అన్వేషించండి

Brahmamudi Serial Today October 18th:  ‘బ్రహ్మముడి’ సీరియల్‌:   వ్రతం మధ్యలో వెళ్లిపోయిన రాజ్ – రుద్రాణిని వాయించిన ఇందిరాదేవి  

Brahmamudi Today Episode:  కనకం నాటకం ఆడుతుందని రుద్రాణి చెప్పడంతో రాజ్‌ వ్రతం మధ్యలో వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode:   వ్రతం మధ్యలో రుద్రాణి ఏదేదో మాట్లాడుతుంటే.. అపర్ణం కోపంగా ఏదైనా ఉంటే ఇంటికి వెళ్లాక మాట్లాడుకుందాం అంటుంది.  నాటకం ఇక్కడ జరుగుతుంటే మనం ఎక్కడికో వెళ్దాం అంటావేంటి వదిన అంటుంది రుద్రాణి. అసలు ఏమైంది అత్తా అంటూ రాజ్‌ అడగడంతో నన్ను అడగడం కాదు మీ అత్తనే అడుగు అని చెప్తుంది రుద్రాణి. ఇంతలో కనకం లేచి రుద్రాణి గారు నేనేం చేయలేదు. దయచేసి మీరు కామ్‌ గా ఉండండి అంటూ వేడుకుంటుంది.

కావ్య: రుద్రాణి గారు ఏ ఆధారం లేకుండా మా అమ్మ మీద నిందలు వేస్తే ఈ ఇంటి వియ్యపురాలు అని కూడా నేను చూడను.

రుద్రాణి: నువ్వు చూసేదేంటి? ఇలాంటి ఇంటికి వియ్యపురాలిని అని చెప్పుకుంటే నా పరువే పోతుంది.

కావ్య: అంత తప్పు మా అమ్మ ఏం  చేసింది.

రుద్రాణి: అల్లుణ్ని రప్పించడానికి కూతుర్ని అల్లుడిని కలపడానికి మీ అమ్మకు క్యాన్సర్‌ వచ్చి నాలుగు రోజుల్లో చావబోతుందని అబద్దం చెప్పింది.

రుద్రాణి మాటలకు అందరూ షాక్ అవుతారు.

రాజ్‌: అత్తా నీకేం తెలుసని మాట్లాడుతున్నావు. ఇలాంటి విషయాలు అందరి ముందు బయటపెడతారా? ఆవిడకు నిజంగానే క్యాన్సర్‌ ఉంది. ఆవిడ త్వరలోనే చనిపోతుంది.

రుద్రాణి: అవునా ఆ ముక్క మీ అత్తని తల పైకెత్తి చెప్పమను..క్యాన్సర్‌ తో కుంగిపోతుందా? సిగ్గుతో తల నేలకు వాల్చిందా?

రాజ్‌: ఏంటండి.. మా అత్త ఏదేదో మాట్లాడుతుంది. మీరు ఎప్పట్లా ఎదురు తిరిగి మాట్లాడటం లేదు. వాళ్లు చెప్పేది అబద్దం అని ఎందుకు చెప్పడం లేదు. మీకు నిజంగానే క్యాన్సర్‌ లేదా.. చెప్పండి?  

లేదని కనకం తలూపుతుంది..

రుద్రాణి: చూశారా? సభాసదులారా? ఈ ఇంటి శూన్యంలో కూడా ఒక మాయ విలయతాండవం చేస్తుంది. అడుగు వేస్తే నిలువెళ్లా ముంచేస్తుంది.

మూర్తి: కనకం ఏంటో ఇది ఏం చేసినా క్షమిస్తున్నాను అని చివరికి ఇలా కూడా తలవంపులు తీసుకొస్తున్నావా? ఇంతమందిలో దోషిగా నిలబడి నువ్వేం సాధించావే.

రుద్రాణి: ఇప్పుడు ఒక పని చేయ్‌ కనకం. ఇవ్వని ఏమీ వద్దు కానీ నువ్వొక డ్రామా కంపెనీ పెట్టుకో.. కనకం డ్రామా కంపెనీ నీ ముగ్గురు కూతుర్లను హీరోయిన్స్‌ గా పెట్టుకో..

కనకం: అల్లుడు గారు నిజంగా ఇందులో నా స్వార్థం ఏమీ లేదండి..

రాజ్‌: ఎందుకండి నా ఎమోషన్స్‌ తో ఇలా ఆడుకున్నారు. మీరు త్వరలో చనిపోబోతున్నారని  మీ ఆఖరి కోరికను తీర్చడం కోసం మీ పెళ్లి రోజు జరిపించాలనుకున్నందుకు చివరికి నన్నే ఫూల్‌ ను చేశారు కదండి. అడుగడుగునా నాటకమే.. నోరు విప్పితే మాయాజాలమే. మీ మోసం బయటపడి వెర్రి వాణ్ని అయ్యాను.

కనకం: నేను మీ ఇద్దరిని కలపడానికి..

రాజ్: చాలు ఆపండి.. వంచనతో కాపురాలు నిలబడతాయని ఎలా అనుకున్నారు. ఏంటీ దారణం. దుగ్గిరాల ఫ్యామిలీ అనుకున్నారా? మీకు లేకపోతే కనీసం మీ కూతురుకైనా లేదా..?

కావ్య: సిగ్గు ఆ మాట కూడా అనండి..

రాజ్‌: ఎన్ని అంటే ఏం లాభం ఆ రక్తంలోనే ఉంది ఈ మోసం  చేసే గుణం. ఆ పెంపకంలోనే  ఉంది ఎదుటివాళ్లను వంచించే గుణం. ఎక్కడో ఒక చోట మారిపోతారని ఆశ ఉండేది. కానీ మీ బుద్ది చూపించుకున్నారు. చ ఏం బతుకులు మీవి.. చూస్తుంటేనే ఆసహ్యం వేస్తుంది.

కావ్య: ఇందుకేనా ఈ నాటకం ఆడింది. కలిపేశావా మమ్మల్ని.. సిగ్గు లేదా అనకున్నా ఏం బతుకులు మనవి అంటున్నాడు. చచ్చిపోవాలన్నంత బాధగా ఉంది. ఇప్పుడు ఏం చప్తే ఎవరు నమ్ముతారు.

అపర్ణ: ఎవరూ నమ్మక్కర్లేదు. ఈ నాటకానికి తెర తీసిందే నేను..

ఇందిర: కనకం వెనకుండి నడిపించిందే నేను

అపర్ణ: ఇందులో కనకం సహకరించిందే తప్పా నా కొడలుకు ఏమీ తెలియదు.

రాజ్‌: అంటే మీరు కూడా మోసపోయారని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ మీరు కూడా ఈవిడలాగే మోసం చేశారని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఈవిడతో చేరి మీరు ఇలాగే తయారయ్యారా?

అపర్ణ: ఒరేయ్‌ నేను చెప్పేది విను.. ఆవేశ పడకు

రాజ్‌: ఏం చెప్తారమ్మా.. అందరూ కలిసి నన్ను వెర్రి వాణ్ని చేశారు. నా చుట్టు ఉచ్చు బిగించారు. మమ్మీ ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు చేసిన ఒక సంఘటన వల్ల నేను ఈ కళావతిని అపార్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడే కరెక్టుగా అర్థం చేసుకున్నాను. ఇక జీవితంలో కళావతిని ఈ కుంటుంబాన్ని నేను చచ్చినా నమ్మను. గుడ్‌ బై..

   అంటూ రాజ్ వెళ్లిపోతాడు. ఇందిరాదేవి కోపంగా వెళ్లి రుద్రాణిని కొడుతుంది. అందరూ షాక్‌ అవుతారు. నువ్వు ఆసలు ఆడదానివేనా..? అంటూ తిడుతుంది. నీలాంటి పాముకు పాలు పోసి పెంచినందుకు సిగ్గుపడుతున్నాను అంటుంది. అపర్ణ కూడా రుద్రాణిని కొట్టబోయి ఇంటి ఆడపడుచువి కాబట్టి వదిలేస్తున్నాను అంటుంది. రాహుల్‌, రుద్రాణిని తీసుకెళ్తాడు. కనకాన్ని ఏమీ అనకని కావ్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇందిరాదేవి. వచ్చిన వాళ్లు వచ్చినట్లే ఒక్కొక్కరుగా వెళ్లిపోతారు. ఇంటికి వెళ్లిన అపర్ణ కోపంగా రాజ్‌ను తిడుతుంది. మేమే కావాలని కనకంతో కలిసి నాటకం ఆడాము అని చెప్తుంది. మేము ఇప్పటికీ తప్పు చేశామని అనుకోవడం లేదు అని చెప్తుంది. ఇందిరాదేవి కూడా రాజ్‌ ను తిడుతుంది. ఇద్దరూ కలిసి రాజ్‌ను కన్వీన్స్‌ చేయాలని చూస్తారు. రాజ్‌ వినడు. నాకు చెప్పే హక్కు మీరిద్దరూ పోగొట్టుకున్నారు అంటాడు. దీంతో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమితో గొడవ పెట్టుకున్న నక్షత్ర – నక్షత్రను గగన్‌తో

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Maharashtra Elections : మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
మహారాష్ట్రలో 2 శివసేనలు, 2 ఎన్సీపీలు - కలగాపులగా రాజకీయంలో ఫలితం ఎటు తేలుతుంది ?
BC Protection Act : బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
బీసీ రక్షణ చట్టం గేమ్ ఛేంజర్ - పక్కా ప్లాన్‌తో టీడీపీ!
Moosi Project Politics :  మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ -  బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
మూసి ప్రక్షాళనపై సీఎం రేవంత్ ఆలౌట్ గేమ్ - బీఆర్ఎస్, బీజేపీలకు గడ్డు పరిస్థితే !
Jio Cloud PC: చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
చిటికేస్తే మీ ఇంట్లో టీవీ కంప్యూటర్‌ అయిపోతుంది - 'జియో క్లౌడ్‌ పీసీ'తో మ్యాజిక్‌ చేయండి
Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్
Yahya Sinwar Death: హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
హమాస్‌ అధినేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్- యుద్ధం ఆపేది లేదన్న నెతన్యాహు
Embed widget