అన్వేషించండి

Meghasandesam Serial Today October 17th: ‘మేఘసందేశం’ సీరియల్‌: భూమితో గొడవ పెట్టుకున్న నక్షత్ర – నక్షత్రను గగన్‌తో తిట్టించిన భూమి  

Meghasandesam Today Episode: నక్షత్ర ఫోన్‌ తీసుకుని గగన్‌ కు కాల్‌ చేస్తుంది భూమి. నక్షత్రను నిన్ను ప్రేమిస్తుందేమోనని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Meghasandesam Serial Today Episode:  భూమి ఇచ్చిన బట్టలు వేసుకున్న శరత్ చంద్ర ఎమోషనల్‌ అవుతుంటాడు. భూమే మన బిడ్డ అయితే బాగుండు అని శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి చెప్తుంటాడు. భూమి మన బిడ్డ ఎందుకు కాకూడదు అంటూ బాధపడుతుంటాడు.  అంతా వింటున్న భూమి ఏడుస్తుంది. నిజం చెప్పేస్తానని వెళ్లబోతూ గగన్‌ ను గుర్తు చేసుకుని ఆగిపోతుంది. ఆయన మీద మీ కోపం పోయేవరకు నేను మీకు నిజం చెప్పను నాన్నా అనుకుని శరత్‌చంద్ర దగ్గరకు వెళ్లి కండువా వేస్తుంది.

శరత్‌చంద్ర: నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను అమ్మా..

భూమి: అందరికీ కూడా కనిపిస్తే బాగుంటుంది. పదండి.. పదండి..

బిందు: మామయ్యా అదిరిపోయింది. పంచె కట్టులో భలే ఉన్నారు.

చెర్రి: మామయ్యా మండపంలో మీరిలా తిరుగుతూ ఉంటే కచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్‌ మీరే అవుతారు.

శరత్: ఈ క్రెడిట్‌ అంతా భూమిదే.. తనే నన్ను ఇలా తయారు చేసింది.

బిందు: మామయ్యా మళ్లీ పంచె కడుతారో లేదో అందరం కలిసి షెల్పీ దిగుదాం.. రండి..

శరత్: నక్షత్ర రామ్మా..

భూమి: మీకు మా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి..

శరత్‌: నేను అలా వెళ్లి మా ఫ్రెండ్స్‌ కు కనిపించి వస్తానమ్మా వాళ్లు సర్‌ప్రైజ్‌ అవుతారు.

 అని శరత్ వెళ్లిపోగానే నక్షత్ర, భూమిని బయటకు లాక్కెళ్లి కోపంగా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.

భూమి: పెళ్లి పనులు చేస్తున్నాను..

నక్షత్ర: పెళ్లి పనులు అంటే ఇందును రెడీ చేయ్‌. వచ్చిన వాళ్లకు టీ కాఫీలు అరెంజ్‌ చేయ్‌. అంతేకానీ మా డాడీని నువ్వు రెడీ చేయడమేంటి?

భూమి: తండ్రి లాంటి వారు కాబట్టి చేశాను అందులో తప్పేముంది.

నక్షత్ర: మా డాడీకి ఏం కావాలన్నా చేయడానికి నేనున్నాను. నన్ను కూడా ఏమీ చేయనివ్వకుండా నువ్వు అడ్డుపడతావేంటి? ఇక్కడ డాడీకి నాకు అడ్డుపడుతున్నావు. మా బావ ఇంటికి వెళ్తే అక్కడ అడ్డుపడుతున్నావు. ఏంటీ విషయం. కొంపదీసి నువ్వు కానీ లవ్‌ చేస్తున్నావా? ఏంటి?

భూమి: అనుమానం రాకూడని వాళ్లకే అనుమానం వచ్చిందేంటి? ఈ నక్షత్రకు చెప్తే ఇంకేమన్నా ఉందా? ( అని మనసులో అనుకుంటుంది.)

నక్షత్ర: ఏంటి ఆలోచిస్తున్నావు

 అని నక్షత్ర అడగ్గానే నేను అడ్డు పడుతుంది నీ కోసమే అని భూమి చెప్తుంది. మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి. అది మర్చిపోయి ఆ ఇంటి చుట్టు తిరిగితే మీ అమ్మా ఊరుకుంటుందా? నా మాట విని నీ ప్రేమని నీ మనసులోంచి తీసేయ్‌ అని చెప్పగానే నా ప్రేమను తీసేయ్‌ అని చెప్పడానికి నువ్వెవరు అంటూ తిడుతుంది. నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే మా బావ ఎగిరి గంతేస్తాడు అని చెప్తుంది. అయితే ఇప్పుడే తెలుసుకుందాం అని నక్షత్ర ఫోన్‌ తీసుకని గగన్‌కు కాల్‌ చేస్తుంది భూమి. నక్షత్ర మిమ్మల్ని ప్రేమిస్తుందట అని చెప్పగానే గగన్‌ పిచ్చతిట్టుడు తిడతాడు. ముక్కు చెవులు కోసేస్తాను అని వార్నింగ్‌ ఇస్తాడు.

భూమి: అదీ విషయం.. ప్రేమిస్తుందేమో అంటేనే ముక్కు చెవులు మాత్రమే కాదు తాట కూడా తీస్తారట. నిజంగా ప్రేమిస్తున్నావని తెలిస్తే ఇక అంతే.. దీన్ని బట్టి పరిస్థితి ఏంటనేది నీకు అర్థం అయి ఉంటుందిగా.. వస్తాను చాలా పనులు ఉన్నాయి.

నక్షత్ర: దాన్నేమో ఏమీ అనలేదు. మరదలు అనగానే అన్ని మాటలు అనేశాడు. నిజంగానే నా లవ్వు కాదంటాడా?

అని మనసులో అనుకుంటుంది. మరోవైపు శారదను తీసుకుని ఇంటికి వచ్చిన ప్రసాద్‌ లోపలికి వెళ్లకుండా గేటు దగ్గరే నిలబడతాడు. శారద లోపలికి రమ్మని పిలుస్తుంది. నాకు రావాలని ఉన్నా వాడు నన్ను రానివ్వడు అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు గుడి నుంచి ఇంటికి వచ్చిన మీరా ఏడుస్తూ ప్రసాద్‌ వెళ్లిపోయాడు అని చెప్తుంది. ఇందును తీసుకెళ్లి ఆ శారదతో ఆశీర్వాదం ఇప్పిస్తున్నాడు అని అపూర్వ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించిన ఘోర

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget