Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ, జీటీ ప్లేయర్స్ మధ్య సై అంటే సై అనే రేంజ్‌లో డ్రామా నడిచింది. ముఖ్యంగా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, గుజరాత్ యంగ్ స్టార్ సాయి సుదర్శన్ మధ్య నడిచిన మాటల యుద్ధం అభిమానులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చింది. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్‌ను సాయి సుదర్శన్ స్లెడ్జింగ్ చేస్తూ ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఇన్నింగ్స్‌లో గిల్ అవుట్ అవ్వగానే.. కోహ్లీ ప్రతి బంతికీ సాయి సుదర్శన్ దగ్గరకు వెళ్లడం స్టార్ట్ చేశాడు. మొదటి వికెట్ పడడంతో సాయి భయపడ్డాడని, ఒత్తిడిలో ఉన్నాడంటూ కోహ్లీ మైండ్ గేమ్ ఆడాడు. ఆ ఎఫెక్ట్ వల్లనేమో కానీ.. సాయి సుదర్శన్ 4వ ఓవర్లోనే తక్కువ స్కోరుకే అవుట్ అయిపోయాడు.
అయితే ఈ దెబ్బకి మనోడు అస్సలు తగ్గేదే లేదన్నాడు. ఆర్సీబీ చేజింగ్ చేస్తున్నప్పుడు.. బెంగళూరు నాలుగు వికెట్లు కోల్పోయి కాస్త ఒత్తిడిలో పడింది. అదే టైమ్‌లో సాయి సుదర్శన్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ దగ్గరకు నడుచుకుంటూ వెళ్లి కౌంటర్ ఇచ్చాడు. "నువ్వు ఒక్కడివి అవుట్ అయితే చాలు.. మ్యాచ్ మా చేతుల్లోకి వస్తుంది" అన్నట్టుగా సైగ చేసాడు. "నేను చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపిస్తా" అంటూ కోహ్లీ అంతే కూల్‌గా బదులిచ్చినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ట్రెండింగ్ వార్తలు





















