అన్వేషించండి

Brahmamudi November 30th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : అరుణ్‌ కోసం హాస్పిటల్‌కు వెళ్లిన రాజ్‌, కావ్య - స్వప్నను ఇంట్లోంచి గెంటివేయాలన్న రుద్రాణి

Brahmamudi Serial Today Episode: అరుణ్‌ను వెతుక్కుంటూ వెళ్లిన రాజ్‌, కావ్యలకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ ఎంతో ఇంట్రెస్టింగ్‌ జరిగింది.

Brahmamudi Telugu Serial Today Episode: స్వప్న నిజంగానే తల్లి కాబోతుందని కావ్య చెబితే.. కనకం అస్సలు నమ్మనని చెప్తుంది. అది మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టినట్టుందని అంటుంది. దీంతో కావ్య తర్వాత ఫోన్‌ చేస్తానని కట్‌ చేస్తుంది. రాజ్‌ నవ్వుతూ సరేలే కానీ ఎక్కడికి వెళ్లాలో చెప్పు అంటాడు.

కావ్య: హాస్పిటల్‌కి

రాజ్‌: దేనికి?

కావ్య: ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్‌ చేసుకోవడానికి

ప్రెగ్నెన్సీ గురించి చెప్పగానే సడెన్‌గా కారు ఆపి షాక్‌ అవుతాడు. కొంపతీసి నీకు... అని అడగగానే అంతసీన్‌ లేదు. ఆ అరుణ్‌ పనిచేస్తున్న హాస్పిటల్‌ కు వెళ్లి వాణ్ని పట్టుకొద్దాం అని చెబుతుంది. కనకం వాళ్ల అక్కకు కంగారుగా స్వప్న నిజంగానే కడుపుతో ఉందంట అని చెప్తుంది. కళ్యాణ్‌, అప్పులను ఒక్కటి చేయడానికి.. నేను ఆ ఇంటికి వెళ్లడానికి దేవుడే నాకు ఒక అవకాశం ఇచ్చాడని సంతోషపడుతుంది కనకం. హాస్పిటల్‌కు వెళ్లిన రాహుల్‌, కావ్య నీకొసం వెతుక్కుంటూ వస్తుంది. జాగ్రత్తగా ఉండమని అరుణ్‌ను హెచ్చరిస్తాడు. నిన్ననే జాబ్‌కు రిజైన్‌ చేశానని.. నా అడ్రస్‌ కూడా ఎవ్వరికి తెలియనివ్వకుండా ఉంటానని అరుణ్‌ చెప్తాడు. కావ్య, రాజ్‌ హాస్పిటల్‌కు వచ్చి అరుణ్‌ గురించి ఎంక్వైరీ చేస్తారు. ఆయన నిన్ననే రిజైన్‌ చేశారని అడ్రస్‌ కూడా తెలియదని చెప్తారు. దీంతో కావ్య కోపంగా ఆసహనంగా

కావ్య: అంతా మీ వల్లే జరిగింది. నేను అనుకున్న ప్లాన్‌ మొత్తం ఫెయిల్‌ అయింది.

రాజ్‌: వాడు జాబ్‌ మానేసి వెళ్లిపోతే మధ్యలో నేను ఏం చేశాను.

కావ్య: మీరు నేను చెప్పినప్పుడే ఆలస్యం చేయకుండా వచ్చి ఉంటే ఇప్పుడు మనకు వాడు తప్పకుండా దొరికి ఉండేవాడు.

వాడి మీద కోపం నామీద చూపిస్తున్నావా? అంటూ రాజ్‌ అనడంతో.. స్వప్న సినిమా డైలాగులు చెప్తుంది. దీంతో రాజ్‌ షాకింగ్‌ గా చూస్తూ ఇప్పుడున్న సిచ్యుయేషన్‌ ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటూ వెళ్దాం పద అని ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు. చాటు నుంచి రాజ్‌, కావ్యను గమనిస్తున్న రాహుల్‌, అరుణ్‌కు మరిన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనామిక బాధగా ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది. ఇంతలో అక్కడికి కళ్యాణ్‌ వస్తాడు. కళ్యాణ్‌ను చూసిన అనామిక కోపంతో కూడిన వెటకారంగా..

అనామిక: ఏంటి సార్‌? అప్పుడే వచ్చేశారు. మీరింకా ఈ రోజంతా అక్కడే ఉండి మీ ఫ్రెండ్‌ను ఓదారుస్తారనుకున్నాను.

కళ్యాణ్‌: ఇంకా కోపం తగ్గలేదా?

అనామిక: కోపం కాదు బాధ నీ ఫ్రెండ్‌తో నువ్వు ఎలాగైనా ఉండు అది నీ ఇష్టం. కానీ నేను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు నాకే ఇంపార్టెంట్‌ ఇవ్వాలని నేను కోరుకుంటాను కదా? అందులో తప్పేమైనా ఉందా?

కళ్యాణ్‌: తప్పని ఎవరన్నారు?

అనామిక: మరి నువ్వు ఇప్పుడు చేసింది ఏంటి? నన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పి అప్పు కోసం నన్ను రోడ్డు మీద నిలబెట్టావు.  గంటసేపు పిచ్చిదానిలా కారులో కూర్చుని ఉన్నాను.

కళ్యాణ్‌: అర్థం చేసుకో అనామిక పాపం అప్పును అలా చూస్తే.. నీకు బాధగా లేదా?  

అంటూ అనామికను కన్వీన్స్‌ చేస్తాడు కళ్యాణ్‌. త్వరలోనే మన పెళ్లి గురించి మాట్లాడతాను. త్వరలోనే ముహూర్తం కూడా  ఫిక్స్‌ చేయండని చెప్తాను అనడంతో అనామిక సంతోషంగా కళ్యాణ్‌ను హగ్‌ చేసుకుంటుంది.

హాల్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. స్వప్న వంటమనిషిని పిలిచి తనకోసం స్పెషల్‌ వంటకాలు చేయాలని ఆర్డర్‌ వేస్తుంది. అది గమనించిన రుద్రాణి కోపంగా స్వప్నను తిడుతుంది. ఏ హక్కుతో ఆర్డర్‌ వేస్తున్నావని అడుగుతంది. మీరు ఏ హక్కుతో ఇక్కడ ఉన్నారో నేను అదే హక్కుతో ఆర్డర్‌ వేస్తున్నానని స్వప్న బదులిస్తుంది. ఇలాంటి పొగరున్నదాన్ని ఇంకా ఇంట్లో ఉండనివ్వడం ఏంటని రుద్రాణి వాళ్ల అమ్మనాన్నకు చెప్తుంది.

రాజ్‌: నువ్వు స్వప్నని బయటికి పంపాలంటే దానికి తగిన సాక్ష్యాలు కావాలి.

రుద్రాణి: సాక్ష్యాలు కావాలంటే ఎక్కడికెళ్లి తేవాలి. ఉన్నవన్నీ వాడు మీ అందరి ముందు బయటపెట్టిన ఇంకా బిడ్డకు తండ్రి ఎవరో తేలిపోవాల్సిందే అంటే ఎలా? ఇలాంటి మోసగత్తేను.. ఇలాంటి పొగరుబోతు ఆడదాన్ని ఇంట్లో పెట్టుకుని అనుక్షణం నా కొడుకు కుమిలిపోతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా?

అంటూ స్వప్నను ఇంట్లోంచి గెంటివేయబోతుంటే స్వప్న నిజం నిరూపించి నన్ను గెంటివేయండి అంటూ  బదులిస్తుంది.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Embed widget