ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో నితిన్ అద్వి తండ్రిని ఎదిరించి సొంతంగా నిలబడే కొడుకు పాత్రలో నటిస్తున్నారు. తండ్రికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే పాత్ర ఇది.
Nithin Adwi: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
Nithin Adwi: తెలుగు బుల్లితెరపై రాణిస్తున్న కన్నడ నటుల్లో నితిన్ అద్వి ఒకరు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో ధీరజ్ క్యారెక్టర్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Nithin Adwi: తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'. ఈ సీరియల్‌లో తండ్రిని ఎదిరించి సొంతంగా నిలబడే కొడుకు పాత్రలో నటిస్తున్నారు ధీరజ్ అలియాస్ నితిన్ అద్వి. తండ్రికి ఏ కష్టం వచ్చినా ముందు నిలబడే పాత్ర ఇది. కర్ణాటకకు చెందిన నితిన్ అద్వి... తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తనదైన నటన, లుక్స్‌తో తెలుగు ప్రేక్షకులలో, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నితిన్ అద్వి కెరీర్, సీరియల్స్, రెమ్యూనిరేషన్, సోషల్ మీడియా ఎంత యాక్టివ్‌గా ఉంటాడు.. అనే వివరాలు తెలుసుకుందాం.
సీరియల్స్
నితిన్ అద్వి కన్నడ టెలివిజన్ రంగంలో తన కెరీర్‌ను స్టార్ట్ చేసి, ప్రస్తుతం తెలుగులో బాగా రాణిస్తున్నాడు. కన్నడలో పలు విజయవంతమైన సీరియల్స్, ప్రాజెక్ట్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో కుంకుమ పువ్వు సీరియల్‌లో వినయ్ అలియాస్ బంటి పాత్రలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో హీరో క్యారెక్టర్ పోషిస్తున్నాడు. తండ్రిని ఎదిరించి సొంతంగా నిలబడాలనుకునే ఆఖరి కొడుకుగా నితిన్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
రెమ్యూనిరేషన్
తెలుగు బుల్లితెరపై లీడ్ యాక్టర్‌గా మంచి క్రేజ్ సంపాదించిన నితిన్ అద్వికి డిమాండ్ బాగానే ఉంది. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌కు భారీ టీఆర్‌పీ రేటింగ్స్ రావడంతో నితిన్ పాపులారిటీ బాగా పెరిగింది. దీంతో అతడు రోజుకు మంచి మొత్తంలోనే రెమ్యూనిరేషన్ అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే నితిత్ కచ్చితమైన పారితోషికం వివరాలు అధికారికంగా బయటకు రాలేదు.
Also Read: జ్యూస్‌లో మద్యం కలిపి సిద్ధూతో తాగించిన విజయానంద్...ప్రేరణే తాగించిందంటూ నాటకం
సోషల్ మీడియాలో యాక్టివ్
నితిన్ అద్వి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్(nithinadwi_official)లో బాగా యాక్టివ్‌గా ఉంటాడు. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ సెట్స్ నుంచి బిహైండ్ ది సీన్స్ (BTS) ఫొటోలు, తోటి నటీనటులతో కలిసి చేసే ఫన్నీ రీల్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. స్టైలిష్, ట్రెడిషనల్ లుక్స్‌కి సంబంధించిన ఫొటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు.
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Frequently Asked Questions
'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ లో నితిన్ అద్వి పోషిస్తున్న పాత్ర ఏమిటి?
నితిన్ అద్వి ఎక్కడ నుండి వచ్చారు?
నితిన్ అద్వి కర్ణాటకకు చెందిన నటుడు. ఆయన తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
నితిన్ అద్వి గతంలో ఏ తెలుగు సీరియల్ లో నటించారు?
నితిన్ అద్వి గతంలో 'కుంకుమ పువ్వు' సీరియల్ లో వినయ్ అలియాస్ బంటి పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
నితిన్ అద్వి సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటారు?
నితిన్ అద్వి సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ (nithinadwi_official) లో చాలా చురుకుగా ఉంటారు. సీరియల్ సెట్స్ నుండి ఫోటోలు, సరదా రీల్స్ ను పంచుకుంటారు.
ట్రెండింగ్ వార్తలు





















