Brahmamudi September 20th: కృష్ణమూర్తి మీద రౌడీల అటాక్ - కావ్యని కోలుకోలేని దెబ్బ కొట్టిన రుద్రాణి
మూడు నెలల పాటు కావ్యతో సంతోషంగా ఉన్నట్టు రాజ్ నటించాలని నిర్ణయించుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
Brahmamudi September 20th: కుటుంబం నుంచి వేరు కుంపటి పెట్టిన అత్త రోగం కుదిరేలా చేసింది కావ్య. అపర్ణ ఎప్పటిలాగే అందరితో మామూలుగా ఉంటూ కొడుకుని కూడా దగ్గరకి తీసుకోవడంతో ఆనందపడతాడు. తల్లి కోపం తగ్గడానికి కారణం కావ్య అని తెలుసుకుని తనని ఎత్తుకుని గిరాగిరా తిప్పేస్తాడు. ఇక తనని అవమానించినందుకుగాను రుద్రాణి కావ్య మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
కావ్య ఇంట్లో పని పూర్తి చేసుకున్న తర్వాత సీతారామయ్య దగ్గరకి వచ్చి ఆశీర్వదించమని అడుగుతుంది. ఏంటి ఈరోజు చాలా ఎగ్జైట్ గా ఉన్నావని ధాన్యలక్ష్మి అడుగుతుంది. కాంట్రాక్ట్ పూర్తయితే మా వాళ్ళ అప్పులు తీరిపోయి ఇల్లు సొంతం అవుతుందని కావ్య సంతోషంగా చెప్తుంది. వెంటనే రుద్రాణి కొడుకు రాహుల్ కి ఫోన్ చేసి కావ్య కాంట్రాక్ట్ పూర్తి చేసి అప్పులు తీర్చాలని అనుకుంటుంది. అది జరగకూడదని అంటుంది. రాత్రికి రాత్రి విగ్రహాలు అన్నీ మాయమైపోతాయని రాహుల్ తల్లికి మాట ఇస్తాడు. కృష్ణమూర్తి విగ్రహాల దగ్గర ఉంటే కొంతమంది రౌడీలు వచ్చి ఆయన మీద దాడి చేసి విగ్రహాలు అన్నీ దొంగలించేస్తారు. మరి ఈ సమస్య నుంచి కృష్ణమూర్తి కుటుంబం ఎలా బయట పడుతుంది. దీని వెనుక రాహుల్ ఉన్నాడని కావ్యకి తెలుస్తుందా? రాజ్ కావ్యకి అండగా నిలుస్తాడా? లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.
ALso Read: కృష్ణ-మురారి దొంగ పోలీస్ ఆట, తింగరిపిల్ల అల్లరి చూసి రగిలిపోతున్న ముకుంద!
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కుటుంబం నుంచి వేరు కుంపటి పెట్టి తనకి రహదారి ఏర్పాటు చేశారని కావ్య తన తెలివితో అత్త మనసు మారుస్తుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే వాళ్ళందరూ తనకే దగ్గర అవుతారని కావ్య ధీమాగా చెప్పేసరికి అపర్ణ తన నిర్ణయాన్ని మార్చుకుంటుంది. తెల్లారిన తర్వాత అపర్ణ కావ్యని పిలిచి టిఫిన్ ఏం చేయాలో ఆర్డర్ వేస్తుంది. తను మామూలుగా ఉండటం చూసి రుద్రాణి తట్టుకోలేక అడ్డుపుల్ల వేయాలని చూస్తుంది. నిన్ను అంతగా అవమానించిన కావ్యని క్షమించేశావ్ ఏంటని ఎక్కించేందుకు చూస్తుంది. కానీ అపర్ణ మాత్రం అవేమీ పట్టించుకోదు.
Also Read: ఏంజెల్ ఇంట్లోంచి వెళ్లిపోయిన రిషి పయనం ఎటు, వసుకి పెద్ద షాకే ఇది!
రాజ్ జాగింగ్ చేసి ఇంట్లోకి వస్తూ గుమ్మం దగ్గర ఉన్న తల్లిని పలకరించబోయి ఆగిపోతాడు. అపర్ణ కొడుకుని పలకరించి ప్రేమగా మాట్లాడుతుంది. దీంతో రాజ్ సంతోషంగా ఇంట్లోకి వచ్చి తన తల్లి తనతో మాట్లాడిందని అందరికీ చెప్పుకుంటాడు. దానికి కారణం కావ్య అని ధాన్యలక్ష్మి చెప్తుంది. తల్లీకొడుకులని కలపడం కోసం కావ్య తనని తాను విలన్ గా చేసుకుందని ధాన్యలక్ష్మి రాజ్ కి చెప్పేస్తుంది. నీ సంతోషాన్ని పంచుకోవాల్సింది మాతో కాదు నీ భార్యతో ఆ అర్హత తనకే ఉందని అనేసరికి రాజ్ గదిలోకి వెళ్ళి కావ్యని ఎత్తుకుని గాల్లో తిప్పేస్తాడు. అమ్మ నాతో మాట్లాడిందోచ్ అంటూ సంతోషంగా చెప్తాడు. శ్రీవారు మీతోనే కాదు నాతో కూడా మాట్లాడింది. అయినా మీ అమ్మ శిక్ష వేసే టైప్ కానీ క్షమించే టైప్ కాదని అంటుంది. మా అమ్మ దేవత అనుమానిస్తే కళ్ళు పోతాయని తిడతాడు. అటు అపర్ణ రుద్రాణితో తన ప్లాన్ చెప్తుంది. ఇంట్లో పని మనిషిని మాన్పించేసి కావ్యని పని దాన్ని చేశానని అదే తనకి విధించిన శిక్ష అని చెప్పేసరికి రుద్రాణి బిత్తరపోతుంది.