అన్వేషించండి

Brahmamudi October 19: 'బ్రహ్మముడి' సీరియల్: రాహుల్ కి చుక్కలు చూపిస్తున్న కామరాజు - కుటుంబం ముందు రాజ్ ని అడ్డంగా బుక్ చేసిన కావ్య?

కావ్య కిల్లి కావాలి అని అడగడంతో అర్ధరాత్రి బయటకు వచ్చి కిల్లి షాప్ లోకి దొంగగా వెళ్తారు.. అతర్వాత పోలీసులు రావడంతో కథ మొత్తం యు టర్న్ తీసుకుంటుంది.. అసలు ఎపిసోడ్ లో ఈరోజు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

Brahmamudi October 19 Written Update: ఈరోజు ఎపిసోడ్ లో కిల్లి కోసం తెరిచి ఉన్న పాన్ షాప్ లోకి వెళ్లి రాజ్, కావ్య పాన్ వేసుకోగా.. షాప్ లో దొంగలు పడ్డారంటూ పాన్ షాప్ ఓనర్ పోలీసులను పిలుస్తాడు.. అక్కడికి పోలీసులు వచ్చి కావ్యని రాజ్ ని నిలదీస్తారు. పోలీస్ ప్రశ్నలకు ఒంకర సమాదానాలు చెప్పడంతో పోలీస్ కోపంగా మాట్లాడుతూ మిమ్మల్ని సమాధానం చెప్పమంటే మా ఆవిడలాగా సమాధానం చెప్పుతారు ఏంటి  అని అంటాడు. ఆ వెంటనే కావ్య అయ్యో సార్ మేమిద్దరం భార్యాభర్తలం అంటుంది.

కావ్య : కిల్లి కావాలంటే ఆయన ఇలా తీసుకోవచ్చారు అన్ని షాపులు క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ షాప్ క్లోజ్ లో ఉంది కానీ తాళం వేయకపోయేసరికి లోపలికి వెళ్లి కిల్లిలు తిన్నాము అని చెబుతుంది.

రాజ్ : ఇప్పటికైనా మమ్మల్ని వదిలిపడతారా అని అంటాడు.

షాపు ఓనర్ : నేను లేనప్పుడు షాప్ లోకి దొంగలా దూరారు ఇప్పుడు మీరు దొంగలు కాదంటే నమ్మాలా అని అంటాడు.

పోలీస్: మీరిద్దరూ భార్యాభర్తలు అనడడానికి సాక్ష్యం ఏంటి అని అడుగుతాడు.

కావ్య : నేను ఆయన కలిసి ఫోటోలు దిగాము సార్ అంటుంది.

రాజ్ : నేను ఫోన్ తీసుకురాలేదు అని అంటాడు.

రాజ్, కావ్య : అప్పుడు ఇద్దరు పోలీసుల ముందు ఫన్నీగా పోట్లాడుకుంటూ ఉంటారు.

పోలీస్ : ఆపండి మీరిద్దరూ భార్యాభర్తలు అని నేను నమ్మాను అని అంటాడు.

రాజ్ : తర్వాత పాన్ షాప్ ఓనర్ కి డబ్బులు ఇచ్చి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

రుద్రాణి: మరోవైపు సంతోషంగా నిద్రలేస్తుంది. పక్కనే ఉన్న కనకం తన చీరలు అన్ని కప్పుకొని పడుకోవడంతో షాక్ అయ్యి కనకంని నిద్ర లేపుతుంది. అప్పుడు ఇద్దరు ఫన్నీగా వాదించుకుంటూ ఉంటారు. 

కనకం : ఆ చీరలు అన్ని మడత పెట్టి రుద్రాణి ఒడిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

రాహుల్: రాహుల్ పడుకుని ఉండగా జైలు నుంచి కామరాజు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు.

కామరాజు : పోలీసులు అరెస్టు చేయగానే పని అయిపోయింది అనుకున్నావా నాకు బెయిల్ తెచ్చి విడిపించు లేదంటే నీ భార్యని చంపాలి అనుకున్నది నువ్వే అన్న విషయం అందరికీ చెప్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు.

రాహుల్ : ఏంటి బెదిరిస్తున్నావా అని కోపంగా మాట్లాడుతాడు.

స్వప్న : మాటలు విన్న స్వప్న ఏంటి ఎవరితో రాహుల్ ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అని వెళ్లి నిలదీయగా రాహుల్ అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు. 

అప్పు పెద్దమ్మ : ఏంటి అప్పు మీ నాన్న కూరగాయలు కట్ చేస్తుంటే అలా చూస్తున్నావు అంటూ తిడుతుంది.

కృష్ణమూర్తి : పర్లేదులే వదినా నాకు ఎలాగో అలవాటు. పైగా అప్పుకి అలవాటు లేదు కదా అని వెనకేసుకొస్తాడు. అప్పుడు అప్పుకి పదేపదే ఫోన్ రావడంతో అప్పు ఫోన్ కట్ చేస్తుంది. ఎవరు అని అడగగా రాంగ్ నెంబర్ అంటుంది.

కళ్యాణ్ : ఇంతలో కళ్యాణ్ అక్కడికి వచ్చి రాంగ్ నెంబర్ కాదు అంకుల్ నేనే చేస్తుంటే అప్పు కట్ చేస్తుంది. మీ అమ్మగారు చీరలు తీసుకు రమ్మని చెప్పారు ఆ విషయం చెబుదామని ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు అంటూ సరదాగా అప్పుతో పోట్లాడుతాడు కళ్యాణ్. తర్వాత ఇద్దరు కలిసి అక్కడ నుంచి వెళ్లిపోతారు. 

సుభాష్: ఏంటి హాల్లో ఇంతమంది ఉన్నా కూడా ఏ ఒక్కరూ కాఫీ ఇవ్వడం లేదు అనగా, నాకు కాఫీ పెట్టడం రాదు అని రుద్రాణి అనడంతో రుద్రాణిపై సెటైర్లు వేస్తారు. ఇంతలోనే రాజ్, కావ్య ఇద్దరు ఇంటికి వస్తారు.

ధాన్యలక్ష్మి : ఏంటి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్లి వస్తున్నారు. మీ వాళకం చూస్తుంటే నైటే వెళ్లినట్టు ఉన్నారు అని అంటుంది.

అపర్ణ : ఎక్కడికి వెళ్లారు రాజ్ అని నిలదీస్తుంది.

కావ్య : మీ అబ్బాయి బయటికి వెళ్దాం రమ్మంటే తోడుగా వెళ్లాను అని చెప్పి అడ్డంగా రాజ్ ని ఇరికించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

రాజ్ : అది అది అంటూ తడబడుతూ ఉండగా అందరూ కలిసి రాజ్ ని ఆటపట్టించినట్లు మాట్లాడతారు. రాజ్ ప్రవర్తన చూసి అపర్ణ ఆశ్చర్యపోతుంది. అప్పుడు రాజ్ మళ్లీ వస్తానని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Rains Update: బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
బలహీనపడిన అల్పపీడనం, నేడు ఏపీలో ఈ జిల్లాల్లో వర్షాలు- తెలంగాణలో వాతావరణం ఇలా
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Embed widget