అన్వేషించండి

Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: అమరావతిలో పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించిన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. తెలంగాణ జాగీరు వివాదం, కేటీఆర్‌తో సంబంధాలు, వైసీపీ 3 రాజధానుల ఫెయిల్యూర్‌పై  కీలక వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan on KTR: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన అనంతరం జనసేనాని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సభ వివాదం, తెలంగాణ నేతల కౌంటర్లు, ఏపీ రాజకీయాలపై భావోద్వేగంతో మాట్లాడారు. 

గద్దర్ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు  !

తెలంగాణ నేతల జాగీరు  వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ 100 శాతం ఇక్కడి భూమిపుత్రుల జాగీరే, అందులో ఎలాంటి సందేహం లేదు, కాదని ఎవరన్నారు.. కానీ నన్ను అడుగుపెట్టనివ్వను అనడం సరికాదు. ప్రజా గాయకుడు గద్దర్ అన్నా ఎప్పుడూ ఇలాంటి సంకుచిత భాష మాట్లాడలేదు  అని గుర్తుచేశారు. తెలంగాణపై తనకు అపారమైన ప్రేమ ఉందన్న పవన్.. రెండు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారని, వారి అభివృద్ధిని పట్టించుకోకుండా కొందరు నేతలు కుల దూషణలకు, ప్రాంతీయ విద్వేషాలకు దిగుతున్నారని మండిపడ్డారు. భూమికి సరిహద్దులు వేయగలరు కానీ, మనసుల్లో వేసే విభజన రేఖలు చాలా లోతుల్లోకి వెళ్తాయని, వీటికి చరమాంకం పలకాలని తాము నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

 కేటీఆర్‌తో  బ్రదర్లీ  రిలేషన్.. కాంట్రాక్టులపై నిలదీత 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పవన్ ఆసక్తికర సమాధానమిచ్చారు.  కేటీఆర్ కి నాకు మధ్య ఉన్నది  బ్రదర్ రిలేషన్ షిప్ . మా ఇద్దరికీ పరస్పర గౌరవం, ఇష్టాలు ఉన్నాయి. ఆయన నా సభపై ఏమన్నారో నేను పూర్తిగా చూడలేదు కానీ, నాకు తెలిసి ఆయన తప్పుగా మాట్లాడి ఉండరు  అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రా వాళ్లకు కాంట్రాక్టులు ఇవ్వమంటున్న కాంగ్రెస్ నేతలపై పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  2014 నుంచి ఇప్పటిదాకా ఏపీకి చెందిన ఎంతమంది ఇక్కడ తెలంగాణ వాళ్లు కాంట్రాక్ట్ తీసుకున్నారో లెక్కలు తీయండి? ఇలాంటివి మాట్లాడి ప్రజల మధ్య లేనిపోని ద్వేషం తీసుకురాకండి  అని హితవు పలికారు. తెలంగాణలో రేపు జనసేన తరఫున ఆంధ్రా నాయకులు వచ్చి పోటీ చేయరని, ఇక్కడి స్థానిక నాయకులే పోటీ చేస్తారని, అలాంటప్పుడు వారు సభ పెట్టుకుంటే ఆపేందుకు వీరెవరని నిలదీశారు.

 రౌడీయిజానికి భయపడం - అందుకే 11 సీట్లకు పడిపోయారు! 

గతంలో సభలను అడ్డుకున్న వారి గతి ఏమైందో అందరూ చూశారని పవన్ కల్యాణ్ పరోక్షంగా బీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభలు పెట్టనియ్యకపోతేనే కదా నాడు  11 సీట్లకు వచ్చింది. ఇక్కడ రౌడీయిజం చేస్తామంటే భయపడటానికి ఎవరూ లేరు. రౌడీయిజానికి భయపడితే మేము రాజకీయాలు చేస్తామా  అని ఘాటుగా ప్రశ్నించారు. ఏపీలో తాము పదేళ్లు క్షేత్రస్థాయిలో ఎన్నో కష్టాలు పడితేనే ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారని, రేపు తెలంగాణలో కూడా జనసేన కేడర్ ఇక్కడి ప్రజల కోసం, అభివృద్ధి కోసం గట్టిగా పనిచేస్తుందని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.

ఆ పేరు వింటేనే చిరాకు  
  
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అంశంపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఎందుకులెండి.. ఆ పేరు వింటేనే చిరాకు పుడుతుంది. మూడు రాజధానులు అన్నారు.. అది కాస్తా ఇప్పుడు మూడు జిల్లాలు  అయిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ, తమిళనాడు ప్రజల్లో ఉన్న ప్రాంతీయ అస్తిత్వ భావనను ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజలను చూస్తే ముచ్చట వేస్తుంది, అక్కడ బలమైన తెలంగాణ భావన ఉంది, తమిళులకు తమిళ భావన ఉంది. కానీ ఏపీ వాళ్లకు మాత్రం ఇంకా సబ్-రీజియన్స్ ఉన్నాయి. ఆంధ్ర అనే ఒకే ఒక్క భావన అందరిలో ఉంటే మంచిది.   అని ఏపీ ప్రజల్లో ప్రాంతీయ ఐక్యత రావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. 

 కుల దూషణల రాజకీయాలకు చరమాంకం 

గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిందో పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక చివరికి జర్నలిస్టుల్లో కూడా కులాలతో తిట్టడం, వర్గాలుగా విడిపోవడం మొదలైంది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, అసలు ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి కుల దూషణలకు దిగడం అలవాటుగా మార్చుకున్నారు  అని విమర్శించారు. సమాజంలో విషం చిమ్ముతున్న ఇలాంటి కుల, ప్రాంతీయ రాజకీయాల అన్నింటికీ చరమాంకం పలకాలని జనసేన గట్టిగా భావిస్తోందని, రెండు రాష్ట్రాల ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు.  

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP High Court: ఎంపీపై థర్డ్ డిగ్రీనా? పార్లమెంట్‌పై దాడి చేసిన వాళ్లకూ, మీకూ తేడా ఏంటి? - ఐపీఎస్ సునీల్ నాయక్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!
ఎంపీపై థర్డ్ డిగ్రీనా? పార్లమెంట్‌పై దాడి చేసిన వాళ్లకూ, మీకూ తేడా ఏంటి? - ఐపీఎస్ సునీల్ నాయక్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం!
Breaking News:RRR కస్టోడియల్ టార్చర్ కేసులో బిగ్ ట్విస్ట్- సునీల్ నాయక్‌ను లొంగిపోమన్న ఏపీ హైకోర్టు 
RRR కస్టోడియల్ టార్చర్ కేసులో బిగ్ ట్విస్ట్- సునీల్ నాయక్‌ను లొంగిపోమన్న ఏపీ హైకోర్టు 
Karumuri son Sunil arrested by ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Advertisement

వీడియోలు

Ind W vs NL W World Cup | నెదర్లాండ్స్‌పై భారత్ ఘన విజయం
Vaibhav Not-Out vs Afgan A | వైరల్ అవుతున్న వైభవ్ సూర్యవంశీ అవుట్ వివాదం
India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్
Vaibhav Sooryavanshi Fight With Sri Lanka Players | శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ గొడవ
Japan Fans Clean's Stadium FIFA 2026 | జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ డ్రా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa In Telangana 2026: తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్! జూన్ 30 నుంచే రైతు భరోసా నిధులు విడుదల! 9రోజుల్లో ఖాతాల్లో నగదు!
Government School Admissions: పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్న కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి - వ్యవస్థలో ఆణిముత్యమే
Kadiri TDP BJP controversy: బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
బీజేపీ కోసం పోరాడితే వైసీపీ కోవర్టు ముద్ర వేయడమే - టీడీపీ ఎమ్మెల్యే్పై విమర్శలు - కదిరి కూటమిలో రోడ్డున పడుతున్న గొడవలు
Elon Musk: పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
పాకిస్తాన్ ఫ్రెండ్‌తో కలిసి ఏఐ స్టార్టప్ పెట్టిన భారత యువకుడు - 5 లక్షల కోట్లకు కొనేసిన మస్క్ !
Save The Tigers 3 First Review: 'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
'సేవ్ ది టైగర్స్ 3'కి సందీప్ కిషన్ రివ్యూ... సిరీస్ గురించి హీరో ఏమన్నారంటే?
Cristiano Ronaldo Struggles : పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
పోర్చుగల్ స్టార్ రోనాల్డోకు వయసైపోయిందా.. డీఆర్ కాంగో దెబ్బకు బద్దలైన వరల్డ్ కప్ డ్రీమ్స్
Samantha: సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
సమంత కటౌట్స్... స్టార్ హీరోస్ రేంజ్‌లో - ఇదెక్కడి మాస్ మావా
Karumuri son Sunil arrested by ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం - మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్ - ఈడీ దూకుడు!
Embed widget