అన్వేషించండి

Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!

Telangana AP Weather Alert June 2026: నైరుతి రుతుపవనాలు జూన్ 5న రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 15నాటికి తెలుగు రాష్ట్రాాల్లో విస్తరించనున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నైరుతి రుతుపవనాలు జూన్ 5న రాయలసీమకు, 10న కోస్తాకు.
  • ఏపీలో ఎండలు కొనసాగినా, ఐదు రోజులు ఉరుములతో వర్షాలు.
  • తెలంగాణ వాతావరణం చల్లబడి, 18 జిల్లాలకు భారీ వర్ష సూచన.

Telangana AP Weather Alert June 2026: ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భానుడి భగభగలతో ఉడికిపోతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది. కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌వైపుగా వేగంగా వస్తున్నాయి. గడిచిన వేసవి కాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలను చూసిన ప్రజలకు ఈ వర్షాలు ఎంతో ఉపశమనాన్ని ఇవ్వనున్నాయి. 

విశాఖ వాతావరణ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం, నైరుతి రుతుపవనాల ప్రయాణం చాలా వేగంగా సాగుతోంది. జూన్ ఐదున రాయలసీమ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయి. జూన్ 10న దక్షిణ కోస్తాలోని అన్ని ప్రాంతాలకు వర్షాలు విస్తరిస్తాయి. 

రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ తీవ్రత కొనసాగుతుండగానే, మరోవైపు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు మొదలయ్యాయి. కావలిలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భీమిలిలో ఇప్పటికే రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే వారం రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని, కానీ ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

తెలంగాణలో కూల్‌గా మారిన వెదర్

తెలంగాణలో కూడా వాతావరణం ఒక్కసారిగా మారింది. నిన్నటి వరకు నిప్పులు కొలిమిలా ఉన్న రాష్ట్రం ఒక్కసారిగా చల్లబడింది. పలు చోట్ల వర్షపు జల్లులు కురిశాయి. తెలంగాణలోని మొత్తం 18 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 

వారం రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. దీని వల్ల గాలిలో తేమ పెరిగి వర్షాలు  పడుతున్నాయి. 

వీటి ప్రభావంతో మూడు రోజుల పాటు జోరు వానలు పడతాయని చెబుతున్నారు. మధ్యాహ్నం ఎండ తీవ్ర తగ్గిన తర్వాత ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెబుతున్నారు. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. 

హైదరాబాద్‌లోనూ వాతావరణం చల్లబడింది పటాన్ చెరు, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మాధాపూర్, వంటి ఐటీ కారిడార్‌లో సాయంత్రం వేళలో చిరు జల్లులు కురిశాయి. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి?

నైరుతి రుతుపవనాలు జూన్ 5న రాయలసీమలోకి, జూన్ 10 నాటికి దక్షిణ కోస్తాలోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి. ప్రజలకు ఉపశమనం లభించనుంది.

తెలంగాణలో వాతావరణ అంచనా ఏమిటి?

తెలంగాణలో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. 18 జిల్లాలకు భారీ వర్షాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మూడు రోజుల పాటు జోరు వానలు కురుస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలోనైనా ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయా?

అవును, విశాఖపట్నంలోని భీమిలిలో ఇప్పటికే రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Manav Suthar Test Debut: అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
అఫ్గాన్ తో మ్యాచ్ లో డెబ్యూ చేసిన మానవ్ సుతార్ ఎవరు?: ప్లేయింగ్ ఎలెవెన్ లోకి గుజరాత్ టైటాన్స్ స్టార్.. 15 ఏళ్ల తర్వాత అశ్విన్, జడేజా లేకుండానే బరిలోకి..
Annamalai Real Name: అన్నామలైకు రజనీకాంత్ భాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది - ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ - ఇదిగో ఫుల్ స్టోరీ
అన్నామలైకు రజనీకాంత్ భాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది - ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ - ఇదిగో ఫుల్ స్టోరీ
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget