News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu August 22nd: అర్థరాత్రి వసుధార ఇంటికి రిషి, పెళ్లి గురించి నడిరోడ్డుపై చర్చ పెట్టిన ఈగో మాస్టర్

Guppedantha Manasu August 22th: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు ఆగష్టు 22 ఎపిసోడ్ (Guppedanta Manasu August 22nd Written Update)

వసుధార డల్ గా ఉండడం గమనించి ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఆరాట పడతాడు రిషి. చాటింగ్ చేస్తూ చేస్తూ..మీ పెళ్లెప్పుడు సార్ అని వసుధార మెసేజ్ చూసి రిషి షాక్ అయి వసుకి కాల్ చేస్తాడు.
వసు: కాల్ కట్ చేసిన వసుధార..రిషి సార్ మనసులో నాకు తప్ప మరొకరికి చోటు లేదు..కానీ తనకు సాయం చేశారన్న ఆలోచనతో ఏంజెల్ ప్రేమను అంగీకరిస్తారేమో అనుకుని బాధపడుతుంది...
మళ్లీ మళ్లీ కాల్ చేసినా వసుధార కట్ చేయడంతో రిషి బాధపడతాడు...

Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్ : రెండు హృదయాలు భారమైన వేళ- వసు నుంచి ఊహించని ప్రశ్న, అయోమయంలో రిషి

దేవయాని ఏదో ఆలోచనలో ఉండడం చూసి ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు ఫణీంద్ర.. నీ మనసులో ఏముందో చెప్పు...
దేవయాని: ఈ మధ్య మీతో మాట్లాడాలంటే భయంగా ఉంది
ఫణీంద్ర: నీకు భయంగా ఉందంటే నవ్వొచ్చింది.. నీకు ఏదనిపిస్తే అది వాగేస్తావు కదా కొత్తగా భయం అంటే నవ్వొచ్చింది..
దేవయాని: మీకు నవ్వులాటగానే ఉంటుంది కానీ ఈ మధ్య చాలా కోపంగా ఉంటున్నారు.ఏం చెప్పాలన్నా మాటలు రావడం లేదు..
ఫణీంద్ర: నేను కోప్పడను విషయం చెప్పు
దేవయాని: శైలేంద్ర మన కొడుకు, ఎదిగిన పిల్లాడు..మొన్న మీరు తీసిపడేశారు..
ఫణీంద్ర: నేను కావాలనే అన్నానా..తప్పుచేస్తే మందలించడం బాధ్యత కాదా
దేవయాని: తన తప్పేదైనా ఉంటే నెమ్మదిగా చెప్పండి
ఫణీంద్ర: తన హద్దుల్లో తనుంటే అనాల్సిన అవసరం ఏంది..
దేవయాని: శైలేంద్రకి ఇంటి విషయాలు, కాలేజీ విషయాలు పెద్దగా తెలియదు కదా..ఇప్పుడిప్పుడే అనుభవం వస్తోంది..
ఫణీంద్ర: అందుకే కదా కాలేజీకి వస్తానంటే ఒప్పుకున్నాను.. 
దేవయాని: అక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే మళ్లీ మీరు ఏమైనా అంటారేమో అని భయం వేస్తోంది..ఇప్పటికే తన మనసు విరిగిపోయింది మీరు మళ్లీ ఏమైనా అంటే తిరిగి ఫారెన్ కి వెళ్లిపోతాడనే భయం ఉంది. అందుకే తనకి పని నేర్పించి ఇక్కడే మనతో పాటూ ఉండేలా చేయండి
ఫణీంద్ర: తనను ఏమీ అనను..ఏమైనా ఉంటే నెమ్మదిగా చెబుతాను. నీకోసమో-శైలేంద్ర కోసమో కాదు ఈ ఇంటి కోడలు ధరణి జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని నీకు మాటిస్తున్నాను..ఇదే అదనుగా శైలేంద్ర మళ్లీ తప్పులు చేస్తే బావోదు..వాళ్ల మధ్య తలదూర్చకు.. నా మాట పోయేపని శైలేంద్ర చేయకుండా నువ్వు చూసుకో
దేవయాని: మన కొడుకు కాలేజీకి మంచి పనులు చేస్తాడని బయటకు అంటూనే..మీవల్ల మన కొడుకు కల నాకల నెరవేరుతుంది అనుకుంటుంది

Also Read: వసు కన్నీళ్లు చూసి రిషి మనసులో అలజడి, ఏంజెల్ కి నిజం తెలిసే టైమొచ్చిందా!

వసుధార తల్లి ఫొటో పట్టుకుని ఎమోషన్ అవుతుంది. ఎందుకిలా చేస్తున్నావని వచ్చి అడుగుతాడు తండ్రి చక్రపాణి. ఈ ఫొటో ఇక్కడి నుంచి తీసేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు అందుకే తీసేద్దాం అనుకుంటున్నా
చక్రపాణి: అమ్మ లేదన్న నిజం అల్లుడుగారు తెలుసుకుంటే నువ్వు ఎంత నష్టపోయావో తెలుసుకునేవారు..నీ జీవితం బావుండేదమో
వసు: సర్ కి నేను దూరం అవడం వల్లే అమ్మ చనిపోయిందని తెలిస్తే రిషి సార్ ఇంకా బాధపడతారు..అందుకే ఈ ఫొటో నా రూమ్ లో పెడతాను. మనం దురదృష్టవంతులం అందుకే అమ్మతో రుణం తీరిపోయింది. అమ్మలేని విషయం తెలిస్తే నాపై సానుభూతి కలుగుతుంది.. ఆ ప్రేమ నాకు అవసరం లేదు నాన్నా
చక్రపాణి: నీ ప్రేమని అర్థం చేసుకోలేక నీకు అన్యాయం చేయబోయాను.. నీ ప్రేమను అర్థం చేసుకుంటారనే ఆశ ఉన్నప్పటికీ ఏమూలో ఏదో భయం ఉందమ్మా
వసు: ఈ వసుధార రిషి సార్ గుండెచప్పుడు..మేం ఇద్దరం విడిపోవడానికి కారణం కాలమే..మేం ఇద్దరం కలవడానికి కూడా కారణం కూడా కాలమే.. మళ్లీ మా ప్రేమ ముడిపడేందుకు కూడా కారణం కాలమే అవుతుంది..మీరు బాధపడొద్దు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార..
చనిపోయినవారంతా దేవతల్లో కలుస్తారని అంటారు...వసుధార-అల్లుడుగారు కలవాలని సంతోషంగా కాపురం చేసుకోవాలని దీవించు అంటాడు...

నిద్రపోయేముందు డోర్స్ క్లోజ్ చేసేందుకు వస్తుంది వసుధార...ఆ డోర్స్ ఓపెన్ చేసి ఎదురుగా నిల్చుంచాడు రిషి.. ఇద్దరూ కాసేపు మనసులతో మాట్లాడుకుంటారు.  ఆ టైమ్ లో ఇంటికొచ్చిన రిషిని చూసి షాక్ అవుతాడు చక్రపాణి...లోపలకు రండి అల్లుడుగారు అని పిలిచేసి వీళ్ల మధ్య నేనెందుకు అనేసి వెళ్లిపోతాడు.. వసుధార ఏమీ మాట్లాడకుండా ఉండిపోవడం చూసి లోపలకు రావొచ్చా అని అడుగుతాడు రిషి.. 
వసు: ఇప్పుడు టైమెంత..ఇది మాట్లాడే సమయం కాదు..అర్థరాత్రి 12 అయింది..కాలేజీలో మాట్లాడుకుందాం
రిషి: నేను ఇప్పుడే మాట్లాడాలి
వసు: మీరు ఈ టైమ్ లో ఇక్కడకు రావడం మంచిది కాదు..మీరు నేరుగా ఇంటికొచ్చి మాట్లాడితే వాళ్లకి ఇంకా అవకాశం ఇచ్చినట్టే. దయచేసి వెళ్లండి..రేపు ఉదయం మాట్లాడుకుందాం. ముఖం మీద తలుపేయడం బావోదు..
రిషి: నేను కూడా తలుపులు బద్దలుకొట్టుకుని రావడం బావోదు..మాట్లాడి తీరాల్సిందే..మీ పాటికి మీరేదో పిచ్చిపిచ్చి మెసేజ్ లుపెట్టసి తర్వాత మాట్లాడుదాం అంటే వెళ్లిపోవాలా..అవన్నీ కుదరవు..ఈ క్షణమే మాట్లాడి తీరాల్సిందే.. 
వసు: ఇది సమయం కాదు..వెళ్లండి అని తలుపు వేసేస్తుంది..
రిషి కారు వెళ్లిపోయిన సౌండ్ వింటుంది..
 కొంచెం దూరం వెళ్లి కారు ఆపి రోడ్డు పక్కన నిల్చుని రగిలిపోతాడు..నాకెందుకు ఈ పెయిన్..నా మనసు నన్ను గతం మర్చిపోనివ్వదా.. వసుధార అంతా మరిచిపోయినట్టు ప్రవర్తిస్తోంది..ఇంకా ఎవరితో పంచుకోవాలి ఇదంతా అనుకుంటాడు..  ఇంతలో వసుధార అక్కడకు వస్తుంది.. నాతో పంచుకోండి అంటూ..పొమ్మన్నారు కదా మళ్లీ ఎందుకొచ్చారని అడుగుతాడు. మీ బాధనాకు తెలుసు అందుకే వచ్చాను.. చెప్పండి.. ఏం మాట్లాడాలి..
రిషి: నేను ఏం మాట్లాడాలని వచ్చానో మీకు తెలియదా.. మీరు నన్ను ఎలా మార్చేశారో తెలుసా..గుర్తుచేయాలా.. ప్రపంచం తెలియని నాకు ప్రపంచం చూపించారు, ప్రేమ తెలియని నాకు ప్రేమను పంచారు, జీవితాన్ని కొత్తగా చూపించారు..చివరకు ఆ జీవితానికి ఓ గమ్యం లేకుండా చేశారు, బాధలు తెలియని నాకు బాధలు చూపిస్తున్నారు, అబద్ధాలు నేర్పిస్తున్నారు, దాపరికం అంటే సహించని నేను ఎన్నో విషయాలు బయటపెట్టలేకపోతున్నాను, ఎందుకిదంతా చేస్తున్నారు..మీవల్లకాదా..
వసు: మనసును ముక్కలు చేసే గతాన్ని చెరిపేసుకోవాలి
రిషి: మనసేం మ్యాజిక్ స్లేట్ కాదు..ఇంకా నా మనసుని ఏం చేయదలుచుకున్నారు..నేను భరించలేకపోతున్నాను..నాకు దారి తెలియడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు..ఇప్పుడు ఏం చేయాలి
వసు: ఏం చెబితే అది చేస్తారా..
రిషి: నాకు నచ్చిందే చేస్తాను..
వసు: మీకు నచ్చిందే చేయండి..
రిషి: మీ పెళ్లెప్పుడు అని మెసేజ్ చేశారేంటి..అంటే నేను వేరే ఎవరినైనా పెళ్లిచేసుకోవాలనా..అది అసాధ్యం..నా మనసులో ఒకరు ఉన్నంతవరకూ ఆ పని చేయలేనని తేల్చిచెప్పేస్తాడు...

Published at : 22 Aug 2023 08:15 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial August 22nd Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss Season 7 Telugu: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: పుంజుకుంటున్న ప్రిన్స్, ఆ ఇద్దరికీ గండం - మతపరమైన వ్యాఖ్యలతో ఆ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Telugu 7: నిన్న గౌతమ్, నేడు యావర్ - ఏంటి ‘బిగ్ బాస్’ అలా చేశావ్, పవర్ అస్త్ర రేసులో శోభ, ప్రియాంక

Bigg Boss Telugu 7: నిన్న గౌతమ్, నేడు యావర్ - ఏంటి ‘బిగ్ బాస్’ అలా చేశావ్, పవర్ అస్త్ర రేసులో శోభ, ప్రియాంక

Yavar- Shobha Shetty: అరిచిన యావర్- పవర్ అస్త్ర కోసం ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్

Yavar- Shobha Shetty: అరిచిన యావర్- పవర్ అస్త్ర కోసం ఫిటింగ్ పెట్టిన బిగ్ బాస్

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Prema Entha Madhuram September 22nd: అనుకి వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవి, మాన్సీ - ఆర్యని ఇంటికి తీసుకొచ్చిన అక్కి!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

Trinayani September 22nd Episode: కొత్త ప్లాన్‌తో తిలోత్తమా- పుట్టినరోజు సంబరాలలో విష ప్రయోగం!

టాప్ స్టోరీస్

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Chandrayaan-3: 'చంద్రయాన్-3' రీయాక్టివేషన్ ప్రక్రియ వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

చంద్రబాబుకు హైకోర్టులో షాక్- క్వాష్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు

BC Survey In Telangana: తెలంగాణలో త్వరలో బీసీ సర్వే- స్థానిక ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కసరత్తు