Nuvvunte Naa Jathaga Serial Today july 29th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా సిగరెట్ కోసం మిథున పరుగులు.. హరివర్ధన్‌తో దేవా ఏం చెప్పాడు?
Nuvvunte Naa Jathaga Serial Today Episode july 29th మిథునకు నువ్వు సరిపోవు మిథునని వదిలేసి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని దేవాతో హరివర్ధన్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున దేవా కోసం వంట చేస్తుంటుంది. హరివర్ధన్ భోజనం పెట్టమని అంటాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. దేవాని కూడా పిలవమని లలిత చెప్తుంది. అతను మనతో తినడం ఏంటి అని అని అంటుంది. మిథునని లలిత దేవాని పిలవమని పంపేస్తుంది.
త్రిపురతో ఎవరి ముందు ఎలా మాట్లాడాలో తెలీదా అని కోప్పడుతుంది. దానికి రాహుల్ కరెక్టే కదా అమ్మ అతను మనతో తినడం ఏంటి తర్వాత తింటాడులే అంటాడు. తర్వాత తినడానికి అతనే పనోడు కాదు మన ఇంటి అల్లుడు అని లలిత చెప్తుంది. ఇక దేవాని మిథున భోజనానికి పిలుస్తుంది. దేవా ఇప్పుడు వద్దు అంటాడు. నువ్వు ఆకలికి ఆగలేవని నాకు తెలుసురా అని మిథున పిలిస్తే దానికి దేవా నేను అక్కడికి ఎందుకులే ఒక ప్లేట్‌లో పెట్టి ఇక్కడికి తీసుకొచ్చే అంటాడు. హలో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఇంటి అల్లుడిగా అందరితో కలపడానికి ఇక్కడ కూడా నిన్ను సపరేట్‌గా ఉంచడానికి కాదు.. రా అని మిథున దేవాని తీసుకెళ్తుంది.
దేవా, మిథున కూర్చొంటారు. మిథున దేవా మీద టవల్ వేస్తే నాకు ఇలాంటివి నచ్చవు అని దేవా అంటాడు. ఎప్పుడైనా తినుంటే తెలిసేది అంటుంది. ఇక బ్రెడ్ జామ్ పెడితే ఇలాంటి గడ్డి నాకు వద్దు అన్నం పెట్టు అంటాడు. త్రిపుర మళ్లీ కోప్పడితే అతను తనకు ఇష్టమైనది ధైర్యంగా చెప్పాడు అని అంటుంది. ఇక దేవా మటన్ వేసుకొని తినడం చూసి త్రిపుర అసహ్యించుకుంటుంది. హుందాగా ఉండే ఇంటిని ఇలా చండాలంగా మార్చేశారు. అతను అతని క్యారెక్టరే ఎవరికీ నచ్చడం లేదు.. ఆహారపు అలవాట్లే కలవడం లేదు ఇక అల్లుడుగా కలుస్తాడా అని త్రిపుర వెళ్లిపోతుంది. తర్వాత రాహుల్, తర్వాత హరివర్ధర్ వెళ్లిపోతారు.
సత్యమూర్తి ఇంటి దగ్గర సూర్యకాంతం వైరల్ వయ్యారిని అంటూ రీల్స్ చేస్తుంది. సత్యమూర్తి చూసి కేకలేస్తాడు. సోషల్ మీడియాలో పేరు వస్తుందని ఇలా చేస్తున్నా అంటుంది. సత్యమూర్తి కోడలితో ఆపమని ఇంట్లో పరిస్థితులు ఏంటి మీరు చేస్తుందేంటి అని అంటాడు. మేం ఏం తప్పు పనులు చేశాం.. కొందరిలా ట్రిప్పులకు వెళ్లలేదు కదా అంటే వాళ్లు వెళ్లింది బంధం నిలబెట్టుకోవడానికి.. మీలా కాదు మిథునని చూసి నేర్చుకోండి అంటారు. ఆ మిథునని నాతో పోల్చుతారేంటి అని కాంతం రగిలిపోతుంది.
దేవా బయటకు వచ్చి మటన్ కర్రీ బాగుందని తినేసి ఇప్పుడు దమ్ము వేయాలి అని సిగరెట్ కోసం వెళ్తాడు. సెక్యూరిటీ అతను ఆపి పెద్దయ్యగారి పర్మిషన్ తీసుకొని వెళ్లాలి అంటాడు. దేవా సెక్యూరిటీ అతనికి సిగరెట్ అడుగుతాడు. ఈ ఇంట్లో అగరబత్తీ వాసన తప్ప సిగరెట్ వాసన ఉండదు సార్..నాకు కూడా సిగరెట్ తాగే అలవాటు లేదని తెలిసే నాకు ఉద్యోగం ఇచ్చారని అంటాడు. దేవాని సెక్యూరిటీ అతను బయటకు పంపడు. అదంతా మిథున చూస్తుంది. అలంకృతకి కారు కీస్ అడుగుతుంది. నేను వస్తాను ఆగు అక్కా అని అలంకృత కూడా పరుగులు పెడుతుంది. ఇద్దరూ కారులో బయటకు వెళ్తారు. మిథున ఓ షాప్ దగ్గరకు వెళ్లి సిగరెట్ ప్యాకెట్ లైటర్ కొంటుంది. అలంకృత షాక్ అయి నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది అక్కా అంటుంది.
దేవా ఓ చోట నిల్చొని సిగరెట్ లేకపోతే పిచ్చిక్కిపోతుందని అనుకుంటాడు. దేవా మిథునకు సిగరెట్ ఇస్తుంది. దేవా సిగరెట్ తాగుతాడు. హరివర్ధన్ చూస్తాడు. మిథున దేవాతో నీ అలవాటుని నేను కాదనలేను కానీ మా నాన్నకి ఇలాంటివి నచ్చవు మెల్లగా మానేయ్ అని చెప్తుంది. ఇక అలంకృత మిథునని పక్కకి తీసుకెళ్లి నువ్వు ఏంటి ఇలా షాప్‌కి పరుగెత్తడం ఏంటి ఇలా అన్నీ చేయడం ఏంటి ఇంతలా ఎప్పుడు మారిపోయావ్ అని అడుగుతుంది. ఆయన ఇష్టమే నా ఇష్టం అని మిథున అంటుంది.
దేవా రాత్రి ఆరుబయట కూర్చొని ఉంటే హరివర్ధన్ వెళ్లి పక్కనే కూర్చొంటాడు. ఈ ఇంట్లో ఈ ఒక్క రోజు ఉన్నందుకే ఈ ఇంటి మనుషుల్ని చూసినప్పుడు నీకు ఈ ఇంటికి ఎంత దూరంలో ఉండాలో అర్థమైపోయింటుంది. మిథున మీ ఇంట్లో ఉన్నప్పుడు నీకు మిథున స్థాయి అర్థం కాలేదు కానీ ఇప్పుడు నీకు బాగా అర్థమై ఉంటుంది. మిథున పక్కన నిల్చొడానికి కదా తన కాలి గోటికి కూడా సరిపోవు. మరి భర్తగా సరిపోతా అని ఎలా అనుకుంటున్నావ్. చూడు ప్రతీ తండ్రి కూతుర్ని ఆకాశం అంత ఎత్తులో ఉంచాలి అనుకుంటాడు. నీలాంటి వాడికి ఇచ్చి తొక్కేయాలి అనుకోడు. గాజు బొమ్మలా పెంచుకున్న నా కూతుర్ని తెలిసి తెలిసి నీ చేతుల్లో ఎలా పెట్టను. నువ్వేంటో నాకు తెలుసు ప్రత్యేకంగా తెలుసుకోవడానికి ఏం లేదు.. ఈ విషయం నువ్వు తెలుసుకొని ఇక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిది అని అంటాడు.
దేవా మామయ్యతో మీరు చెప్పిన ప్రతీది నిజం సార్ కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంతే నేను తన సంతోషం కోసం వచ్చాను సార్ మరీ ముఖ్యంగా మిథున సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను సార్. మీరు మీ అమ్మాయి కోసం ఎంత ఆలోచిస్తున్నారో నేను అంతే ఆలోచిస్తున్నా మిథున విషయంలో మన ఇద్దరి గుండె చెప్పేది ఒకటే మాట. అది ఏంటో మీకు అర్థమైందని అనుకుంటున్నా అని అంటాడు. దేవా మాటలు విని మిథున చాలా సంతోషపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















