అన్వేషించండి

Nindu Manasulu Serial Today June 3rd: జ్యూస్‌లో మందు కలిపింది ఎవరో నిరూపించిన సిద్ధూ....విజయానంద్‌ను అసహ్యించుకున్న మంజుల

Nindu ManasuluSerial Today Episode June 3rd: విశ్వాసం నోటితో జ్యూస్‌లో మద్యం కలిపించింది ఎవరో చెప్పించిన సిద్ధూ...అసలు తాను తాగనే తాగలేదని మంజులకు చెప్పిన కొడుకు

Nindu Manasulu Serial Today Episode: అందమైన ప్రేమకథకు కుటుంబ బంధాలు తోడవ్వడంతో స్టార్‌మా ఛానెల్‌లో ప్రసారమవుుతన్న నిండు మనసులు సీరియల్‌ బుల్లితెర అభిమానులకు ఎంతో దగ్గరైంది. ఇవాల్టి ఏపిసోడ్‌లో సిద్ధూ అసలు మందు తాగలేదని...కేవలం తాగినట్లు నాటకమాడానని తల్లితో చెబుతాడు. అసలు దొంగ విజయానందేనని విశ్వాసం ద్వారా  నిరూపించడంతో మంజుల తన భర్తను అసహ్యించుకుని వెళ్లిపోతుంది. అయితే మందు తాగనప్పుడు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావని ప్రేరణ ప్రేమగా నిలదీయడం ఇవాల్టీ  ఏపీసోడ్‌ను రసవత్తరంగా మారుస్తుంది.

ప్రేమకు ముద్దుపెట్టిన సిద్ధూ
  తాగి తూలుతూ కిందపడిపోతున్న భర్తను తీసుకుని ప్రేరణ తనగదికి తీసుకెళ్తుంది.అక్కడ కూడా కిందపడిపోతుండగా ఏదోవిధంగా బెడ్‌మీదకు చేరుస్తుంది.అక్కడ ఆమెపై పడిపోయిన సిద్ధూ పొరపాటును ఆమెకు ముద్దుపెట్టేస్తాడు.దీంతో అదిరిపడిపోయిన ప్రేరణ ఇలా జరిగిందేంటని అంటుంది.  నాకు ముద్దుపెడతావా అని సిద్ధూను నిలదీస్తుంది. నా భార్యను నేను ముద్దుపెట్టుకుంటాను ఇంకా ఏమైనా చేస్తాననిఅంటాడు.అయినా నిన్ను ముద్దుపెట్టుకోవాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా అని నిలదీస్తాడు. బాగా తాగి ఉన్నాడననుకున్న ప్రేరణ...ఇంకా ఇక్కడే ఉండే ఏదైనా చేసేలా ఉన్నాడని కిందకు వెళ్లిపోతుంది.


విజయానంద్‌కు బుద్ధిచెప్పిన సిద్ధూ
   ఉదయం ప్రేరణ లేచి అందరికీ కాఫీలు ఇస్తుండగా మంజులతీసుకోదు.ఇక్కడ మాకు కాఫీలు ఇవ్వడం సిద్ధూకు మాత్రం మందు ఇవ్వడం నీకు అలవాటే కదా అని విజయానంద్‌ అంటాడు.ఇంతకు బాబుగారులేచారా వెళ్లి మజ్జిగ ఇచ్చిరమ్మని హేళన చేస్తాడు.మందు ముట్టుకోనని కన్నతల్లిమీదే ఒట్టేసి మాట తప్పాడని మంజులకు గుర్తుచేసిబాధపెడతాడు. ఇంతలో అక్కడికి విశ్వాసం రావడం చూసి నువ్వేంటిరా ఇలా వచ్చావని అంటాడు.సిద్ధూబాబు రమ్మని పిలిస్తే వచ్చానని అంటాడు. సిద్ధూ బాబు ఇంకా తాగింది దిగక నిద్రపోతున్నాడని నిన్ను రమ్మని పిలవడమేంటని కోప్పడతాడు.కొంపదీసి నువ్వు కూడా మందు తాగావా ఏంటని అంటాడు. లేదండీ బాబు ఫోన్ చేసి రమ్మంటేనే వచ్చానని అంటాడు. ఇంతలో పై నుంచి వస్తూ నేనే విశ్వాసాన్ని రమ్మని చెప్పానని అంటాడు
     

ఆఫీసులో పార్టీ ఏర్పాటు చేసింది ఎవరని అడుగుతాడు. విజయానంద్‌గారు చెబితేనే ఏర్పాటు చేశామని అంటాడు.మరి అక్కడ నేను ఏం తాగానని అడుగుతాడు. మీరు జ్యూస్‌మాత్రమే తాగారని చెబుతాడు. మరి ఆ జ్యూస్‌లో ఏం కలిసిందని అడగ్గా...కంగారుపడిని విజయానంద్‌ జ్యూస్‌లో ఏం కలుస్తుంది. పండ్లరసం  నీళ్లు,ఐస్‌ మాత్రమే కలుస్తుంది కదా అని అంటాడు. వెంటనే కల్పించుకున్న సిద్ధూ నేను అడుగుతుంది మిమ్మల్నికాదని...విశ్వాసం చెబుతాడనిఅంటాడు.ఆ జ్యూస్‌లో లిక్కర్‌ కలిసిందని చెప్పగానే విజయానంద్‌ షాక్‌ తింటాడు.కాకపోతే ఆ జ్యూస్ మీరు తాగలేదని విజయానంద్‌గారే తాగారని అంటాడు. ఆ లిక్కర్‌ కలపమని చెప్పింది కూడా ఆయనేనని అంటాడు. అయినా డాడీకి మందు అలవాటు లేదు కదా అని అనగా...ప్రేరణ వాళ్లకూతురిని తీసుకెళ్లి విజయానంద్‌ రూమ్‌లో తాగిపడేసిన ఖాళీ సీసాలన్నీ తీసుకుని వస్తుంది. ఇప్పుడు తెలిసిందా అమ్మా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఎవరెవరు కుట్రలు చేస్తున్నారోనని అంటాడు. రాత్రి నేను తాగి రాలేదని....అలా నాటకమాడానని చెబుతాడు. నీమీద ఒట్టుపెట్టిన తర్వాత  తాగుతానని ఎలా అనుకున్నావని అంటాడు.దీంతో మంజుల కోపంతో వెళ్లిపోతుంది. ఇంకోసారి ఇలాంటి పిచ్చిపిచ్చి ట్రిక్‌లు చేస్తే తాట తీస్తానని సిద్ధూ వార్నింగ్ ఇస్తాడు.అసలు మీరు లిక్కరు కలుపుతున్నప్పుడే నేను చూశానని....అది వీడియో తీసి మా అమ్మకు చూపించగలనని  కాకపోతే అప్పుడు నీకు నాకు పెద్ద తేడా ఉండదని చెప్పి వెళ్లిపోతాడు.ఇంత జరిగిన తర్వాత  నేను కూడా  మీకు వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా అని చెప్పి ప్రేరణ వెళ్లిపోతుంది.

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today August 6th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: విశ్వక్ పూర్తిగా మారిపోయాడా..? అమూల్య షాక్! ఒక్క ఎపిసోడ్‌లో 3 ట్విస్ట్‌లు!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget