News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu August 21st - 'గుప్పెడంత మనసు' సీరియల్ : రెండు హృదయాలు భారమైన వేళ- వసు నుంచి ఊహించని ప్రశ్న, అయోమయంలో రిషి

Guppedantha Manasu August 21st: గుప్పెడంత మనసు సీరియల్ లో కొత్త లవ్ ట్రాక్ మొదలైంది. వసుధార-రిషి ఇద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటుంటే... మధ్యలో వచ్చి చేరింది ఏంజెల్.

FOLLOW US: 
Share:

రిషి చక్రపాణిని కలిసి వసుధార డల్ గా ఉందని ప్రాబ్లం ఏంటని అడుగుతాడు.

చక్రపాణి: దానికి కారణం మీకోసమే అయి ఉంటుంది. ఈరోజు మీ మధ్య జ్ఞాపకాలు ఏమైనా గుర్తుకు వచ్చాయి ఏమో. అందుకే తను బాధపడి ఉంటుంది. అయినా మీరు దూరం పెట్టడంలో తప్పు లేదు ఎందుకంటే తను మీ మనసుని అంతగా గాయపరిచింది. తను అప్పుడు అందుకు ఎలా చేసిందో మీరు ఆలోచిస్తే అన్ని నిజాలు మీకు తెలుస్తాయి

రిషి: మీ కూతురు జీవితం అలా అయిపోయినందుకు మీరు ఎంతగా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి సర్ వెళ్లిపోతుంటే ఏంజెల్ ఇంటికి వచ్చిన విషయం చెప్తాడు. తను వసు దగ్గరకి ఎందుకు వెళ్ళింది? ఏం మాట్లాడింది? తను డల్ గా ఉండటానికి ఏంజెల్ మాట్లాడిన విషయమే కారణం అయ్యి ఉంటుందా అని ఋషి ఆలోచనలో పడతాడు.

ALso Read: హీరోలా ఫైట్ చేసిన వేద- కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పిన మాళవిక, యష్ విడుదల

ఏంజెల్ రిషి గురించి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే రిషి వచ్చి పలకరిస్తాడు.

రిషి: నువ్వు వసుధార మేడమ్ ని కలిశావా?

ఏంజెల్: కలిశాను అయితే ఏంటి?

రిషి: ఏం లేదు నువ్వు తనతో ఏం మాట్లాడావ్

ఏంజెల్: ఏమైనా ప్రాబ్లమా? తను నీతో ఏమైనా చెప్పిందా?

రిషి: చెప్పలేదు అందుకే నిన్ను అడుగుతున్నా. తను చాలా మూడ్ ఆఫ్ లో ఉంది. విషయం ఏంటో చెప్పొచ్చు కదా

ఏంజెల్: తను నా ఫ్రెండ్ కదా అందుకే పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నా. అది నీకు చెప్పే విషయం కాదు. మేము అమ్మాయిలం మాకు మాకు చాలా ఉంటాయి. అవి అబ్బాయిలకి చెప్పేవి కావు అర్థం చేసుకో. అయినా నా విషయం తనకి చెప్తే తను ఎందుకు హర్ట్ అవుతుంది.

రిషి: ఆ విషయం తనకి లింక్ అయి ఉంటుందేమో

ఏంజెల్: వసుధార గురించి నాకు బాగా తెలుసు. తనకి ఏదో ప్రాబ్లం ఉంది అది ఇప్పుడు భరించలేని పరిస్థితికి వచ్చిందేమో. అందుకే బాధపడుతుంది ఏమో. తనకి నాకు సంబంధం ఏంటి? మీ ఇద్దరి మనస్తత్వాలు చాలా దగ్గర ఉంటాయి. అందుకే మీరిద్దరూ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. ఇక ముందు అనేసి సిగ్గుపడుతూ మాట్లాడటం ఆపేసి టాపిక్ డైవర్ట్ చేస్తుంది

రిషి కలిసిన విషయం వసుకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాడు. అటు వసు ఏంజెల్ తన ప్రేమ సంగతి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతుంది. అప్పుడే చక్రపాణి వెళ్ళి రిషి తనని కలిశాడని చెప్తాడు.

చక్రపాణి: నీకు ఏమైందని అల్లుడుగారు చాలా కంగారుగా అడిగారు

Also Read: ఐ లవ్ రిషి అని చెప్పేసిన ఏంజెల్, షాక్ లో వసు - రిషి రియాక్షన్ ఏంటంటే!

వసు: నా ప్రాణానికి ప్రాణమైన రిషి సర్ నాకు కాకుండా పోతారు ఏమోనని భయంగా ఉందని మనసులోనే కుమిలిపోతుంది. ఇన్నాళ్ళూ మా ఇద్దరి మధ్య దూరం ఉన్నా కలుస్తామని ఆశ ఉండేది. కానీ ఇప్పుడు మా మధ్య మూడో వ్యక్తని కన్నీళ్ళు పెట్టుకుంటుంది

చక్రపాణి: వసమ్మ ఎందుకు ఆ కన్నీళ్ళు అల్లుడు అడిగాడు అంటే ఏదో జరిగే ఉంటుంది. ఏం జరిగింది చెప్పమ్మా అని కంగారుగా అడిగినా కూడ చెప్పదు. అటు రిషి కూడా వసు డల్ గా ఉండటం గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

నేను మనసు చంపుకుని తనని తిట్టినా కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తను చాలా బాధపడుతుంది. ఆ విషయం ఏంటో తెలుసుకునే దాకా నాకు మనశ్శాంతి లేదని అనుకుంటూ ఉండగా ఏంజెల్ వచ్చి పలకరిస్తుంది. తను ఎందుకు డల్ గా ఉన్నాడో తెలుసుకుందామని ఏంజెల్ అడుగుతుంది. భోజనం పెట్టినా కూడా ఆకలిగా లేదని చెప్పేసి తినకుండా వెళ్ళిపోతాడు.

వసు: ఏంజెల్ నా ఎండీగారిని ప్రేమిస్తుంది. ఆ విషయం మీతో ఎలా చెప్పాలి. అది చెప్పాలంటేనే నా ప్రాణం పోతుంది సర్.

రిషి: తన ప్రాణం నేనే కదా.. నేను దూరం పెట్టినా కూడా ధైర్యంగా నిలబడింది. మరి ఇప్పుడు ఎందుకు తన కళ్ళలో భయం కనిపిస్తుంది. నాకు ఆ విషయం తెలిస్తే నేను తీరుస్తాను కదా.

వసు: మీకు కోపం, ప్రేమ ఎక్కువ అవి నా మీద చూపిస్తూ ఉంటారు.

రిషి: నాకు నీమీద కోపం ఎక్కువే కానీ నువ్వు బాధలో ఉంటే నేను చూస్తూ ఎలా ఉంటాను.

వసు: నాకు తెలుసు నేను బాధపడితే మీరు తట్టుకోలేరు కానీ మీకు చెప్పడానికి నాకు మనసు రావడం లేదు.

రిషి: నాకు చెప్పడానికి నీకు మనసు రాదని నాకు తెలుసు ఎంత పెద్ద సమస్య అయినా భరిస్తావు

ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదు చెప్పేవరకు వదిలి పెట్టకూడదని అనుకుని వసుకి మెసేజ్ చేస్తాడు. మీరు ఎందుకు అంత డిస్ట్రబ్ గా ఉన్నారని అడుగుతాడు. కానీ వసు మాత్రం ఏం లేదని రిప్లై ఇస్తుంది. మరి మీరు ఎందుకు డల్ గా ఉన్నారని అంటే అది తన వ్యక్తిగతమని అంటుంది. సమస్య ఏంటో చెప్తే తీరుస్తానని అంటాడు. సమస్య ఏంటో చెప్పడానికి మన మధ్య ఏ బంధం లేదని మీరే అన్నారు కదా అలాంటప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కాలేజ్ కి సంబంధించిన విషయం కాదు మీకు చెప్పడానికని కోపం వచ్చేలా మెసేజ్ పెడుతుంది. రిషి ఎంత అడిగినా కూడా చెప్పకుండా ఉంటుంది. చివరకి మీవల్లే డల్ గా ఉన్నానని చెప్తుంది. ఇంతకీ మీ పెళ్లి ఎప్పుడు సర్ అని మెసేజ్ పెడుతుంది. అది చూడగానే రిషి షాక్ అవుతాడు. ఎందుకు ఇలా పెట్టిందని వెంటనే కాల్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తుంది.

రిషి మనసులో నాకు తప్ప ఎవరికీ చోటు లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో తన ప్రాణాలు కాపాడిందని కారణంతో ఏంజెల్ మాట కాదనలేక, మరెవరో ఒత్తిడితో తన ప్రేమని అంగీకరిస్తే ఏంటా తన పరిస్థితి అని వసు కుమిలిపోతుంది.

Published at : 21 Aug 2023 09:45 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial August 21st Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!

Bigg Boss Telugu 7: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Extra Jabardasth Latest Promo: పల్లకి ఎక్కిన ఫైమా, మరీ ఓవర్ చేసిన ఇమ్మూ- ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’లో ‘మ్యాడ్’ టీమ్ సందడే సందడి!

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

Gruhalakshmi October 4th: రత్నప్రభ నిజస్వరూపం తెలుసుకున్న తులసి- దివ్యని బుజ్జగించే పనిలో విక్రమ్!

Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద- కృష్ణ ఉగ్రరూపం!

Krishna Mukunda Murari October 4th: శకుంతలని అవమానించిన ముకుంద-  కృష్ణ ఉగ్రరూపం!

టాప్ స్టోరీస్

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం