదార్చుతాడు. ఉదయం మధు స్కూటీలో వెళ్తూ ఉంటే వర్షం మొదలవుతుంది. ఇంతలో ఓ కళ్లు కనిపించని పాప డొనేట్ చేయమని చార్ట్ పట్టుకొని నిల్చొంటుంది. ఆ చార్ట్ ఎగిరి చిన్ని దగ్గర పడుతుంది. పాప దాని కోసం వెళ్తే చూసుకోవాలి కదా అంటుంది. నాకు కళ్లు కనిపించవు అక్క.. మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఎక్కడున్నాడో నాకు తెలీదు.. నేను అనాథాశ్రమంలో ఉన్నాను.. డొనేషన్ కోసం ఇక్కడే ఉన్నానని అంటుంది.
మధు తన తల్లిదండ్రుల్ని గుర్తు చేసుకుంటుంది. గతంలో తాను కావేరితో జైలులో ఉన్నప్పుడు డ్రాయింగ్ చేయడం గుర్తు చేసుకొని ఆ పాపతో నేను డొనేట్ చేయడమే కాదు నలుగురు నీకు డొనేషన్ చేసేలా చేస్తానని చెప్పి పెయింటింగ్ కలర్స్ కొనుక్కొని వస్తుంది. వాటితో ఆ పాప దగ్గరకు వెళ్లి గతంలో చిన్ని వేసిన సీతా కోక చిలుక బొమ్మ వేస్తుంది. ఆ బొమ్మ మధ్యలో చిన్ని అని రాస్తుంది. పాపతో ఇప్పుడు నీకు కచ్చితంగా డనేషన్స్ వస్తుంది చూడు అని అంటుంది. ముందుగా చిన్ని డొనేట్ చేస్తాడు. తర్వాత పాప మధుకి థ్యాంక్స్ చెప్పి చేతులు, ముఖం తడిమి థ్యాంక్స్ చెప్తుంది. అందరూ డ్రాయింగ్ చూసి ఫొటోలు తీసుకొని డొనేషన్ చేస్తారు. పాప నువ్వు హ్యాపీ కదా ఇక నేను వస్తాను అని చెప్పి మధు వెళ్లిపోతుంది.
మధు ఆ పాపని చూసి నాకు అమ్మానాన్నల్ని దూరం చేసినట్లు ఆ పాపకి దూరం చేశావు కదా నువ్వే తనకు అమ్మానాన్నలు లేని లోటు తెలీకుండా చేయు స్వామి అని కోరుకుంటుంది. మరోవైపు మహి తన ఫ్రెండ్‌తో చిన్ని కనిపించలేదని చెప్పుకొని బాధపడతాడు. చిన్ని కచ్చితంగా నీకు కనిపిస్తుందని అతని ఫ్రెండ్ చెప్తాడు. ఇక ఆకాశంతో రెయిన్ బో కనిపిస్తుంది. అది చూసి మహి తన ఫ్రెండ్‌తో చిన్నప్పుడు నేను చిన్ని వర్షంలో తడుస్తూ రెయిన్‌బోతో ఫొటో తీసుకున్నాంరా.. ఇప్పుడు కూడా మేం కలిస్తే ఎంత బాగున్నురా అనుకుంటాడు. మహి బైక్‌కి ఆపోజిట్‌లో చిన్ని రైన్‌బో చూస్తుంది. చిన్ని కూడా మనసులు వర్షం, రైన్‌బో కలిసి ఉన్నాయి కానీ నేను మహి ఎప్పుడు కలుస్తామో అనుకుంటుంది.
మహి ఓ వైపు సెల్ఫీ తీసుకుంటే మధు కూడా మరోవైపు నుంచి సెల్ఫీ తీసుకుంటుంది. ఇద్దరూ చెరోవైపు ఫొటోలు చూసుకొని సరదా పడతారు. తర్వాత మహి వెళ్తూ రెడ్డు మీద పాప దగ్గర చాలా మంది జనం ఫొటోలు తీసుకోవడం చూసి మహి కూడా వెళ్తాడు. డొనేషన్ చేస్తాడు. తర్వాత ఆ డ్రాయింగ్ చూసి షాక్ అయిపోతాడు. వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి గతంలో చిన్ని వేసిన డ్రాయింగ్ ఫొటోని రోడ్డు మీద ఉన్న ఆ సీతాకోక చిలుక డ్రాయింగ్‌తో జూమ్ చేసి చూసి చిన్ని అన్న పేరు కూడా చూసి చాలా చాలా సంతోషపడతాడు. సంతోషంలో మహి ఏడ్చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















