Brahmamudi August 23rd: అమ్మాకొడుకుని ఏకిపారేసిన శుభాష్- అత్తింట్లో తిరిగి అడుగుపెట్టిన కావ్య
అపర్ణకి ఎదురు చెప్పిందని రాజ్ కావ్యని ఇంట్లో నుంచి గెంటేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
తమ కూతురు తమకి భారమేమి కాదని చెప్పి కనకం దంపతులు కావ్యని అత్తింటి నుంచి తీసుకుని వెళ్లబోతుంటే రాజ్ తండ్రి ఎదురుగా నిలబడతాడు. తన కోడలిని ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీస్తాడు. కావ్యని సమర్ధించి మళ్ళీ ఇంట్లోకి తీసుకుని వెళతాడు. ఇంట్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా శుభాష్ అందరి దుమ్ము దులిపేస్తాడు. దీంతో కావ్య మళ్ళీ అత్తింట్లో అడుగుపెడుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఏముందంటే..
రాజ్ చేతికి తగిలిన గాయానికి కావ్య కట్టు కడుతుంది. దాన్ని రాజ్ కోపంగా విసిరి కొట్టేస్తాడు. మీతో ఒక విషయం మాట్లాడాలి. మా నాన్నకి సాయం చేస్తానని మాట ఇచ్చాను కదా నేను పుట్టింటికి వెళ్లనా అని కావ్య రాజ్ ని అడుగుతుంది. కానీ సమాధానం చెప్పకుండా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కావ్య తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కృష్ణయ్య ముందు నిలబడి ఏడుస్తుంది.
కావ్య: అనుకున్నది సాధించావ్ కదా ఇప్పుడు సంతోషంగా ఉందా? ఈరోజు నేను నా తల్లిదండ్రుల కోసం పడుతున్న కష్టం ఒక అబ్బాయి పడితే అది బాధ్యత అవుతుంది. కానీ నేను చేస్తే తప్పు అవుతుంది ఎందుకు? కృష్ణ అని తన గోడు వెళ్లబోసుకుంటుంది. ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత కూడా కావ్య పుట్టింటికి వెళ్తుందో లేదో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్యని తీసుకెళ్తున్న కనకం దంపతులకి శుభాష్ ఎదురుపడతాడు. తన కూతురికి ఈ ఇంట్లో స్థానం లేదని అందుకే తీసుకెళ్తున్నట్టు కృష్ణమూర్తి చెప్తాడు. కావ్య మీ కూతురు కాదు ఇప్పుడు తను ఈ ఇంటి కోడలు. తనకి పెళ్లి చేయడం వరకే మీ బాధ్యత. పెళ్లి అయిన తర్వాత తనకి తండ్రిని నేను అంటూ కావ్య చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తాడు. ఇక అందరికీ వరుస పెట్టి క్లాస్ పీకుతాడు. కావ్య చేసిన పనిని సమర్థిస్తూ అపర్ణ, రాజ్ ని ఏకిపారేస్తాడు.
Also Read: నిజం తెలిసి ఏంజెల్ మీద అరిచిన రిషి- మిస్టర్ ఇగోకి ప్రేమలేఖ రాసిన వసుధార
శుభాష్: అర్థరాత్రి పూట కోడల్ని కొడుకు వెళ్లగొడుతుంటే చూస్తూ ఊరుకున్నావా? అంత అహంభావమా? ఇంత అమానుషమా? ఏమైంది ఈ ఇంటి సంస్కారం
రుద్రాణి: అదేంటి అన్నయ్య వదిన్ని అంటావ్ వాళ్ళకి మామూలు అహంకారం లేదు
శుభాష్: నోరు అదుపులో పెట్టుకో రుద్రాణి. నువ్వు మా ఇంట్లో పడి ఉన్నట్టు కావ్య కూడా భర్తని వదిలేసి వాళ్ళ ఇంట్లో పడి ఉండాలా? నా కొడుకు, కోడలు కలిసి ఉండటం చూసి ఓర్వలేకపోతున్నావా? నా భార్య మతి చెడింది అంటే దానికి సగం కారణం నీ చెప్పుడు మాటలు వినడమే. తల్లిదండ్రుల్ని చూస్తూ ఏమైంది మీ పెద్దరికం అని నిలదీస్తాడు
ఇంద్రాదేవి: నీ కొడుకు బూడిద పాలు చేశాడు. నీ భార్య విలువ లేకుండా చేసింది. ఈరోజు అవమానం జరిగింది ఈ ఇంటి కోడలికి మాత్రమే కాదు మా వయసుకి, మా పెద్దరికానికి జరిగింది. నా భర్త మాటకి విలువ లేకుండా చేశారు ఈ తల్లీ కొడుకులు. నీ ఆవేశమే ఇంతటి అనార్థానికి కారణం అయ్యింది. ఆ కన్న తల్లి ఉసురు మనకి తగలక ముందే మీరు మేల్కోండి
శుభాష్: కావ్య నీ కన్నతండ్రి రమ్మన్నాడని పుట్టింటికి వెళ్తే నీ అస్తిత్వం, వ్యక్తిత్వం వదిలేసుకుని వెళ్తే సాధారణ ఆడదానిలా వెళ్తావ్. అన్నీ వదిలేసుకుని తల వంచుకుని వెళ్ళే తప్పు నువ్వేమి చేయలేదు. ధైర్యంగా నీ ఇంట్లోకి నువ్వు అడుగుపెట్టు లోపలికి వెళ్ళమ్మా
దీంతో కావ్య తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక భర్త చేసిన పని నచ్చలేదని అపర్ణ కోపంగా అంటుంది.
అపర్ణ: ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నా కొడుకుని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేశారు. మహారాజులా పెరిగిన నా కొడుకుని కావ్య ఈరోజు మట్టి తొక్కించింది. ఒక మామూలు మనిషిని చేసి రోడ్డున నిలుచోబెట్టింది
శుభాష్: రాజ్ కూడా అందరీలాంటి మామూలు మనిషే. నీ కొడుకు కాబట్టి మహారాజులా చూస్తున్నావ్. అందరినీ అలాగే చూడమంటున్నావ్. రాజ్ మాత్రమే ఈ పెళ్లి వల్ల అన్యాయం జరగలేదు. కావ్యకి కూడా అదే అన్యాయం జరిగింది. తను అత్తింటిని వదిలేసి పుట్టింటికి వెళ్తే అందరూ మన గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటారు. పేద ఇంటి నుంచి కోడల్ని తీసుకొచ్చి మూడన్నాళ్ళకే తనని ఇంట్లో నుంచి పంపించేసి విడాకులు ఇచ్చేశారని తప్పుడు ప్రచారం చేసి మన పరువు తీసేవాళ్ళు. అయినా కావ్య పుట్టింటికి వెళ్తే తిరిగి వస్తుందని అనుకుంటున్నావా? ఆత్మాభిమానం కలిగిన తను అసలు అత్తింటి గడప మళ్ళీ తొక్కదు. ఆ విషయం గుర్తు పెట్టుకో అంటాడు.
ఇక కావ్య రాజ్ తో మాట్లాడేందుకు ట్రై చేస్తుంది. అత్తయ్యని ఎదిరించి మాట్లాడటం తన ఉద్దేశం కాదని చెప్తుంటే రాజ్ కోపంగా తన చేతిని డోర్ కి వేసి గట్టిగా కొట్టుకుంటాడు. దీంతో రాజ్ చేతికి గాయం అవుతుంది. కావ్య పిలుస్తున్నా పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళి ఆలోచిస్తూ అలాగే నిద్రపోతాడు. కావ్య వచ్చి చేతికి కట్టుకడుతుంది.
View this post on Instagram