చాణక్య నీతి: తినే ఆహారం ఎలాఉంటే సంతానం అలాగే ఉంటుంది



దీపో భక్షయతే ధ్యాన్తం కజ్జలం చ పస్రూయతే!
యదన్నం భక్ష్యతే నిత్యం జాయతే తాదృశీ వజ్రా!!



తినే భోజనం ఎలా ఉంటే అలాంటి సంతానమే కలుగుతుందని చెప్పడమే చాణక్యుడి ఉద్దేశం



తినే అన్నం ఎలా ఉంటే మనస్సు అలాగే ఉంటుంది..ఆ ప్రభావం సంతానంపై ఉంటుంది



భోజనం సాత్వికం అయితే బుద్ధిమంతులైన పిల్లలు పుడతారు



తామసిక భోజనం చేస్తే మూర్ఖులైన సంతానం కలుగుతారు



ఎందుకంటే చీకటిని తినే దీపం..నల్లటి పదార్థాన్ని తయారు చేస్తుంది ( దీపం చివర్లనుంచి నల్లటి పదార్థం వస్తుంది కదా అదే)



అందుకే మంచి ఆహారం, ప్రశాంతమైన మనసుతో తీసుకుంటే దానివల్ల మంచి జరుగుతుందని చాణక్యుడు ఉద్దేశం



అందుకే గర్భిణులు ఎలాంటి ఆందోళన, అనవసర ఆలోచన లేకుండా ఉండాలని చెబుతారు....



ఆలోచన ఎంత ప్రశాంతంగా ఉంటే లోపలున్న బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు, మానసిక నిపుణులు చెబుతారు...



ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ అవసరం అని చెప్పాడు ఆచార్య చాణక్యుడు...
Image Credit: Pinterest