అన్వేషించండి

Bramhamudi Today December 7th Episode: అనామిక, కల్యాణ్‌ పెళ్లి జరగకుండా పుల్లలు పెడుతోన్న కనకం!

Bramhamudi Today Episode: అనామికతో కల్యాణ్ పెళ్లి జరగకుండా ఆపేందుకు కనకం పంతులుతో ఇంట్లో వాళ్లకి అబద్ధం చెప్పిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Bramhamudi Serial Today Episode

అనామిక, కల్యాణ్‌ల పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతులు.. కనకం బెదిరింపుతో అనామికకు దోషం ఉంది అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అయి ఏం దోషం అని అడిగితే మాంగల్య దోషం ఉంది అని చెప్తాడు. దీంతో అందరూ నోరెళ్లబెడతారు. కనకం నవ్వుకుంటుంది. 

చిట్టీ: ఇద్దరూ ప్రేమించి చేసుకుందామనుకున్న పెళ్లి ఆ దోషం వల్ల ఏం జరుగుతుంది పంతులు గారు
పంతులు: మనసులో.. ఏం జరుగుతుందో అని ఆత్మహత్య లేఖలో రాయలేదే. ఈ విషయం ఆమె ముందుగా చెప్పలేదే
కనకం: పంతులు గారు అందరూ కంగారు పడుతున్నారు. మాంగల్య దోషం అంటే చాలా పెద్ద దోషం అని విన్నాను. నిజమేనా
పంతులు: హా.. హా.. నిజమే తల్లి ఇలాంటి దోషం ఉన్న ఆడవాళ్లతో పెళ్లి అయితే ఇంటి పెద్దకు ఆరోగ్య సమస్యలు.. చిక్కులు, చికాకులు రావొచ్చు మరి. ఆ జంట కాపురం కూడా సజావుగా జరగదు. 
ధాన్యలక్ష్మి: మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది పంతులుగారు. ఈ పెళ్లి అనుకున్నప్పుడు నుంచి మా మామయ్య గారి ఆరోగ్యం బాగోలేదు. పెళ్లి కూడా వాయిదా పడుతూ వస్తుంది. 
కనకం: అమ్మయ్య ఎవరికి అనుమానం రాకుండా చెప్పించేశా
సీతారామయ్య: అమ్మా ధాన్యలక్ష్మి దానికి దీనికి సంబంధం లేదు. ఒక ఆడపిల్ల జాతకాన్ని పట్టుకొని ఇలా నిందలు వేయడం సరికాదు. చూడు వాళ్లు ఎలా బాధపడుతున్నారో. నా ఆరోగ్యం ముందు నుంచే బాలేదు. కాబట్టి ఈ పెళ్లికి నా ఆరోగ్యానికి ఎవరూ లింక్ పెట్టొద్దు. పంతులు గారు ఏ జాతకం లోనైనా సమస్య వస్తే దానికి పరిహారం ఉంటుంది కదా.. అది చెప్పండి. ఏంటి ఆలోచిస్తున్నారు. నా మనవడు ఇష్టపడి చేసుకోవాలి అనుకున్న సంబంధం. మీరు పరిష్కారం చూపించలేను అనుకుంటే వేరే పంతుల్ని పిలిపిస్తాం. 
పంతులు: మాంగల్య దోషం ఉన్నప్పుడు అమ్మాయి, అబ్బాయి హోమం జరిపిస్తే కొంతైనా దోషం పోతుంది. 
కల్యాణ్: ఇంకేమైనా చేయాల్సింది ఉందా పంతులుగారు చెప్పండి. ఎంత కష్టమైనా జరిపిస్తాం. నువ్వేమీ బాధ పడకు అనామిక. అంతా మంచే జరుగుతుంది. మన ప్రేమ నిజమైతే మన పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. 
సీతారామయ్య: మీరు ఎవరూ ఏం కంగారు పడకండి.. వాళ్లిద్దరినీ ఆ సరస్వతి దేవే కలిపింది. ఆ బ్రహ్మ కచ్చితంగా బ్రహ్మముడి వేస్తాడు. 

ఇక పంతులు ఇంటి నుంచి వెళ్లిపోతుంటే కనకం అయిన దగ్గరకు వచ్చి నేను చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి అని సీరియస్ అవుతుంది. ఇక పంతులు నిమ్మ చెట్టు నాటమని కల్యాణ్ ఫ్యామిలీకి చెప్పారు అయితే ఆ మొక్క బతకకుండా చేస్తే ఈ పెళ్లి ఆపేస్తా అని పంతులు కనకానకి చెప్తారు. ఇక అప్పుడే అప్పు అక్కడికి వస్తుంది. అప్పుతో కనకం ఈ పెళ్లి ఆగిపోతుందని.. వాళ్లిద్దరూ కలవరని చెప్తుంది. దానికి అప్పు అడ్డుకుంటుంది. ప్రేమించిన వాళ్లు విడిపోకూడదు అని అంటుంది. 

మరోవైపు కావ్య తన గదిలో పంచాంగం తిరగేస్తుంది. అది చూసి రాజ్ ఏం చేస్తున్నావ్ అని అడిగితే మన ఇద్దరి జాతకాలు పడుతున్నాయా లేదా అని చూస్తున్నా అని అంటుంది. ఇక ఇద్దరూ గిల్లీగజ్జాలాడుతారు. ఇక కావ్యతో వాదించలేక రాజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. 
    
కనకం: (గార్డెన్‌లో ధాన్యలక్ష్మి పంతులు మాటలు తలచుకొని బాధపడుతుంటే) పంతులు గారితో చెప్పించిన మాటలకు తెగ భయపడినట్లు ఉన్నారు. దాన్ని మనం కొంచెం పెంచితేనే ఇంట్లో మనం అనుకున్నట్లు పెళ్లి ఆపడానికి ఆలోచిస్తారు. డోస్ పెంచుదాం.. అంటు ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్తుంది. ఏంటండి అందరూ లోపల ఉంటే మీరు ఇక్కడ ఉన్నారు. మీ కంగారు చూస్తుంటే పంతులు గారు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నారు కదా
ధాన్యలక్ష్మి: అవును కనకం ఆయన మాంగల్య దోషం గురించి చెప్పినప్పటి నుంచి కంగారుగా ఉంది. 
కనకం: అవును కొడుకు జీవితం కదా ఆమాత్రం కంగారు ఉంటుంది మరి
ధాన్యలక్ష్మి: కనకం నిజంగానే ఇవన్నీ జరుగుతాయి అంటావా
కనకం: జరుగుతాయి అంటే జరుగుతాయనే చెప్తాను. ఎందుకు అంటే ఇలాంటిదే మా కాలనీలో జరిగింది. అమ్మాయి బాగుంది అని దోషం ఉన్నా సరే పెళ్లి చేసుకున్నారు అంతే.. నెలకే పెళ్లి కొడుకు తండ్రి చనిపోయాడు. కుటుంబానికి పెద్ద దిక్కు పోతే ఆ ఫ్యామిలీ ఎలా ఉంటుందో చెప్పండి. ఆస్తులు పోయాయి. బంధువులు దూరం అయ్యారు. కష్టాలు ఎక్కువ అయ్యాయి. దాంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి.
ధాన్యలక్ష్మి: దాంతో ఏమైంది
కనకం: ఏమవుతుంది. అమ్మాయికి కోరికలు ఎక్కువ. అబ్బాయికి ఇన్‌కమ్ తక్కువ దాంతో వాళ్లిద్దరూ రోజూ గొడవ పడ్డారు. పెద్దవాళ్లు నచ్చచెప్పాలి అని చూశారు. కానీ చివరకు విడాకులు తీసుకొని విడిపోయారు. అన్ని సార్లు అలాగే జరుగుతుంది అని కాదు. కానీ మీరు అడిగారు అని చెప్పాను. మరోలా అనుకోకండి అని ధాన్యలక్ష్మిని ఆలోచనలో పడేసి కనకం అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక రాత్రి అందరూ భోజనాలు చేస్తుంటారు. అప్పుడు ధాన్యలక్ష్మి ఆలోచిస్తూ ఉంటే ఏమైందని అపర్ణ అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget