Brahmamudi Serial Today February 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కావ్యకు ప్రపోజ్ చేసిన రాజ్ - అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి
Brahmamudi Today Episode: కేఫ్ వెళ్లిన రాజ్, కావ్యకు ప్రపోజ్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: కావ్య తన బావతో కలిసి బయటకు వెళ్లడంతో రాజ్, శ్వేతతో కలిసి వాళ్లను ఫాలో అవుతాడు. వాళ్లు కేఫ్‌కు వెళ్లగానే రాజ్ కూడా కేఫ్‌కు దొంగచాటుగా వెళ్లి వాళ్లకు కనిపించకుండా ఉంటారు. ఇంతలో కావ్య ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు బావ అని అడగ్గానే సర్‌ఫ్రైజ్ అంటాడు వాళ్ల బావ దీంతో ఇరిటేటింగ్ గా ఫీలయిన రాజ్ చూశావా ఆ బావగాడు నా నుంచి శ్వేతను దూరం చేయడానికే వచ్చినట్లున్నాడు. అంటాడు.
శ్వేత: ఇప్పుడు కావ్య అతని ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేస్తే నువ్వేం చేస్తావు.
రాజ్: నేనింకా డివోర్స్ ఇవ్వలేదు.
శ్వేత: కానీ జీవితంలోంచి తప్పుకోమని చెప్పేశావు కదా
రాజ్: ఆమె ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మేము లీగల్‌గా విడిపోవాలి కదా
శ్వేత: ఏమో ఇప్పుడు ఓకే చెప్పి విడిపోయాక పెళ్లి చేసుకుంటుందేమో
రాజ్: ఏయ్ నేను ఒప్పుకోను నువ్వు నన్ను కన్ఫీజ్ చేయకు శ్వేత. వాడు నా భార్యకు లవ్ ప్రపోజ్ చేయడం ఏంటి నాన్సెస్ కాకపోతేనూ అలా జరగనివ్వను.
అంటూ రాజ్ ఇరిటేట్‌గా ఫీలవుతుంటే ఇంతలో ఇందిరాదేవి ఆమె భర్త వస్తారు. వాళ్లను చూసిన రాజ్ భయంగా వెళ్లి కావ్య పక్కన నిలబడతాడు. రాజ్, కావ్యను చూసిన ఇద్దరు ముసలివాళ్లు ఆశ్చర్యపోతారు. కావ్యకు లవ్ ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి వచ్చావా? అంటూ అడుగుతారు. అవునని రాజ్ చెప్పగానే మీడియా వాళ్లు కూడా వస్తారు. తర్వాత రాజ్, కావ్య ఒకరికొకరు విషెష్ చెప్పుకుని కేక్ కట్ చేస్తారు.
ఇందిరాదేవి: ఇది ప్రేమంటే.. చూపించుకునే ప్రేమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే బేధమే ఉండకూడదు. ఒకసారి తాళి కట్టాక ఆ పెళ్లికి పంచభూతాలు సాక్ష్యాలు అవుతాయి. మన ముక్కోటి దేవతలు సపరివారమవుతారు. మనుషులు కోరుకుంటే పెళ్లి జరగదు. ఎవరికి ఎవరం అనేది మనం పుట్టకముందే నిర్ణయం అయిపోతుంది.
అంటూ బామ్మ మంచి మాటలు చెప్పి ఇక మీరు వెళితే మా ప్రేమను మేము పంచుకుంటాం అనగానే రాజ్, కావ్యను ఇక్కడే ఉంచితే బాగుండదు అనుకుని కావ్యను తీసుకుని వెళ్లిపోతాడు. ఇందిరాదేవి అందరూ హ్యాపీగా ఫీలవుతారు. మరోవైపు కారులో వెళ్తున్న రాజ్, కావ్య మళ్లీ గొడవ పడతారు.
రాజ్: అసలు ఆ బావగాడు కేక్ బొకే ఎందుకు తెప్పించాడు. నీకు ప్రపోజ్ చేయడానికా? ఏయ్ ఎంటి జవాబు లేదు. జవాబు చెప్పకుండా అటొకరు ఇటొకరు పిండేసినట్లు అలా మెలికలు తిరిగిపోతున్నావేంటే?
కావ్య: అంటే మీరన్నాక గుర్తొచ్చింది. మా బావ నాకోసం కేక్ తెప్పించాడా? అంటే నాకు లవ్ ప్రపోజ్ చేసేవాడా? ఎంత పని చేశారండి. మీరు ఎలాగూ ప్రేమించరు. ప్రేమించే వాళ్లను చెడగొడతారు.
అంటూ ఇద్దరూ గొడవ పడతారు. మరోవైపు రుద్రాణి అనామిక దగ్గరకు వెళ్లి
రుద్రాణి: ఎంటి అనామిక నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?
అనామిక: ఫ్రెండ్ జోక్ పంపిస్తే నవ్వుతున్నాను ఆంటీ
రుద్రాణి: జోక్‌తో నవ్వొస్తే పర్వాలేదు కానీ మనల్ని చూసి ఎవరైనా నవ్వుతేనే ప్రాబ్లమ్
అనామిక: మనల్ని చూసి నవ్వేదెవరు ఆంటీ?
రుద్రాణి: ఇప్పుడెవ్వరూ లేరు కానీ నువ్వేం పట్టనట్టు కూర్చుని ఉంటే ఈ ఇంట్లో అందరూ చూసి నవ్వుతారు.
అంటూ రుద్రాణి కట్టుకథలు చెప్తుంది. కళ్యాణ్‌ను ఆఫీసుకు పంపించడమే కాదు. అక్కడ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి అని చెప్తుంది రుద్రాణి. నువ్వు వెంటనే ఆఫీసుకు వెళ్లి నీ మొగుడు ఏం చేస్తున్నాడో వెళ్లి చూడు. అంటూ అనామికను రెచ్చగొట్టగానే అనామిక లంచ్ తీసుకుని ఆఫీసుకు వెళ్లడానికి డిసైడ్ అవుతుంది. మరోవైపు ఆఫీసుకు వెళ్లిన రాజ్, కావ్య గొడవపడతారు. కావ్య వేసిన డిజైన్స్ బాగాలేవని వెటకారంగా తిడతాడు. మా బావ వచ్చినప్పటి నుంచి మీకు ఎక్కడో మండిపోతుంది అందుకే నేను ఎక్కడ దొరుకుతానోనని ఎదురుచూస్తున్నారు. అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: నాని బర్త్ డే స్పెషల్, ఒకే రోజు మూడు క్రేజీ అప్ డేట్స్!