(Source: ECI | ABP NEWS)
Chinni Serial Today july 14th: చిన్ని సీరియల్: నాగవల్లి vs మధుమిత! గుడిలో హైడ్రామా.. లోహిత పెళ్లి ప్లాన్స్.. చిన్ని కోరిక నెరవేరుతుందా?
Chinni Today Episode చిన్ని నాగవల్లికి గుడిలో గొడవ జరగడం మహి, చిన్నిలు గుడిలో కాయిన్ నిల్చొపెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode స్వరూపని నాగవల్లి కొడుతుంది. మళ్లీ నాగవల్లి కొట్టడానికి చేయి ఎత్తితే మధుమిత వచ్చి నాగవల్లి చేయి పట్టుకొని నా చేతి నుంచి చేయి విడిపించుకోలేకపోయావ్ నువ్వు మా బతుకులు గురించి మాట్లాడుతావా అని అడుగుతుంది. వల్లి మధుతో నా చేతినే నలిపేస్తావా ఎంత పొగరే నీకు అని అంటుంది. దానికి చిన్ని మా అమ్మని కొట్టి నందుకు నీ చెంప పగలగొట్టాల్సింది వదిలేసే సంతోషించు మా అమ్మ మీద చేయి వేసిన ఎవరినీ వదలను అని అంటుంది.
నాగవల్లి కోపంతో మీ అమ్మ నా చీర పాడు చేసింది అంటే అది తప్పు కాదు పొరపాటు జరిగింది సారీ కూడా చెప్పింది అంటుంది. ఇంతలో గుడి ట్రస్ట్ వాళ్లు వచ్చి ఏమైందని అడిగితే నాకు అవమానం జరిగింది అని అంటుంది. ఇలాంటి అలగాజనాన్ని మీరు అలౌవ్ చేయకూడదు అంటుంది. దాంతో మధు అలగాజనం అన్నావ్ అంటే నీ పని అయిపోతుందని కొట్టడానికి పళ్లెం తీస్తుంది. ట్రస్ట్‌వాళ్లు గొడవ ఆపి వల్లిని తీసుకెళ్లిపోతారు.
మహి బామ్మర్ది ఓ రెస్టారెంట్‌లో ఉంటే లోహిత కూడా తన ఫ్రెండ్స్‌తో అదే రెస్టారెంట్‌కి వెళ్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ లోహితకు ఫ్యూచర్ ప్లాన్స్ అడుగుతారు. దానికి లోహిత 2 ఏళ్ల చదువు అయిపోయిన తర్వాత ఓ రిచ్ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటానని అతను నాకు అడిగినంత డబ్బు ఇవ్వాలని ఫారెన్ ట్రిప్పులు అంటూ తన కోర్కెలన్నీ చెప్తుంది.
స్వరూప, చంటి, మధుమిత కూర్చొని ఉంటారు. చిన్ని విషయాలకు కోపం ఎందుకు అమ్మా అని స్వరూప అంటుంది. ఇది చిన్ని విషయమా అని మధు అంటుంది. అమ్మ మీద చేయి వేస్తే ఎవరైనా ఊరుకోను అని అంటుంది. ఇక కొంత మంది జనం గుడి ముందు రూపాయి బిల్ల నిలబెడుతుంటే మధుకూడా వెళ్లి రూపాయి బిల్ల నిలబెట్టడానికి చంటిని తీసుకొని పరుగులు పెడుతుంది. మహి, చందు, లోహిత త్వరలోనే కనిపించాలని చిన్ని కోరుకుంటుంది. చంటి మనసులో అక్కకి ఇళ్లరికం భర్త రావాలని అనుకుంటాడు. ఇద్దరి కాయిన్స్ నిల్చొంటాయి. ఇద్దరూ ఎగిరి గెంతులేస్తారు. మన కోరికలు నెరవేరుతాయి అక్క అని చంటి అంటాడు. తర్వాత శ్రేయ మహికి కాయిన్ ఇచ్చి ఇద్దరూ కాయిన్ నిల్చొపెట్టడానికి వెళ్తారు.
మహి మనసులో తన మనసులో ఉన్న చిన్ని కళ్ల ముందుకు రావాలని కోరుకుంటాడు. ఇక శ్రేయ అయితే తనకు బావకి పెళ్లి అవ్వాలని కోరుకుంటుంది. మహి కాయిన్ నిల్చొవడంతో ఎగిరి గంతులేస్తాడు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందని అంటాడు. ఇక శ్రేయ కూడా హ్యాపీ అని బావకి చెప్తుంది. మహితో పంతులు శివలింగానికి పూజ చేయిస్తారు. ఇక మధుమిత వాళ్లు ప్రదక్షిణలు చేస్తుంటారు. మహి శివలింగానికి నీరు పాలు అభిషేకం చేస్తుంటాడు. ఆ పాలు బయటకు మార్గంలో పడుతుంటే మధు టేస్ట్ చేస్తుంది. పాలలో పంచధార సరిపోలేదని పంతుల్ని అడిగి తాగి అభిషేకం పాలు అమృతంలా ఉన్నాయని అంటుంది. పాల దాత సుఖీభవ అని నవ్వుకుంటూ వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















