Nindu Noorella Saavasam Serial Today October 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: ఆరును బంధించిన ఘోర – మనోహరికి లాస్ట్ చాన్స్ ఇచ్చిన రణవీర్
Nindu Noorella Saavasam Today Episode: మనోహరి ప్లాన్ ప్రకారం అమర్ ఫోటోను ఆరుకు కనిపించేటట్టు పెట్టడంతో ఆరు ఆ ఫోటోను పట్టుకోవడంతో ఘోరకు బందీ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ అనుమానంగా మనోహరి రూం సైడు చూస్తూ.. రాథోడ్ ను పిలిచి మనోహరి ఉదయం నుంచి తేడాగా ఉందని కొత్తగా రూం లాక్ చేస్తుందని ఏంటో తెలుసుకోవాలని చెప్తుంది. అయితే ఇప్పుడే తెలుసుకుంటానని రాథోడ్ రూం దగ్గరకు వెళ్లి తెరవడానికి ప్రయత్నిస్తాడు. లోపల లాక్ చేసినట్టు ఉందని ఆగిపోతాడు. లోపల ఘోరతో ఉన్న మనోహరి.. ఆరును ఎలా పొడి ముట్టుకునేలా చేయాలని ఆలోచిస్తుంది. వెంటనే లేచి వెళ్లి అల్మారాలో ఉన్న అమర్ ఫోటో తీసుకొచ్చి ఘోరకు ఇస్తుంది.
మనోహరి: ఇదిగో ఈ అమర్ ఫోటోను ఎలాగైనా ఆరు చూస్తుండగా కింద పడేయాలి. అప్పుడు అది ఫోటోను పైన పెట్టడానికి తీసుకుంటుంది. ఆ పౌడర్ ను ఈ ఫోటో మీద చల్లాలి.
ఘోర: ఆ ఆత్మ పట్టుకునే లోపు ఎవరైనా తీసేస్తే..
మనోహరి: తీయకుండా నేను చూస్తాను.
ఘోర, అమర్ ఫోటో మీద పొడి చల్లి మంత్రిస్తాడు. ఫోటో తీసుకుని మనోహరి బయటకు వెళ్లుంది. డోర్ దగ్గర ఉన్న రాథోడ్ ను చూసి షాక్ అవుతుంది.
రాథోడ్: దుమ్ము చాలా ఉంది. రోజు తుడవడం లేదనుకుంటా?
మనోహరి: ఓవర్ గా ఉంది.
రాథోడ్: ఏంటి మేడం ఇప్పుడు మీరు నాతో ఏదైనా అన్నారా?
మనోహరి: చాలా ఓవర్ అయింది అన్నాను.
అని మనోహరి అనగానే ఏదో చెప్తూనే రాథోడ్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంటే రాథోడ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. లోపలి నుంచి మాటలు వినిపించాయి. లోపల ఎవరైనా ఉన్నారా? మేడం అని అడగ్గానే లేరని చెప్తుంది మనోహరి. మరోవైపు గుప్త తల కిటికీలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆరును పిలిచి నువ్వు త్వరగా వచ్చేయ్ అని చెప్తాడు. సరే అని వెళ్లిపోతుంది ఆరు. మనోహరికి రణవీర్ ఎదురుపడతాడు.
రణవీర్: ఏంటి మనోహరి ఏదో కంగారులో ఉన్నట్టున్నావు. ఏదో పనిలో ఉన్నావని నాకు అనిపిస్తుంది. అది నేను చెప్పిన పనే అనుకుంటున్నాను.
మనోహరి: ప్లీజ్ రణవీర్ ఇక్కడ మనం ఇలా ఎవరైనా చూస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది.
రణవీర్: ప్రాబ్లమ్ చేయడానికే కదా నేను వచ్చింది. ఇవాళ సాయంత్రం లోపు దుర్గ నా కళ్లముందుకు రాకపోతే ఈ ఇంట్లో నీ నిజస్వరూపం మొత్తం బయటపెట్టేస్తాను. నువ్వు నీ స్నేహితురాలిని చంపి మొదలు పెట్టిన ఆట. నువ్వు నీ ప్రాణాలు కాపాడుకుంటూ వచ్చిన అన్ని నిజాలను ఆ అమర్ ముందు బయటపెడతాను. నువ్వు కోరుకున్న జీవితం నీకు కావాలంటే నా కూతురును నాకివ్వు..
మనోహరి: నాకు కొంచెం టైం కావాలి రణవీర్.
రణవీర్: టైం కావాలా? నీకు అయితే సరే నేను అమర్ కు నిజం చెప్తాను.
మనోహరి: నిజం చెప్తావా? రణవీర్ వెళ్లి చెప్పు. ఈసారి నేను ఆపను. నిజం చెప్తే నీ కూతురు నీ దగ్గరకు వస్తుందా? ఇప్పుడేంటి.. అమర్ నీ కూతురు ఎక్కడుందో కనిపెడతాడనుకున్నావా? నువ్వు జీవితం అంతా వెతికినా దుర్గ నీకు దొరకదు.
రణవీర్: సరే మనోహరి ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. ఈసారి దుర్గను నాకు అప్పగించకుంటే నా ఆస్తి మొత్తం పోతుంది. ఆస్థి పోయాక నేను దేన్ని లెక్క చేయనని నీకు బాగా తెలుసు.
మనోహరి: ఈసారి మిస్ అవ్వదు రణవీర్
అని చెప్పగానే రణవీర్ వెళ్లిపోతాడు. తర్వాత అంజు కేక్ కటింగ్ జరుగుతుంది. అక్కడ అందరూ ఉంటారు. ఆరు వెనక నిలబడి ఉంటే ముందుకు రమ్మని భాగీ పిలుస్తుంది. వద్దులే అని అక్కడే ఉంటుంది ఆరు. ఇంతలో మనోహరి, అమర్ ఫోటో ఒక మూలగా పెట్టడాన్ని గమనిస్తుంది ఆరు. ఇంతలో భాగీ వస్తుంది. తను తీసుకొచ్చిన గిఫ్ట్ అంజుకు ఇవ్వమని భాగికి ఇచ్చి వెళ్లి అమర్ ఫోటో చేతిలోకి తీసుకుంటుంది. వెంటనే ఘోర దగ్గరకు బంధీగా వెళ్తుంది ఆరు ఆత్మ. ఘోర ఆత్మను చూసి గట్టిగా నవ్వుతుంటాడు. గుప్త కంగారుగా ఆరు ఎక్కడ ఉందని వెతుకుతుంటాడు. ఇంతలో అక్షింతలు తీసుకుని వచ్చిన భాగీ.. ఆరు ఇచ్చిన గిప్ట్ చూపించగానే అందరూ షాక్ అవుతారు. అంజు.. ఆరును గుర్తు చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్ ను చంపేయమన్న స్వామీజీ