Brahmamudi September 16th: రాజ్ ప్రవర్తనకి తల్లడిల్లిన తల్లి హృదయం- స్వప్న ఏమైంది - ఆందోళనలో కనకం
సీతారామయ్య ఆరోగ్యం కోసం కావ్యతో రాజ్ ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
Brahmamudi September 16th: కావ్యని వెనకేసుకొస్తూ దుగ్గిరాల కుటుంబం అంతా అపర్ణని తిడతారు. దీంతో అపర్ణ తనకి తాను శిక్ష వేసుకుంటుంది.
అపర్ణ: ఈ ఇంట్లోనే ఉంటాను గడప దాటను. ఒక జడ పదార్థంగా బతుకుతాను. మానవత్వానికి పెద్ద పీట వేసే దుగ్గిరాల వంశం వాళ్ళు ఈరోజు నుంచి నన్ను వెలివేయండి
రాజ్: ఎందుకు మమ్మీ అంతగా అపార్థం చేసుకుంటున్నావ్
అపర్ణ: నువ్వు మాట్లాడకు, ముఖ్యంగా నువ్వు నాతో మాట్లాడకు. నీ భార్యని వెనకేసుకొచ్చి ఈ తల్లిని విమర్శించిన క్షణమే మన తల్లీకొడుకుల అనుబంధం అభాసుపాలు అయ్యింది. ఇన్నాళ్ళూ ఈ ఇంటి పెద్ద కోడలిని అని విర్రవీగినందుకు నా కళ్ళు తెరుచుకున్నాయ్. నీ భార్యని సింహాసనం మీద కూర్చొబెట్టు. మీ అమ్మ ఒక మూలన పడి ఉంటుంది
Also Read: తారాస్థాయికి చేరిన సవతి పోరు - తులసిని హనీకి దూరంగా ఉండమన్న నందు
కనకం స్వప్న గురించి ఆలోచిస్తూ తనకి పదే పదే ఫోన్ ట్రై చేస్తుంది కానీ కలవదు. కూతురికి ఏమైందని టెన్షన్ గా ఉంటే గమనించిన కృష్ణమూర్తి ధైర్యం చెప్పేందుకు చూస్తాడు. రుద్రాణి జరిగిన దానికి మరింత ఆజ్యం పోయాలని అపర్ణ దగ్గరకి వెళ్ళి రెచ్చగొట్టడానికి చూస్తుంది.
రుద్రాణి: నేను చెప్తున్నా కావ్య ఇలాంటి పని చేస్తుందని నువ్వు పట్టించుకోలేదు. ఈ ఇంట్లో నీ గురించి ఆలోచించేది నేనే అని
అపర్ణ: నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ముందు
రుద్రాణి: రాజ్ ఏంటి కావ్యకి అలా సపోర్ట్ చేస్తున్నాడు. మా అమ్మని ఎదిరించి మాట్లాడతావా అని ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు అనుకున్నా కానీ తనని వెనకేసుకొచ్చాడు. కావ్య రాజ్ ని గుప్పిట్లో పెట్టుకుంటుందని అసలు అనుకోలేదు. పని మనిషి విషయంలోనే నీకు విలువ లేకుండా చేసిందంటే ఇంకేం చేస్తుందో. నిన్ను కోడలు అనే సింహాసనం నుంచి నెట్టేసి తను వెళ్ళి కూర్చుంటుంది. నువ్వు ఎప్పుడు ఆకాశం అంత ఎత్తులో ఉండాలి అది తప్ప నాకు ఇంకేం వద్దు
కావ్య జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కృష్ణమూర్తి ఫోన్ చేసి ఇంకా రాలేదు ఏంటని అడుగుతాడు. కాసేపటిలో బయల్దేరతానని చెప్తుంది. స్వప్న గురించి అడిగితే తను ఫోన్ చేయలేదని అంటుంది. తల్లి పడిన బాధ గురించి రాజ్ ఆలోచిస్తూ అపర్ణ దగ్గరకి వెళ్ళి పలకరిస్తాడు. మాట్లాడేందుకు ట్రై చేస్తే అసలు వినిపించుకోదు. అంతటితో ఆపకపోతే అందరూ నిన్నే తప్పు పడతారని చెప్పేందుకు చూస్తాడు.
అపర్ణ; అంత తప్పు నేనేం చేశాను. నువ్వు నీ భార్యతో కలిసి పోతే నేను ఎందుకు వద్దని అంటాను. ఈ అమ్మ నీకు పరాయిది అయిపోయింది
రాజ్: నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్
అపర్ణ: నువ్వు నీ భార్య మంచితనాన్ని అర్థం చేసుకుంటున్నావ్ కదా హాయిగా కాపురం చేసుకో
రాజ్: నాకు నువ్వు తప్ప ఎవరూ ముఖ్యం కాదు. ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు
అపర్ణ: నువ్వు తప్ప ఎవరూ ముఖ్యం కాదని నాకు కాదు నీ భార్యకి చెప్పు. నీ మాటలు ఇక్కడ ఎవరూ నమ్మరు. నీమీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నీ పెళ్లి నీ ఇష్ట ప్రకారం చేయాలని అనుకున్నా. కానీ నువ్వు దగా పడ్డావని ఆ కుటుంబాన్ని దూరంగా ఉంచాను కానీ నువ్వు వాళ్ళని నెత్తిన పెట్టుకున్నావ్. ఈరోజు నీ భార్య కోసం నీ కన్నతల్లిని ఎదిరించావ్. నన్ను ఏకాకిని చేశారు ఎలా తట్టుకునేది. ఇన్నాళ్లలో ఎవరూ నా ప్రవర్తన తప్పు పట్టలేదు కానీ మీ భార్యాభర్తల వల్ల అది జరిగింది ఇంకేంటి నువ్వు చెప్పేది వెళ్లిపో అంటుంది... దీనికి ఇంత ఎమోషనల్ అయిపోయావ్ తాతయ్య విషయం చెప్తే తట్టుకోలేవని రాజ్ అనుకుంటాడు. ఈ ప్రపంచంలో నాకు నీ తర్వాతే ఎవరైనా అని రాజ్ చెప్తాడు.
Also Read: జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ముకుందని హెచ్చరించిన అలేఖ్య- మురారీని దూరం పెడుతున్న కృష్ణ
కళ్యాణ్ అప్పుని కలిసి అనామిక ఇంటికి వచ్చిందని అంటాడు. కాసేపు అప్పు వెటకారంగా మాట్లాడుతుంది. ఇంట్లో అపర్ణ వంట చేసుకునేందుకు కూరగాయలు కట్ చేసుకుంటుంటే ధాన్యలక్ష్మి, కావ్య షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి వెళ్లబోతుంటే రుద్రాణి అడ్డుపుల్ల వేస్తుంది. కావ్య దగ్గరకి వెళ్ళి తల్లీకొడుకుల మధ్య నువ్వే చిచ్చు పెట్టావని అంటుంది.
రుద్రాణి: మా వదిన నిన్ను జీవితంలో క్షమించదు. రాజ్ ని దగ్గరకి కూడా రానివ్వదు. ఇది ఎంత దూరం వెళ్తుందో ఏమో అనేసి పుల్ల వేస్తుంది. కావ్య అపర్ణ గది దగ్గరకి వచ్చి తనతో మాట్లాడేందుకు లోపలికి వెళ్లబోతుంటే కంటి చూపుతో ఆపేస్తుంది.
కావ్య: మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతుంటే అపర్ణ తనని పక్కకి నెట్టేసి మొహాన తలుపు వేసేస్తుంది.
తరువాయి భాగంలో..
అపర్ణ కుటుంబం సభ్యులతో కాకుండా విడిగా కూర్చుని భోజనం చేస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నావని ఇంద్రాదేవి అంటుంది. తనని తాను వెలి వేసుకున్నా అని చెప్పేసరికి డాక్యుమెంట్స్ తెచ్చి టేబుల్ మీద పెడుతుంది. కుటుంబంలో నుంచి విడిపోయావ్ కదా ఆస్తి కూడా ముక్కలు చేసుకుని ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకోండని పెద్దావిడ సీరియస్ అవుతుంది.