Brahmamudi Serial Today January 15Th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాజ్ కు చెప్పిన కావ్య – శోభనం విషయంలో కావ్యను దూరం పెట్టిన ధాన్యలక్ష్మీ
Brahmamudi Today Episode: తనకు ఒక బాయ్ ప్రెండ్ ఉన్నాడని రాజ్ తో కావ్య చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: హాస్పిటల్ లో సిస్టర్ వచ్చి మీ బిల్లు మీ అల్లుడు రాజ్ కట్టాడని మీరిక డిశ్చార్జ్ కావొచ్చని చెప్పి వెళ్లడంతో కనకం, మూర్తి హ్యాపీగా ఫీలవుతారు. ఈ గండం నుంచి గట్టెక్కించినందుకు రాజ్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంతలో అప్పు తేరుకుని బిల్లు బావ కట్టాడా? అని అడుతుగుంది. అవునని కనకం చెప్తుంది. ఒకసారి రాజ్ కి ఫోన్ చేసి మాట్లాడమని మూర్తి, కనకానికి చెప్తాడు. అలాగేనని కనకం, రాజ్‌కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఇక మీదట ఏ అవసరం వచ్చినా నన్నే అడగండి అని చెప్తాడు. రాజ్ మాటలు విన్న కావ్య కృతజ్ఞాతాభావంతో రాజ్‌ను చూస్తుంటుంది. రాజ్ బయటకు వెళ్లిపోతాడు. మరోవైపు అప్పు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది. వాళ్ల పెద్దమ్మ ఏడుస్తుంది. అప్పును తిడుతుంది. ఇంతలో కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ ఎత్తిన అప్పు వాళ్ల పెద్దమ్మ కళ్యాణ్‌ను ఫోన్ చేయ్యోద్దని చెప్తుంది.
కళ్యాణ్: ఏమైందండి?
పెద్దమ్మ: జరిగిన గొడవలు చాలవా? ఇంకా ఎందుకయ్యా దాన్ని సాధించాలనుకుంటున్నావు.
కళ్యాణ్: అంటే అప్పు ఎలా ఉందో తెలుసుకుందామని..
ఇంతలో కనకం ఫోన్ లాక్కుంటుంది.
కనకం: బాబు అప్పుకు ఇప్పుడు బాగానే ఉంది. ఇందాకే హాస్పిటల్ నుంచి వచ్చాము. భోజనం చేసి పడుకుంది
కళ్యాణ్: మరి మీ అక్కయ్యగారేంటి? అలా మాట్లాడుతున్నారు.
కనకం: మళ్లీ నువ్వక్కడ మా వల్ల ఎన్ని మాటలు పడ్డావోనని కంగారుగా అంది.
కళ్యాణ్: ఇక్కడ ఏవో అంటారని అప్పు ఎలా ఉందో కనుక్కోకుండా ఎలా ఉంటానండి. సరే ఆంటీ అప్పు లేచాకా ఒకసారి నాకు ఫోన్ చేయమనండి.
అంటూ ఫోన్ కట్ చేసి తిరిగి చూస్తే వెనకాలే అనామిక నిలబడి ఉంటుంది. దీంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. ఇంతలో చాలా కూల్‌గా అనామిక అప్పుకు ఎలా ఉందని అడుగుతుంది. బాగానే ఉందంట అని కళ్యాణ్ చెప్పగానే.. హమ్మయ్య అప్పుకు ఏం కాలేదు కాబట్టి నువ్వు హ్యాపీగా ఉంటావు. అది చాలు నాకు అంటుంది అనామిక. దీంతో ఇద్దరు కలిసి లోపలకి వెళ్లిపోతారు. మరోవైపు కావ్య ఒంటరిగా కూర్చుని రాజ్ గురించి ఆలోచిస్తుంది. ఫోన్‌లో కృష్ణుడి ఫోటో చూస్తూ మాట్లాడుతుంటే.. సరే మా ఆయన వచ్చారు మళ్లీ మాట్లాడతాను అంటూ ఫోన్ పక్కన పెట్టేస్తుంది. రాజ్ లోపలికి వస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావని అడుగుతాడు. నా ప్రెండ్‌తో మాట్లాడుతున్నానని చెప్తుంది. దీంతో లోపల జలసీగా ఫీలయిన రాజ్, కావ్య ఫోన్ లాక్కుని చూస్తాడు. అందులో కృష్ణుడి ఫోటో ఉండటంతో ఫోన్ పక్కన పడేస్తాడు. దీంతో కావ్య అది సరే కానీ కళ్యాణ్ శోభనానికి ఏర్పాట్లు చేయాలి పదండి వెళ్దాం అంటూ బయటకు వెళ్తుంది. కావ్య పూలవాడితో ఫోన్ మాట్లాడుతుండగానే ధాన్యలక్ష్మీ వస్తుంది.
ధాన్యలక్ష్మీ: శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నావా?
కావ్య: అవును చిన్నత్తయ్యా.. ఏమైనా కావాలా?
ధాన్యలక్ష్మీ: ఓ మాట కావాలి?
కావ్య: అడగండి
ధాన్యలక్ష్మీ: నా కొడుకు, కోడలు ఒకర్ని ఒకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఈ శోభనం విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటానని నాకు మాటిస్తావా? నీ చేత్తో వ్రతం మొదలు పెట్టావు. అది అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇది నా కోడలు బతుకు పండించుకునే వేళ ఇందులో కూడా నీ చెయ్యి పడిందంటే వాళ్ల కాపురం ఏమైపోతుందోనని భయంగా ఉంది.
కావ్య: ఒకప్పుడు ఏదైనా నాచేత్తో చేస్తేనే మీకు తృప్తిగా ఉండేది. మా అత్తయ్యగారితో పోట్లాడైనా సరే నా చేతుల మీదుగానే జరిపించేవారు. నా చేయి పడితే అదృష్టం అన్నారు. ఇప్పుడు ఆ అదృష్టం దురదృష్టంగా మారిందా?
అని కావ్య అడగ్గానే అప్పుడు అందరూ నాలాగే ఉంటారనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు నీ చెల్లిని నా కొడుక్కి ఇచ్చి చేయాలనుకున్నావో అప్పుడే నీ స్వార్థం నాకు అర్థం అయ్యింది. అంటూ కావ్య దగ్గర మాట తీసుకుని వెళ్లిపోతుంది. కావ్య పైకి వెళ్తుంటే.. కళ్యాణ్ ఎదురుగా వచ్చి తాను అనామికకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నట్లు తానే స్వయంగా తయారు చేయించిన రెండు గోల్డ్ నెక్లెస్‌లు చూపించి ఏది బాగుందని అడుగుతాడు. దూరం నుంచి ధాన్యలక్ష్మీ వీరినే గమనిస్తుంది. దీంతో కావ్య తనకు అంతగా సెలెక్షన్ రాదని చెప్తుంది. లేదని మీ సెలక్షన్ సూపర్‌గా ఉంటుందని కళ్యాణ్ బలవంతంగా కావ్యను అడుగుతాడు. దీంతో కావ్య ఒక నెక్లెస్ చూపించి ముభావంగా పైకి వెళ్లిపోతుంది. ధాన్యలక్ష్మీ వచ్చి ఇదేం బాగాలేదని ఆ మహాతల్లికి ఏం తెలుసు సెలెక్షన్ గురించి అంటూ రెండోది బాగుందని చెప్తుంది. అయితే అది నువ్వే ఉంచుకో అంటూ కళ్యాణ్ వెళ్లిపోతాడు. రూమ్ బయట కూర్చున్న రుద్రాణిని స్వప్న గట్టిగా పిలుస్తుంది.
రుద్రాణి: ఎంటి ఏమైంది?
స్వప్న: టైం ఎంతైంది..?
రుద్రాణి: అది అడగటానికి పిలిచావా?
స్వప్న: లేదు మిమ్మల్ని కడగడానికి పిలిచాను.
రుద్రాణి: నామీదేం బురద పడలేదు. కడగడానికి
స్వప్న: మింగడానికి మాత్రం ముందే ఉంటారు. నేను టాబ్లెట్లు మింగే టైం అయిందని తెలియదా? డాక్టర్ చెప్పిన టైంకు రెండు నిమిషాలు లేట్ అయ్యింది
అంటూ చెప్పగానే రుద్రాణి టాబ్లెట్లు, వాటర్ స్వప్నకు ఇస్తుంది. ఇంతలో స్వప్న తనకు పాయసం కావాలని అడుగుతుంది. నేను చేయనని రుద్రాణి చెప్తుంది. దీంతో స్వప్న ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు ఫోన్ చేయబోతుంటే రుద్రాణి భయంతో పాయసం చేస్తానని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.