Brahmamudi Serial Today August 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్: నిజం చెప్పమని కావ్యను నిలదీసిన రాజ్ - అయోమయంలో పడిపోయిన కావ్య
Brahmamudi serial today episode August 26th: దుగ్గిరాల ఇంటికి వచ్చిన రాజ్ కావ్య కడుపులో బిడ్డకు తండ్రెవరు అని అడగడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: రాజ్ మందుకు బానిసై పోతున్నాడని ఆ ఇంట్లోకి తీసుకురావాలని అపర్ణ బాధపడుతుంది. దీంతో ఆ ఇంట్లోంచి ఎలా తీసుకొస్తావని రాజ్ ఏమైనా చిన్న పిల్లాడా అంటూ రుద్రాణి అడుగుతుంది. దీతో ప్రకాష్ కోపంగా రుద్రాణిని తిడతాడు.
ప్రకాష్: అలాగని రాజ్‌ను అలాగే వదిలేయమంటావా..?
రుద్రాణి: అలాగని పట్టుకుని ఇంటికి తీసుకువస్తామా..? ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా రాజ్ వస్తాడా..? అసలు రాడు. రాజ్ ఇప్పుడు ఈ ఇంట్లో అందరూ తనను మోసం చేశారన్న కోపంలో ఉన్నారు. ఆ కోపం పోవాలంటే ఒక్కటే దారి ఉంది. కావ్య ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి రాజ్ అని చెప్పాలి. అలా చెప్పాలంటే రాజ్ మరచిపోయిన గతం గురించి చెప్పాలి. అలా చేప్పే సిచువేషన్ లో ఉన్నామా..? సరే కొంచెం ధైర్యం చేసి చెబుదామంటే.. చెప్పిన తర్వాత పరిస్థిలులు ఎలా ఉంటాయో ఏమో కనీసం ఇప్పుడు కావ్యను అపార్థం చేసుకుని దూరం ఉంటున్నాడు. అదే నిజం చెప్పాక మన అదృష్టం బాగోక అందరికీ దూరం అయితే
ఇందిరాదేవి: రుద్రాణి
అపర్ణ: నేను ఎలాగైనా వాణ్ని దారిలోకి తెచ్చుకుంటాను. అవసరం అయితే కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రివి నువ్వేరా అని చెప్తాను
కావ్య: వద్దు అత్తయ్యా ఆయన మారకపోయినా పర్వాలేదు కానీ మీరేం నిజం చెప్పకండి. మా ఇద్దరిని ఒక్కటి చేసిన కాలమే మళ్లీ మమ్మల్ని కలుపుతుంది. అప్పటి వరకు ఎలా జరగాలని రాసి పెట్టి ఉంటే అలా జరగుతుంది. మీరు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి
అంటూ కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు యామిని రూంలో కావ్య మాటలు గుర్తు చేసుకుంటూ కోపంగా ఉంటుంది. నాకే వార్నింగ్ ఇస్తావా..? బావను నీకు శాశ్వతంగా దూరం చేస్తాను అని మనసులో అనుకుని రాజ్ దగ్గరకు వెళ్తుంది.
యామిని: ఏంటి బావ ఇది నువ్వేదో బాధను మర్చిపోతావనుకుంటే.. నువ్వేంటి ఇలా మందుకు బానిస అయిపోతున్నావు
రాజ్: ఎంత తాగినా బాటిల్స్ అయిపోతున్నాయి కానీ బాధ మాత్రం పోవడం లేదు యామిని
యామిని: కానీ నిన్ను ఇలా చూస్తుంటే నాకు బాధగా ఉంది బావ. ఎప్పుడో చిన్నప్పుడు బుక్స్ లో చదువుకున్నాను. పార్వతి వల్ల దేవదాసు పిచ్చోడు అయిపోయాడని.. ప్రేమిస్తే ఇంత పిచ్చిగా ఉంటారా అనుకున్నాను.. ఇప్పుడు నీ ప్రేమని చూశాకే నాకు అర్తం అయింది. అందుకే నీకొక సలహా చెబుదామని వచ్చాను బావ
రాజ్: ఏంటి యామిని అది
యామిని: నాకెందుకో నిన్ను కళావతి కూడా ప్రేమించింది అనిపిస్తుంది బావ
రాజ్: నిజంగానే తను నన్ను ప్రేమించి ఉంటే ఇలా ఎందుకు మోసం చేస్తుంది యామిని. నన్ను ఎందుకు ఇంతలా బాధపెడుతుంది. ప్రేమించిన వాళ్లు బాధపడతారు కానీ బాధపెట్టరు యామిని. కళావతి గారి మనసులో నేను లేను
యామిని: లేవని నువ్వెలా అనుకుంటున్నావు బావ. తను నిన్ను ప్రేమించి ఉండకపోతే ఎందుకు నువ్వు తన చుట్టు తిరిగినా ఊరికే ఉన్నది.
రాజ్: ఒక ఫ్రెండ్‌గా అదంతా చేశానని తనే చెప్పింది కదా
యామిని: అదంతా అబద్దం బావ నేను ఒక ఆడపిల్లను కాబట్టి చెప్తున్నాను. కళావతి కచ్చితంగా నిన్ను ప్రేమించింది. ఇన్ని రోజులు తనకు కడుపు అని తెలియదు అందుకే నీతో అలా తిరిగింది. సడెన్‌గా ప్రెగ్నెన్సీ రాగానే ఇలా మారిపోయింది. అందుకే ఇప్పుడే వెళ్లు బావ నీ కడుపులో ఉన్న బిడ్డకు కారణం ఎవరో చెబితే నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ అడుగు
అని రాజ్‌ను కావ్య మీదకు రెచ్చగొడుతుంది. రాజ్ అలాగేనని మందు తాగుతాడు. రాత్రికి కావ్య వాళ్ల ఇంటికి వెళ్లి గొడవ చేస్తాడు. కావ్యన పిచ్చిగా తిడతాడు. నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పు అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి





















