Brahmamudi Serial Today February 19th: ‘బ్రహ్మముడి’ సీరియల్ : అనామికకు అప్పు వార్నింగ్ - బావ కోసం వెళ్లిన కావ్య
Brahmamudi Today Episode: ఇంట్లో పెత్తనం అనామికకు ఇవ్వాలని ధాన్యలక్మీ అడగడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.
Brahmamudi Serial Today Episode: అనామిక కోపంగా నేను ఇప్పుడు వెళ్లి ఆ కావ్యను చేయి చాచి డబ్బుల ఆడగాలా? ఆమె అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. నేను అలా కాదు కదా? నేను రిచ్. అలాగే మీ అబ్బాయితో బయటకు వెళ్లాలన్నా చివరకు ఆమెగారి పర్మిషన్ తీసుకోవాలేమో అని కిచెన్‌లో ఉన్న ధాన్యలక్ష్మీని అడుగుతుంది. అలాగే కావ్య ఎలాగూ ఆఫీసుకు వెళ్తుంది కాబట్టి ఇంటి పెత్తనం మీరైనా తీసుకోండి లేదంటే నాకైనా ఇప్పించండి అంటూ రెచ్చగొడుతుంది. దీంతో ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది. ధాన్యలక్ష్మీని గమనించిన అనామిక మరింత రెచ్చగొట్టాలని అత్తయ్యా మీరు ఇలాగే మౌనంగా ఉంటే మీ అబ్బాయి జీవితాంతం ఇలా ఒకరి కిందే బతకాల్సి వస్తుంది. అనగానే ఎప్పటికీ అలా జరగనివ్వను పద అంటూ అనామికను తీసుకుని హాల్లోకి వస్తుంది. అనామికను లాక్కుని వచ్చిన ధాన్యలక్ష్మీని చూసి అందరూ షాక్ అవుతారు.
అపర్ణ: ఏంటి?
ధాన్యలక్ష్మీ: నాకు నా కోడలుకు ఏం పనులు చెప్తావో చెప్పు.. నేను ఇల్లు తుడవాలా? తను బట్టలు ఉతకాలా? అంట్లు తోమాలా? సెక్యూరిటీ గార్డును కూడా తీసేయండి. తోటమాలి కూడా అక్కర్లేదు. మా ఆయన నా కొడుకు ఉన్నారుగా వాళ్లు ఆ పనులు చేస్తారు.
అపర్ణ: నీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పు నిన్ను నీ కోడలిని ఇక్కడ ఎవరైనా పనిమనుషులుగా చూశారా?
ధాన్యలక్ష్మీ: నీ కోడలు కావ్య మాత్రమేనా ఇంటికోడలు నా కోడలు కోడలు కాదా?
అని అడగ్గానే ప్రకాష్ ధాన్యలక్ష్మీని తిడతాడు. సుభాష్ కూడా మీకు ఏమైనా తక్కువ చేశామా? అని అడుగుతాడు. దీంతో కళ్యాణ్, అనామిక బయటకు వెళ్లాలన్నా కావ్యను అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పడంతో నాకు కార్డ్స్ తో పని లేదని లాకర్‌లో పెట్టమన్నాను అని కళ్యాణ్ చెప్పడంతో అసలు నీ బాధేంటి ధాన్యలక్ష్మీ అని అపర్ణ అడగడంతో కావ్య ఆఫీసుకు వెళ్తుంది కాబట్టి అనామికకు పెత్తనం ఇవ్వండి అని ధాన్యలక్ష్మీ అడగడంతో స్వప్న ధాన్యలక్ష్మీ మీదకు ఫైర్ అవుతుంది. దీంతో అందరూ ధాన్యలక్ష్మీని తిడతారు. తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. మరోవైపు ఆఫీసుకు వెళ్లిన రాజ్ టెన్షన్ పడుతూ
రాజ్: ఈ కళావతి తన బావను తీసుకొస్తానని వెళ్లి రెండు గంటలైంది. ఇంతవరకు రాలేదు. ఫోన్ చేద్దామా? వద్దులే అలుసైపోతాము.. అసలే దానికి గోరోచనం ఎక్కువ.
శృతి, రాజ్ చాంబర్‌లోకి వస్తుంది.
రాజ్: మీ మేడం ఎంటి ఇంకా ఆఫీసుకు రాలేదు?
శృతి: తెలియదు సార్
రాజ్: నువ్వు ఇదే కంపెనీలో పని చేస్తూ ఇక్కడే జీతం తీసుకుంటున్నావు కదా? మరి ఇక్కడ ఒక స్టాఫ్ రాకపోతే ఆమాత్రం తెలుసుకోలేవా?
శృతి: మేడం మీరు ఒకే ఇంట్లో ఉంటున్నా? ఎందుకు రాలేదో మీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది సార్
రాజ్ చాంబర్ లోకి శ్వేత వస్తుంది. శృతి వెళ్లిపోతుంది
శ్వేత: ఎంటి టెన్షన్‌గా ఉన్నావు. ఇవాళ ఆఫీసులో పార్టీ ఇస్తా అన్నావు.
అని అడగ్గానే కావ్య తన బావ గురించి చెప్పిన విషయాలు చెప్పి తను ఎయిర్‌ఫోర్ట్ కు వెళ్లి ఇంతవరకు రాలేదని ఫీలవుతాడు రాజ్. శృతి రాజ్ చాంబర్‌లోకి వచ్చి సంతకాలు చేయించుకుంటుంటే వాళ్ల బావ ఫోన్ చేస్తాడు. బావతో శృతి ఫోన్ మాట్లాడుతుంటే రాజ్ ఇరిటేట్ అవుతాడు. అంతా గమనిస్తున్న శ్వేత రాజ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అడుగుతుంది. మరోవైపు కళ్యాణ్, అనామిక షాపింగ్‌కు వెళ్లి వెళ్తుంటే మధ్యలో అప్పు ఫ్రెండ్ బైక్ మీద వెళ్తూ కళ్యాణ్ కారుకు ఎదురుపడుతుంది. దీంతో కారు దిగిన అనామిక వెటకారంగా అప్పును మాట్లాడుతుంది. నువ్వెన్ని ప్లాన్స్ వేసినా కళ్యాణ్ నాసొంతం అయ్యాడు అని రెచ్చగొట్టగానే నేను ఇప్పుడు తలుచుకున్నా కళ్యాణ్‌ను పెళ్లి చేసుకోగలను అంటూ అప్పు అనగానే అనామిక షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.