Ammayi garu Serial Today july 28th: అమ్మాయి గారు సీరియల్: రుక్మిణి దొరికిపోయిందా.. రాజు, విరూపాక్షిల భయానికి కారణమేంటి?
Ammayi garu Serial Today Episode july 28th రుక్మిణి జీవితం గురించి సూర్యప్రతాప్ టెన్షన్ పడుతూ పంతుల్ని పిలిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్ రుక్మిణికి ప్రమాదం ఉందని స్వామీజీ చెప్పడం గురించి టెన్షన్ పడుతూ రాత్రంతా పడుకోడు. రూప తండ్రి కోసం ఉదయం కాఫీ తీసుకొచ్చి తండ్రి కూర్చొని ఉండటం చూసి ఏడుస్తుంది. సూర్యప్రతాప్ రూప గురించి రుక్మిణికి చెప్పుకొని చాలా ఏడుస్తాడు.
రూప మనసులో సారీ నాన్న నేనే రూప అని మీతో చెప్పుకోలేకపోతున్నా అని అనుకుంటుంది. సూర్యప్రతాప్ రూపకి చేయాల్సినవన్నీ నీకు చేయాలి అనుకున్నా కానీ స్వామీజీ అలా చెప్పగానే నా గుండె ముక్కలైపోయిందమ్మా ఎందుకు నా కూతురి మీద దేవుడు ఇలా పగ పట్టాడో అర్థం కాలేదని ఏడుస్తాడు. నువ్వు ఉండగా నాకు ఏం కాదు నాన్న అని అంటుంది. స్వామీజీ ఏవేవో చెప్పాడు కానీ నా ప్రాణం పోతుందని చెప్పలేదు కదా అని రుక్మిణి అంటే అలా అనకు తల్లి నా ప్రాణం అడ్డు వేసి అయినా సరే నిన్ను కాపాడుకుంటా అంటారు.
ఇంతలో చంద్ర వచ్చి పంతులు వచ్చారని చెప్తాడు. సూర్యప్రతాప్ వెళ్తారు. సూర్యప్రతాప్ పంతులుతో నా పెద్ద కూతురు రూప కోసం మీకు తెలుసు కదా పంతులు తన కోసం ఎన్నో పూజలు చేశాను అయినా నా కూతురు దక్కలేదు.. పెద్ద కూతురిని దూరం చేస్తూనే చిన్న కూతుర్ని దగ్గర చేశాడు. ఇప్పుడు నా చిన్న కూతురికి ప్రమాదం ఉందని ఓ సాధువు చెప్పారు. అప్పటి నుంచి భయంగా ఉంది. అని రుక్మిణి జాతకం చూపిస్తారు. జాతకం పరిశీలించి రేపు చెప్తానని పంతులు అంటారు.
రుక్మిణి తన గురించి టెన్షన్ పడొద్దని గతేడాది మీకు బోనాలలో ప్రమాదం జరిగింది కదా అని రుక్మిణి అనేస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విజయాంబిక, దీపక్‌లు తను రూపే లేదంటే తనకి ఎలా గతేడాది జరిగిన ప్రమాదం గురించి తెలుసు అని అంటారు. దాంతో సూర్యప్రతాప్ ఇక మీరు మారరా గతేడాది జరిగిన విషయం అందరికీ తెలుసు కదా రుక్మిణికి తెలీదా అని అంటారు. అయినా రూప, రుక్మిణిలా ఎందుకు వస్తుంది. తను నా కూతురు అలా ఎప్పటికీ చేయదు. అబద్ధాలు ఆడదు అని సూర్యప్రతాప్ అంటారు. ఒక వేళ అబద్ధం ఆడితే అని విజయాంబిక అడిగితే అలా అయితే నేను తన దృష్టిలో చనిపోయినట్లే అని అంటారు.
రాజు, విరూపాక్షిలు రుక్మిణితో అలా ఎందుకు మాట్లాడారు అని అడుగుతారు. పాతికేళ్లగా నేను శిక్ష అనుభవిస్తున్నా ఇప్పుడు నువ్వు మోసం చేస్తున్నావని మీ నాన్న అనుకుంటే మళ్లీ నిన్ను కూడా దూరం పెట్టేస్తారు అని అంటుంది. అలా ఏం కాదు అమ్మా అని రూప అంటే వద్దు రూప నా గురించి మీ నాన్నకి తెలియాలి అనుకుంటే తెలుస్తుంది లేదంటే లేదు.. అందరిలా సూర్య అబద్ధానికి ఆకర్షితుడయ్యాడు. నిజం ఏదో ఒక రోజు తెలుస్తుంది. ముందు నువ్వు వెళ్లి మీ నాన్నతో నిజం చెప్పేయ్ అంటుంది. రాజు కూడా నిజం చెప్పేద్దామని అంటాడు. నేను అబద్ధం చెప్పా కానీ ఎవరినీ మోసం చేయడం లేదు.. నాన్న నమ్మిన ఒక అబద్ధాన్ని అబద్ధం అని చెప్పడానికే ఈ అవతారం ఎత్తా ఇది సరిపోదు అంటే ఇంకో అవతారం ఎత్తడానికి అయినా వెనకాడను అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















