Gruhalakshmi September 15th: 'గృహలక్ష్మి' సీరియల్: తారాస్థాయికి చేరిన సవతి పోరు - తులసిని హనీకి దూరంగా ఉండమన్న నందు
దివ్యకి సవతి పోరుగా జాహ్నవి రంగంలోకి దిగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కృష్ణుడు వేషం వేసేందుకు తులసి రానని చెప్పేసరికి హనీ బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది. హనీ తనకి అలవాటు అయితే తర్వాత మీకే ఇబ్బంది అవుతుందని తులసి చెప్పేసి కాల్ కట్ చేస్తుంది. హనీ బాధగా నడుచుకుంటూ ఇంట్లో నుంచి బయటకి వెళ్లిపోతూ రోడ్డు మీద నడుస్తూ ఉండగా కిందపడి చేతికి దెబ్బ తగులుతుంది. నేరుగా హనీ తులసి ఇంటికి వెళ్తుంది. ఒక్కతే రావడం చూసి పరంధామయ్య వాళ్ళు కంగారుపడతారు.
నందు: తులసి లేకపోయేసరికి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది. నాకు ముందే తెలుసు ఇలా అవుతుందని అంతలా తులసి హనీకి అలవాటు అయిపోయింది
హనీ: నాకు కృష్ణుడు వేషం వేయడానికి ఎందుకు రాలేదు
తులసి: పని ఉందని చెప్పాను కదా అర్థం చేసుకో
హనీ: అదంతా నాకు తెలియదు మీరు నాకు కృష్ణుడి వేషం వేయాలి లేకపోతే లేదు
తులసి: ఏదో ఒకటి చేసి తనకి సర్ది చెప్పి ఇంటికి పంపించాలి
Also Read: జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ముకుందని హెచ్చరించిన అలేఖ్య- మురారీని దూరం పెడుతున్న కృష్ణ
అటు ఇంటి దగ్గర హనీ కోసం సామ్రాట్ బాబాయ్ వెతుకుతూ ఉంటాడు. రేపు వస్తానని చెప్తేనే ఇంటికి వెళ్దామని లేదంటే లేదని హనీ అంటుంది. తన చేతికి అయిన గాయానికి తులసి బ్యాండ్ వేస్తుంది. ఇంటికి వెళ్లాలంటే రేపు రావాలని హనీ కండిషన్ పెట్టేసరికి తులసి చేసేది లేక వస్తానని మాట ఇస్తుంది. ఇంటి దగ్గర హనీ లేదని అందరూ కంగారుగా ఉంటారు. ఎక్కడ పాప కనిపించలేదని చెప్పేసరికి పెద్దాయన టెన్షన్ పడతాడు. గదిలో నుంచి బయటకి రావడం లేదు అలాంటిది బయటకి ఎలా వెళ్తుందని రత్నప్రభ అంటుంది. అప్పుడే తులసి హనీని తీసుకుని ఇంటికి వస్తుంది. హనీ ఎక్కడ కలిసిందని పెద్దాయన అంటే తనే ఇంటికి వచ్చిందని తులసి చెప్తుంది.
రత్నప్రభ: ఇంటి బాధ్యతలు చూసుకోవడానికి వచ్చిన మమ్మల్ని రేపు అంటారు. పరాయి వాళ్ళని నిన్ను ఏమి అనరు
హనీ: తులసి ఆంటీని ఏమి అనొద్దు. రేపు కృష్ణుడి గెటప్ వేయమని అడగటం కోసం నేనే వెళ్ళాను
రత్నప్రభ: హనీకి ఇదే అలవాటు అయితే మంచిది కాదు. ఒంటరిగా ట్రాఫిక్ ఏమైనా జరగవచ్చు
తులసి: ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతుంది. విక్రమ్ దివ్య చేసిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉండగా జాహ్నవి ఫుడ్ తీసుకుని వస్తుంది. దిగులుగా ఉన్నావంట కదా అత్తయ్య చెప్తే తీసుకుని వచ్చాను. అటు దివ్య తన మీద కోపం ఫుడ్ మీద చూపిస్తున్నాడని అనుకుని బతిమలాడి అయినా తినిపించాలని తీసుకెళ్తుంది. అప్పటికే అక్కడ జాహ్నవి విక్రమ్ కి భోజనం తినిపించడం చూసి దివ్య రగిలిపోతుంది. వెంటనే వాళ్ళ దగ్గరకి భోజనం ప్లేట్ పట్టుకుని వెళ్తుంది. జాహ్నవి, దివ్య ఇద్దరూ కాసేపు విక్రమ్ ఇష్టాయిష్టాల గురించి మాట్లాడతారు. విక్రమ్ జానూకి సపోర్ట్ చేసేసరికి దివ్యకి కాలుతుంది. కావాలని జానూ కూర్చునే కుర్చీ వెనక్కి జరిపి తను కిందపడిపోయేలా చేస్తుంది. జానూకి సోరి చెప్పమని విక్రమ్ అంటాడు. కావాలని తనేమీ చేయలేదని దివ్య సమర్థించుకుంటుంది. విక్రమ్ కి మళ్ళీ ఫుడ్ తినిపించడానికి జానూ చూస్తుంటే దివ్య వచ్చి ప్లేట్ లాగేసుకుని వెళ్ళిపోతుంది.
హనీ విషయంలో ఎందుకు మనసు మార్చుకున్నావని నందు తులసిని ప్రశ్నిస్తాడు. తనకి వేరే దారి కనిపించకపోయేసరికి మొండితనం చేయలేక ఒప్పుకున్నానని అంటుంది. హనీ గురించే కాదు తన వల్ల వచ్చే సమస్యల గురించి కూడా ఆలోచించమని హెచ్చరిస్తాడు. నిదానంగా హనీకి నచ్చజెప్పడానికి చూస్తానని అంటుంది. విక్రమ్, దివ్యని పిలిచి కృష్ణాష్టమికి పిలిచి ఘనంగా చేయాలని అనుకుంటున్నట్టు తులసి చెప్తుంది. చాలా మంచి పని ఇలా అయినా విక్రమ్ మనసు మారి దివ్యకి దగ్గర అవుతాడని పరంధామయ్య సలహా ఇస్తాడు. ఉట్టి కొడుతూ, దాండియా కూడా ఆడదామని ప్లాన్ వేస్తారు. దివ్య జాహ్నవి అడ్డం పడి అక్కా అని పిలుస్తుంది.
జానూ: కావాలనే నీ దారికి అడ్డు వస్తున్నా అక్కా
Also Read: కావ్యని కొట్టాలనుకోవడం తప్పేనన్న రాజ్- కుటుంబం నుంచి తనని తాను వెలివేసుకున్న అపర్ణ
దివ్య: అక్క అని పిలవకు చిరాకుగా ఉంది. దివ్య అని పిలువు సరిపోతుంది
జానూ: అక్క అని పిలిస్తే ఎందుకు ఉడుక్కుంటున్నావ్. నేనేం బావ మీద మనసు పడటం లేదు. విక్రమ్ బావతో ఈ మధ్య కలిసి నడుస్తున్నావ్. కానీ నేను చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నా. మరి నువ్వు ఎక్కువ నేను ఎక్కువ
దివ్య: తాళి చూపించి ఇది ఎక్కువ అంటుంది
జానూ: ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు అది గుర్తుకురాలేదా?
దివ్య: నా జీవితం నాది ఏం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు
తరువాయి భాగంలో..
తులసి ఇంట్లో కృష్ణాష్టమి సంబరాలు జరుగుతూ ఉంటాయి. నందు, తులసి దాండియా ఆడుతుంటే దివ్య చూసి సంతోషపడుతుంది. విక్రమ్, దివ్య, జానూ దాండియా ఆడుతూ ఉండగా పొరపాటున దివ్య తలకి దెబ్బ తలుగుతుంది. దీంతో తులసి కంగారుగా ఏమైందని అంటుంది. అది చిన్న దెబ్బ తగ్గిపోతుందని జానూ అనేసరికి విక్రమ్ షటప్ అని జానూ మీద అరుస్తాడు.