అన్వేషించండి

Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్

Imtiaz Ali Reaction : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే సరైన టైం అని అన్నారు స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ. ఏబీపీ ఇండియా 2047 కాన్‌క్లేవ్‌లో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంతియాజ్ అలీ యాక్షన్ సినిమాల ట్రెండ్ మధ్య ప్రేమకథలపై మాట్లాడారు.
  • తనకు నచ్చిన, మనస్ఫూర్తిగా నమ్మే కథలనే ఎంపిక చేసుకుంటానని తెలిపారు.
  • ప్రేక్షకులు వినోదం కోరుకుంటారు కానీ, వ్యూహాత్మక లెక్కల గురించి ఆలోచించరన్నారు.
  • ప్రేమంటే ఏంటో ఇంకా వెతుకుతున్నానని, అది దొరకకూడదని ఆశిస్తానన్నారు.

Imtiaz Ali Reaction About Masculine Movies : ఇంతియాజ్ అలీ... బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక శైలి నిర్మించుకున్న డైరెక్టర్, రైటర్, నిర్మాత. ఎక్కువగా లవ్ స్టోరీస్, ఎమోషనల్ అంశాలతో కూడిన కథలను తెరకెక్కిస్తూ సంచలన విజయాలు సాధించారు. ప్రస్తుతం యానిమల్, ధురంధర్ వంటి మాస్ యాక్షన్ స్పై థ్రిల్లర్స్ ట్రెండ్ నడుస్తున్న క్రమంలో తన లవ్ స్టోరీస్‌తో బ్లాక్ బస్టర్స్ సాధించడంపై ఆయన తాజాగా ఏబీపీ కాన్‌క్లేవ్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

'నాకు వేరే ఛాయిస్ లేదు'

ఢిల్లీలో జరిగిన ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్ క్లేవ్‌లో ఇంతియాజ్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ధురంధర్, యానిమల్ వంటి యాక్షన్ ట్రెండ్ నడుస్తున్న టైంలో లవ్ స్టోరీస్ విజయవంతంగా ఎలా నిర్మిస్తున్నారన్న ప్రశ్నకు ఆయన రియాక్ట్ అయ్యారు. 'నేను ఉద్దేశ పూర్వకంగా ట్రెండ్ ఎంచుకోను. నా వద్దకు వచ్చే కథలనే అనుసరిస్తా. మనస్ఫూర్తిగా నమ్మే కథలకే టైం కేటాయించడానికి ఇష్టపడతాను.

నాకు వేరే ఛాయిస్ లేదు. ఒక డైరెక్టర్‌గా మూవీ తీస్తున్నప్పుడు ఒకదానికి రెండేళ్లు కట్టుబడి ఉండాలి. అది చాలా పెద్ద కమిట్మెంట్. నేను చేస్తున్న వర్క్‌ను నేను ప్రేమించాలి. ఆడియన్స్ ఓ మంచి వినోదాత్మక చిత్రాన్ని చూడాలనుకుంటారు. దాని వెనుక వ్యూహాత్మక లెక్కల గురించి ఆలోచించరు. ప్రస్తుతం లవ్ స్టోరీస్ తీయడానికి ఇదే బెస్ట్ టైం అని రీసెంట్‌గా ఒకరు నాతో అన్నారు.' అంటూ చెప్పారు.

Also Read : Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్

ప్రేమంటే...

ప్రేమంటే ఏంటి? అని అడిగితే. 'నాకు తెలిస్తే బాగుండేది. నా చాలా చూపులన్నీ అయిపోతాయి. సినిమాలు తీస్తూ నేను ఇప్పటికీ ప్రేమ నిర్వచనం కోసం వెతుకుతున్నాను. అయితే, దాని అర్థం నేను ఎప్పటికీ కనుగొనకూడదని ఆశిస్తున్నా.' అని అన్నారు.

'సోచా నా థా' మూవీతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన... జబ్ వి మెట్, లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, లవ్ ఆజ్ కల్, తమాషా, హైవే, అమర్ సింగ్ చకీలా మూవీస్ తెరకెక్కించారు. ఇంతియాజ్ తీసే సినిమాలు లవ్ స్టోరీస్, ఎమోషనల్‌గా ఉంటాయి.

Also Read : Aamir Khan : ప్రియురాలితో ఆమిర్ ఖాన్ వివాహం... పెళ్లి డేట్ ఫిక్స్?

Frequently Asked Questions

ఇంతియాజ్ అలీ ఎలాంటి సినిమాలు తీయడానికి ఇష్టపడతారు?

ఆయన ఎక్కువగా ప్రేమకథలు, భావోద్వేగ అంశాలున్న కథలను తెరకెక్కిస్తారు. తన నమ్మకానికి తగిన కథలకే సమయం కేటాయించడానికి ఇష్టపడతానని చెప్పారు.

ప్రస్తుతం నడుస్తున్న యాక్షన్ చిత్రాల ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ అభిప్రాయం ఏమిటి?

తాను ఉద్దేశపూర్వకంగా ట్రెండ్‌ను ఎంచుకోనని, తనకు నచ్చిన, మనస్ఫూర్తిగా నమ్మే కథలనే అనుసరిస్తానని ఆయన తెలిపారు. ప్రేమకథలు తీయడానికి ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నారు.

ప్రేమంటే ఏమిటో ఇంతియాజ్ అలీ ఎలా నిర్వచించారు?

తాను సినిమాలు తీస్తూ ఇప్పటికీ ప్రేమ నిర్వచనం కోసం వెతుకుతున్నానని ఆయన చెప్పారు. దాని అర్థం తాను ఎప్పటికీ కనుగొనకూడదని ఆశిస్తున్నానని అన్నారు.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
జంతర్‌ మంతర్‌ వద్దకు అభిజీత్ దీప్కే !
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Buchi Babu Sana: జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
జాన్వీ కపూర్ డ్రస్‌లేంటి? కెమెరా యాంగిల్స్ ఏంటి? విమర్శలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
Embed widget