Brahmamudi Serial Today October 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రుద్రాణిని వాయించిన స్వప్న – కొత్త ప్లాన్ వేసిన అపర్ణ
Brahmamudi Today Episode: కావ్యను జీవితంలో చూడన్న రాజ్ మాటలకు హ్యాపీగా ఫీలవుతుంది రుద్రాణి.. నెక్ట్ టార్గెట్ కంపెనీ అని రాహుల్ తో చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Brahmamudi Serial Today Episode: ఇందిరాదేవి, అపర్ణ ఇద్దరూ కలిసి రాజ్‌ను కన్వీన్స్ చేయాలని చూస్తారు. రాజ్ వినడు. నాకు చెప్పే హక్కు మీరిద్దరూ పోగొట్టుకున్నారు అంటాడు. ఇక నేను ఒంటరిగానే బతుకుతాను. మమ్మల్ని కలపాలనే ప్రయత్నం మీరు చేయోద్దు అని చెప్పి వెళ్లిపోతాడు.
ఇందిరాదేవి: అపర్ణ వాడిప్పుడు ఆవేశంలో ఉన్నాడు. బాధపడకు.
సీతారామయ్య: చిట్టి మీరి వాళ్లిద్దరినీ కలపాలనుకున్నారు. కలపాలనుకున్నప్పుడు ఈ నాటకాలెందుకు నిజాయితీగా కలపండి. వాడి మనసులో కావ్య మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఏదో ఒక విధంగా తట్టి లేపండి
అని వెళ్లిపోతాడు. మరోవైపు మూర్తి, కనకం ఏడుస్తూ ఉంటారు. ఇంతోల కావ్య వచ్చి అమ్మానాన్నలను ఓదారుస్తుంది. ఎందుకు ఇదంతా చేశావమ్మా అని అడుగుతుంది.
మూర్తి: మీ అమ్మను ఏమీ అనొద్దమ్మా తను సరైన పనే చేసింది.
కావ్య: మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి నాన్నా..
మూర్తి: అవునమ్మా.. మీరిద్దరూ విడిపోయి దూరంగా ఉంటే మేము అందరం చూస్తూ ఉన్నాము కానీ మిమ్మల్ని కలపడానికి ఏమీ చేయలేదు. కానీ మీ అమ్మ ఆ పని చేసింది. ఇన్నాళ్లు అది అబద్దాలు ఆడుతుంది. నాటకాలు ఆడుతుంది అనుకున్న కానీ మీ అమ్మే కరెక్టు అమ్మా..
కావ్య: కానీ ఓడిపోయింది కదా నాన్న.. అందరి ముందు అవమానాలు పడ్డది కదా? మీ అల్లుడు గారు మోసం చేసింది అన్నారు కానీ ఎందుకు అలా చేసింది అని ఆలోచించలేదు కదా నాన్నా..
మూర్తి: అలా అని వదిలేయలేం కదమ్మా..
కావ్య: అంతకుమించి మనం చేయగలిగింది ఏమీ లేదు నాన్నా.. ఇంకెప్పుడు మమ్మల్ని కలపాలనే ప్రయత్నం చేయకండి.
అంటూ కావ్య ఎమోషనల్ అవుతూ ఏడుస్తుంది. మూర్తి, కనకం బాధపడుతుంటారు. మరోవైపు రుద్రాణి, రాహుల్ తో హ్యాపీగా మాట్లాడుతుంది.
రుద్రాణి: అమ్మ బాబోయ్ ఆ కనకంది మామూలు తెలివి తేటలు కాదురా..! రాజ్ లాంటి మనిషిని క్యాన్సర్ అని నమ్మించి ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి కావ్యతో కలిపేయాలని చూసింది.
రాహుల్: నువ్వు కానీ నిజం బయటపెట్టి ఉండకపోతే ఈ పాటికి కావ్యను ఇంటికి తీసుకొచ్చి హారతి పట్టేసేవారు.
రుద్రాణి: నేను ఉండగా అది జరగనిస్తానా..? ఇప్పుడు చూడు పర్మినెంట్ గా రాజ్ కావ్యను దూరం పెట్టేశాడు.
రాహుల్: నువ్వు అనుకున్నది సాధించేశావు మామ్. కానీ అమ్మమ్మ నిన్ను లాగిపెట్టి కొట్టింది కదా? అదొక్కటే చిన్న ఇబ్బందిగా ఉంది. బాగా తగిలిందా? మమ్మీ..
అని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే స్వప్న వస్తుంది. నీ తెలివితేటలకు హ్యాట్సాప్ అంటుంది. మీరేంటే తెలిశాక మీకు సరెండర్ అయిపోదామనుకుంటున్న అంటూ గుంట నక్కల కన్నా డేంజర్ మీరు అంటుంది. తర్వాత కనకం, అపర్ణ, ఇందిరాదేవి ముగ్గురు ఒకచోట కలుసుకుని మాట్లాడకుంటారు.
ఇందిరాదేవి: చీచీ నా పెద్దరికం మంట కలిసింది.
అపర్ణ: కన్నతల్లిగా నేను ఓడిపోయాను.
కనకం: మీరిద్దరే అలా అంటే నేనేం అనాలి.
ఇందిరాదేవి: నువ్వింకేం అంటావు కనకం. అందరి కన్నా ఎక్కువ మాటలు పడింది నువ్వే కదా…?
కనకం: ఇంత జరిగాకా అల్లుడు గారు నా కూతురును ఇష్టపడతారా?
అపర్ణ: ఇద్దరు కలిసిపోతారని ఆశపడితే శాశ్వతంగా విడిపోయేలా ఉన్నారు. వాడి మనసులో కావ్య ఉందనే విషయాన్ని ఎలా బయటపెట్టాలి.
ఇందిరాదేవి: ఏది ఆలోచించినా ఇకముందు తెలివిగా ఆలోచించాలి.
కనకం: అంటే ఇంతకుముందు నేను తెలివి తక్కువగా ఆలోచించాననే కదా?
ఇందిరాదేవి: ఏయ్ మా రాజ్ లాగా ప్రతి దానిలో తప్పు తీయకు.
అంటూ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. ఇంతలో కనకం కోపంగా ఆ రుద్రాణిని మర్డర్ చేయాలనుకుంటున్నాను అంటుంది. ఇందిరాదేవి, అపర్ణ షాక్ అవుతారు. నువ్వు అలాంటి పిచ్చిపిచ్చి ఆలోచనలు చేయకు అంటారు. ఈసారి మరో ప్లాన్ చేద్దాం అని అపర్ణ చెప్తుంది. ఈ సారి నాటకం ఆడటం కాదని నిజాయితీ చేద్దామని అపర్ణ చెప్తుంది. కావ్య బొమ్మలకు రంగులు వేస్తుంటే ముగ్గురు కావ్య దగ్గరకు వెళ్తారు.
కావ్య: లక్ష్మీ, పార్వతి, సరస్వతి ముగ్గురు అమ్మలు కలిసి వచ్చారు. మళ్లీ ఏదైనా జగన్నాటకం మొదలుపెట్టారా?
అపర్ణ: ఏంటి ఒళ్లు ఎలా ఉంది.
కావ్య: మా అమ్మా నాటకాల సంస్థలో నాటకాలు వేసి వేసి అలిసిపోయాను. అయినా ఈ మాట నన్నెందుకు అడుగుతారు. మీ అబ్బాయిని అడగండి.
ఇందిరాదేవి: ఇక ఏదీ ఎవర్ని అడిగే అవసరం లేదు. ఎవరి మీద ఆధారపడి లాభం లేదు. వాడికి సరైన గుణపాఠం చెప్పడం కోసమే ముగ్గురం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం.
కావ్య: అయితే కచ్చితంగా అది నా మెడలో చుట్టుకుంటుంది. మీ నిర్ణయాలన్నీ మీరే మీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్లిపోండి.
అనగానే ముగ్గురు కలిసి కావ్యను తిడతారు. మేమంటే నీకు విలువే లేదా? అని అడుగుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘జగధాత్రి’ సీరియల్: ఆరాధ్యను కనిపెట్టిన కేదార్ – పెళ్లికూతురును కొట్టిన ధాత్రి