Chinni Serial Today july 17th: చిన్ని సీరియల్: వరుణ్ కోసం శ్రేయతో లోహిత స్నేహం.. మధుపై నాగవల్లి పగ.. మహి, చిన్నిల గిల్లిగజ్జాలు!
Chinni Today Episode లోహిత వరుణ్ కోసం శ్రేయతో స్నేహం చేయడం పుట్టిన రోజు పార్టీ ఉందని వాళ్లని పిలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహితను చిన్ని చెట్టుకు కట్టేస్తుంది. అక్కడి నుంచి అందర్ని పంపేసి తాను కూడా వెళ్లిపోతుంది. రాత్రి కావడంతో లోహిత చాలా భయపడుతుంది. కాపాడండి కాపాడండి అని ఏడుస్తుంది. ఇంతలో అటుగా ఆటోలో సరళ వెళ్లడం చూసి అమ్మా అమ్మా అని పిలుస్తుంది. ఆటో కాస్త దూరం వెళ్లిన తర్వాత సరళ ఆటో ఆపించి దికి కూతుర్ని కట్టేయడం చూసి లోహిత అని అరుస్తూ పరుగులు తీస్తుంది. లోహిత ఏంటే ఇది నిన్ను ఎవరే ఇలా చెట్టుకి కట్టేసింది అని కంగారు పడి అడుగుతుంది.
లోహిత ఏడుస్తూ కాలేజ్‌లో ఓ రాక్షసి ఉందని చెప్పా కదా అది నన్ను కట్టేసిందని ఏడుస్తుంది. సరళ కోపంగా దాన్ని వదలను ముక్కలు ముక్కలు నరికేస్తారు. దాన్ని చూపించు దాని జుట్టు పీకి పళ్లు పీకి చావగొడత అని చెప్పి లోహితను తీసుకెళ్తుంది. ఉదయం మహి కాలేజ్‌కి వెళ్తూ మధ్యలో ఆగుతాడు. మధుమిత చూసి స్కూటీ ఆపి తన ఫ్రెండ్‌తో మ్యాడీకి ఒక్క జలక్ ఇచ్చి వస్తానని చెప్పి వెళ్లి గుడ్ మార్నింగ్ మ్యాడీ సార్ అని అంటుంది. మహి చిరాకు పడతాడు. మధు బుంగ మూతి పెట్టి మీరు చాలా మంచోడు సార్.. మిమల్ని పిల్లి గడ్డం అన్నందుకు సారీ సార్.. మీలాంటి హ్యాండ్ సమ్‌ని ఏ అమ్మాయి అయినా లవ్ చేస్తుంది. అలాగే ఓ అమ్మాయి మిమల్ని లవ్ చేస్తుంది. మీ లాంటి వాడిని ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. అలా ఓ అమ్మాయి అనుకుంటుంది. మిమల్ని అంతలా ప్రేమిస్తూ ఆరాధిస్తూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని ఉంది కదా సార్ ఆ అమ్మాయి ఎవరో కాదు నేను అని మధు మహికి షాక్ ఇస్తుంది.
మహి షాక్ అయి నేనా అని అడిగితే నేను కాదు సార్ అక్కడుంది కదా ఆ అమ్మాయి అని తన ఫ్రెండ్‌ని చూపిస్తుంది. తర్వాత మధు, మధు ఫ్రెండ్ పెద్దగా నవ్వుతారు. నాతోనే గేమ్స్ ఆడుతావా అని మహి మధు స్కూటీ కీస్ తీసుకుంటాడు. మధు నా కీస్ నా కీస్ అంటే మహి వాటిని తీసుకెళ్లిపోతాడు. పిల్లి గడ్డం నా కీస్ తీసుకెళ్లిపోయాడని మధు అంటుంది. దానికి తన ఫ్రెండ్ ఓవర్ యాక్షన్ చేశావ్ కదా సరిపోయిందా అంటుంది.
నాగవల్లి మధుమిత చేసిన గొడవ గుర్తు చేసుకొని రగిలిపోతుంది. తన మనిషికి పిలిచి ఎవరికీ తెలీకుండా మధు గురించి తెలుసుకోవాలని గుడిలో సీసీ టీవీ ఫుటేజ్ తీసుకురమ్మని విషయం ఎవరికీ తెలీకూడదు అని అంటుంది. ఓసేయ్ నాతో పెట్టుకొని తప్పు చేశావే.. నలుగురిలో నన్ను అవమానించి నా అహం మీద దెబ్బకొట్టావ్.. నేను నీ జీవితం మీద నీ కుటుంబం మీద దెబ్బ కొడతా.. ఎవరు కొడుతున్నారో తెలీదు.. ఎందుకు కొడుతున్నారో తెలీక చస్తూ బతుకుతావ్ నువ్వు అని అంటుంది. ఇంతలో ప్రమీల, వసంత నాగవల్లి దగ్గరకు వస్తారు. మహి వచ్చినా సందడి ఏం లేదని పెళ్లి సందడి లాంటిది ఏమైనా ఉంటే బాగుండేది అని ప్రమీల అంటుంది. మహి, శ్రేయల పెళ్లి సందడి మొదలైతే బాగుంటుందని అంటారు.
శ్రేయ నా ఇంటి కోడలు.. వీలైనంత త్వరగా వాళ్ల పెళ్లి వేడుక మొదలవుతుంది. వాళ్ల పెళ్లి ఎక్కడా కనీ వినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా జరుగుతుందని నాగవల్లి చెప్తుంది. వసంత థ్యాంక్స్ చెప్పి హగ్ ఇస్తుంది. ఇక కాలేజ్‌లో లోహిత తనకు జరిగిన అవమానం తలచుకొని కోపంగా ఉంటుంది. మహిని వదలను అని ఊహించని రీతిలో కౌంటర్ఇస్తా అనుకుంటుంది. ఇంతలో వరుణ్ రావడం చూసి నా లవర్ నా కోసమే వస్తున్నట్లు ఉన్నాడు అని అనుకుంటుంది. వరుణ్ శ్రేయని డ్రాప్ చేయడం చూసి నా లవర్ బైక్ మీద ఇది ఎవరో కూర్చొంది ఏంటే అని షాక్ అయిపోతుంది.
వరుణ్‌ని శ్రేయ అన్నయ్య అనడం చూసి హమ్మయ్యా అనుకుంటుంది. ఇక తన ఫ్రెండ్‌తో ఇప్పుడే నా ఆట మొదలు పెట్టానని అంటూ వరుణ్ దగ్గరకు వెళ్లి హాయ్ చెప్తుంది. వరుణ్ శ్రేయ, మహిలను పరిచయం చేస్తాడు. లోహిత శ్రేయతో రేపు నా భర్త్‌డే అని ముగ్గురిని పిలుస్తుంది. వరుణ్ మహి రావడం కుదరదు అంటే శ్రేయ నువ్వే వాళ్లని తీసుకురావాలని చెప్తుంది. శ్రేయ, లోహిత ఫ్రెండ్స్ అయిపోతారు. మధు పిల్లిగడ్డం అని ఎంట్రీ ఇస్తుంది. మహి తనని కోపంగా చూడటం గురించి లోహిత శ్రేయని అడిగితే బావని తను ఇరిటేట్ చేస్తుందని అంటుంది. ఇద్దరూ కలిసి దాని సంగతి పట్టాలని అనుకుంటారు. శ్రేయ లోహితతో దాన్ని కూడా భర్త్‌డే పార్టీకి పిలు దాన్ని ఇద్దరం కలిసి ఓ ఆట ఆడుకుందాం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?





















