Ennenno Janmalabandham August 21st: 'ఎన్నెన్నో జన్మల బంధం' సీరియల్: హీరోలా ఫైట్ చేసిన వేద- కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పిన మాళవిక, యష్ విడుదల
మాళవిక హత్య చుట్టు గత కొన్ని రోజులుగా జరుగుతుం కథకి ముగింపు పలికారు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మాళవిక హత్య కేసుకు సంబంధించి కోర్టులో వాదనలు జరుగుతూ ఉంటాయి. యష్ తనని హత్య చేయడం ఒక ప్రత్యక్ష సాక్షి చూసినట్టు లాయర్ చెప్తాడు. అతడు బోనులోకి వచ్చి యష్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడు.
ప్రత్యక సాక్షి: మేము చెరువులో చేపల వేటకి వెళ్ళాం. అక్కడ ఈ బాబు, ఆ అమ్మాయి ఇద్దరూ గొడవపడుతున్నారు. ఏమైందో ఏమో రాయి తీసుకుని ఆ అమ్మాయి తల పగలగొట్టాడు. తను చనిపోయింది. అప్పుడు బాబు కారులో నుంచి పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి శవాన్ని తగాలబెట్టాడు.
లాయర్: చంపి తగలబెట్టి అన్నీ చేసి కేసును తప్పుదోవ పట్టించడం కోసం యష్ ఏవేవో ప్రశ్నలు వేసి పోలీసులని ఇబ్బంది పెట్టాడని అర్థం అవుతుంది
యష్: ప్రత్యక్ష సాక్షిని ప్రశ్నలు అడగాలి. సత్యం మీరు చూసింది నన్నేనా
సత్యం: నేను చూసింది మిమ్మల్నే
యష్: ఎలా చూశారు కళ్ళద్దాలు పెట్టుకుని చూశారా?
సత్యం: లేదు నాకు చూపు బాగుంటుంది
Also Read: లక్కీని ముద్దు చేస్తూ తులసికి దొరికిపోయిన నందు- తల్లీకూతుళ్ల దెబ్బకి విలవిల్లాడుతున్న తోడు దొంగలు
యష్: మరి మీ జేబులో ఉన్న కళ్ళద్దాలు ఎవరివి. మీకు సైట్ ఉంది మీ ముక్కు మీద కళ్ళజోడు మచ్చలు కూడ ఉన్నాయి. హత్య జరిగిన రోజు పేపర్ లో వచ్చిన ఈ న్యూస్ చూడండి. ఆ రోజు దట్టమైన మంచు ఉండటం వల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేసినట్టు వార్త. హత్య జరిగిన ప్రదేశం ఎయిర్ పోర్టుకి దగ్గర్లోనే ఉంది. అటువంటి మంచులో ఈ వ్యక్తి నన్ను చూశాను అనడం, మంచులో చేపల వేటకి వెళ్ళాను అనడం సరిగా ఉందా? తప్పుడు సాక్ష్యాలు చూపించి నేరాన్ని నామీద మోపి దోషిని చేయాలని చూస్తున్నారు కొందరు
జడ్జి: ఎవరు ఆ కొందరు
యష్: అభిమన్యు మేడమ్.. ఒక ఫోన్ కాల్ తో కేసు ఫైల్ చేయడం, సంబంధిత వ్యక్తిగా అభి తెర మీదకి రావడం. నా చుట్టు ఎవరూ లేరని చూసి మాళవికని నేనే చంపానని అభిమన్యు అనడం వరకు అన్నీ అభిమన్యు చేసి నామీద నేరారోపణ చేశాడని కోర్టు వారికి విన్నవించుకుంటున్నా
జడ్జి: అందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయా?
యష్: ఉన్నాయి. కానీ అవి కోర్టు ముందు ఉంచేందుకు కొంత గడువు కావాలి
అభిమన్యు, మాళవిక దగ్గర సీన్ చూపిస్తారు. కాసేపటిలో యష్ కి శిక్ష పడుతుందని సంబరంగా చెప్తాడు. పార్టీ చేసుకుందామని అంటే తనకి మూడ్ లేదని అంటుంది.
మాళవిక: నాకు ఏదో భయంగా ఉంది. తనకి శిక్ష పడితే నా పరిస్థితి ఏంటి? నేను ఎంతకాలం ఇలా దొంగలా బతకాలి. నాకు ఇది చాలా ఇబ్బందిగా ఉంది
అభిమన్యు: అయితే వెళ్లిపో స్వేచ్చగా వెళ్లిపో. ఎక్కడికి వెళతావో నన్ను నిర్ణయించమంటావా? నువ్వు నిర్ణయించుకుంటావా? అయినా నేను ఆల్రెడీ నువ్వు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించేశాను. నువ్వు ఎంత అమాయకురాలివో తెలుసా బంగారం. నిన్ను చంపి తగలబెట్టినట్టు నాటకం ఆడి యష్ ని ఇరికిద్దామని అంటే ఒప్పుకున్నావ్. కానీ చచ్చిన నువ్వు ఎలా బతుకుతావు. బతకొచ్చు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకొచ్చు. కానీ నీకు తొందరెక్కువ. ఇక్కడ దాక్కుని ఎంజాయ్ చేయమని ఆఫర్ చేశా విన్నాను కానీ నువ్వు బయటకి తిరిగావ్. నువ్వు బయట ఎవరికైనా కనిపిస్తే నా బతుకు ఏం కావాలి. నిన్ను ట్రాప్ చేశాను నా కౌగిలిలో కాదు నా ఉచ్చులో పడిపోయావ్. పర్పస్ కంప్లీట్ నువ్వు ఉంటేనే డేంజర్ నాకు. నువ్వొక బ్యాడ్ క్యారెక్టర్ చెప్పు సెలెబ్రేట్ చేసుకుని ఆ కిక్కులో కిక్కురుమనకుండా చస్తావా? లేదంటే భయంకరమైన చావు చస్తావా? డెసిషన్ నీదే
Also Read: ఎవరూ ఊహించని ట్విస్ట్ - తెలిసిన ఆదర్శ్ ఆచూకీ, ముకుందని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న భవానీ
మాళవిక: ఒకే లెట్స్ సెలెబ్రేట్ అభి అనేసి మందు గ్లాసులలో పోసి తెచ్చి తనకి అందిస్తుంది. తను తాగకుండా అభి మొహాన మందు కొట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది. తనని పట్టుకోమని రౌడీలకు పురమాయిస్తాడు. రౌడీలు కర్ర తీసుకుని తనని కొట్టే టైమ్ కి వేద ఎంట్రీ ఇస్తుంది. అందరినీ కర్రతో చితక్కొట్టుడు కొట్టడంతో వాళ్ళు పారిపోతారు. మాళవిక తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతుంది. యష్ ని వదిలేసి రావడం, అభి మోసం చేయడం అన్నింటినీ గుర్తు చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వేద కాళ్ళ మీద పడుతుంటే ఆపి తనని తీసుకుని వెళ్లబోతుంటే వెనుక నుంచి వేద తల మీద రౌడీలు కొట్టేస్తారు. దీంతో వేద స్పృహ తప్పి కిందపడిపోతుంది.
జడ్జి: సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట కోర్టు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ముద్దాయి అభిమన్యు పేరు చెప్పినప్పటికీ సరైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల ముద్దాయిని కోర్టు పరిగణలోకి తీసుకోవడం లేదు. అభియోగం మోపిన వ్యక్తికి అని చెప్పబోతుండగా వేద ఆపండి అని మాళవికని తీసుకుని ఎంట్రీ ఇస్తుంది.
వేద: ముద్దాయి నిరపరాధి అనేందుకు సాక్ష్యం ఉందని చెప్పి మాళవికని పిలుస్తుంది. తనని చూసి అందరూ షాక్ అవుతారు. ఎవరినైతే ఆయన హత్య చేశారని అంటున్నారో ఆ మాళవిక బతికే ఉంది. ఆవిడే ఈవిడ
జడ్జి: చనిపోయిన వ్యక్తి బతికి ఉండటమా
మాళవిక: జరిగింది నేను చెప్తాను మేడమ్
రేపటి ఎపిసోడ్లో..
కరుడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా ఉన్న అభిమన్యుని వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాల్సిందిగా జడ్జి ఆదేశాలు జారీ చేస్తుంది. యష్ ని విడుదల చేసి మాళవిక, అభిలను పోలీసులు అరెస్ట్ చేస్తారు.