అన్వేషించండి

Gruhalakshmi August 19th: లక్కీని ముద్దు చేస్తూ తులసికి దొరికిపోయిన నందు- తల్లీకూతుళ్ల దెబ్బకి విలవిల్లాడుతున్న తోడు దొంగలు

లాస్య తన కొడుకుని నందుకి దగ్గర చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

ఇంటి బాధ్యతలు దివ్యకి ఇవ్వమని రాజ్యలక్ష్మితో ప్రకాశం అంటాడు. కానీ ప్రసన్న మాత్రం తను విడాకులు తీసుకోబోతుందని ఎందుకు ఇవ్వడమని అంటుంది.

ప్రకాశం: నమ్మి హాస్పిటల్ బాధ్యతలు అప్పగించినప్పుడు ఇంటి బాధ్యత అప్పగించడం తప్పు కాదు. విక్రమ్ ఇంటి తాళాలు నీ చేత్తో నువ్వే ఇవ్వు

విక్రమ్: నేను ఇవ్వడం కాదు ఈ ఇంట్లో ఏం జరిగినా అది అమ్మ చేతి మీదగానే జరగాలి

రాజ్యలక్ష్మి అయిష్టంగా ఇంటి బాధ్యతల తాళాల గుత్తి దివ్య చేతికి ఇస్తుంది. దాన్ని తీసుకుని దివ్య పొగరుగా అత్త వైపు చూస్తూ ఆశీర్వాదం తీసుకుంటుంది. లక్కీకి లాస్య కాల్ చేస్తుంది.

లక్కీ:  ఇక ఫోన్ ఎందుకు చేస్తున్నావ్ మమ్మీ నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు నాకు డాడీ దొరికాడుగా అది చాలు

లాస్య: నువ్వు నా పక్కన లేకపోతే ఇక నా పరిస్థితి ఏంటిరా

Also Read: ఎవరూ ఊహించని ట్విస్ట్ - తెలిసిన ఆదర్శ్ ఆచూకీ, ముకుందని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న భవానీ

లక్కీ: కొత్తగా మాట్లాడతావ్ ఏంటి మమ్మీ నేను హాస్టల్ లో ఉన్నప్పుడు ఉన్నావ్ కదా

లాస్య: హాల్లో అందరి ముందు కిందపడి గోల గోలగా మమ్మీ కావాలని ఏడువు. అప్పుడు నీ గోల భరించలేక ఒప్పేసుకుంటారు

లక్కీ: నేను ఒప్పుకోను. నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటాను. డాడీ దగ్గర నాకు బాగుంది కాల్ చేయకు నన్ను చూడాలని అనిపిస్తే నువ్వే రా అనేసి కాల్ కట్ చేస్తాడు.

దివ్య ఇంట్లో పని చేసే మనిషి వచ్చి డబ్బులు అప్పుగా కావాలని పిల్లోడు ఫీజు కట్టాలని అడుగుతుంది. వెంటనే డబ్బు తీసుకొచ్చి ఇచ్చిన దివ్య ఇవి తిరిగి ఇవ్వాలసిన పని లేదు బాగా చదువుకోమని చెప్తుంది. ఎవరిని అడిగి డబ్బులు ఇచ్చావని రాజ్యలక్ష్మి కోపంగా అడుగుతుంది. ఆ మాటకి దివ్య కాసేపు సోది క్లాస్ పీకుతుంది. ఎంట్రీ ఇచ్చిన ప్రకాశం కోడలికి సపోర్ట్ చేస్తూ పెళ్ళానికి కౌంటర్ వేస్తాడు. తను అత్త సొమ్ము దానం చేయడం లేదని మామ సొమ్ము దానం చేస్తున్నానని అంటుంది. కుదురుగా ఉండకపోతే రెండో కాలు కూడ బెండ్ అవుతుందని అత్తకి వార్నింగ్ ఇస్తుంది. తన పక్కనే కూర్చుని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని పని చేసుకుంటుంది. మావయ్య సూపర్ అని మెచ్చుకుంటాడు.

నందు తలనొప్పిగా ఉందని బామ్ రాసుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాడు. తనకి సాయం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడాని వెళ్ళి కాసేపు తలకి మసాజ్ చేస్తాడు. కళ్ళు తెరిచిన నందు ఎందుకు వచ్చావని అరుస్తాడు. భయపడితే లాభం లేదనుకుని ముద్దు చేసి నచ్చజెప్పి వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలని నందు అనుకుంటాడు. వెంటనే నవ్వుతూ లక్కీతో మాట్లాడతాడు. వాడిని ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చట చెప్తుంటే తులసి వస్తుంది. వాడిని దగ్గరకి తీసుకుని వీడి అమ్మ కూడా ఇలాగే మాటలు చెప్పిందని తిట్టుకుంటాడు.

నందు: నేను నిన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చానా? అని లక్కీని అడగ్గానే ఫోన్ పట్టుకుని చూస్తూ ఉంటాడు

లక్కీ: లేదు.. అలా చెప్తే నీకు దగ్గరగా ఉండవచ్చని ఆశ పెట్టారు

Also Read: రాజ్ ఉగ్రరూపం, అర్థరాత్రి వర్షంలో ఇంటి బయట కావ్య- సంబరపడుతున్న రుద్రాణి బ్యాచ్

నందు: ఎవరు చెప్పారు చెప్పు నాన్న అని ముద్దు చేస్తుంటే తులసి చూస్తుంది. వెంటనే వాడిని ఒడిలో నుంచి కిందకి దింపేస్తాడు. మళ్ళీ తులసి నందుని అపార్థం చేసుకుంటుంది. తప్పు చేసింది కాకుండా దాన్ని పిల్లాడి మీదకి నెట్టేస్తారా అని తిడుతుంది. అంతగా ప్రేమ ఉంటే ప్రేమ ఉందని పైకి చెప్పండి ఎవరు కాదని అంటారు. మీ జీవితం మీదని క్లాస్ పీకుతుంది. మొన్నటి వరకు వాడి అమ్మ నా జీవితంతో ఆడుకుంది ఇప్పుడు వీడు తయారైయ్యాడని తిట్టుకుంటాడు. రాజ్యలక్ష్మి సోఫాలో నుంచి లేచి నడవాలని గట్టిగా అనుకుని అతి కష్టం మీద నిలబడి మళ్ళీ కూలబడిపోతుంది. బసవయ్య వచ్చి సాయం చేసి పైకి లేపుతాడు. దివ్య తనతో చెడుగుడు అడుకుంటుంది. నా కాళ్ళు విరగ్గొట్టి నన్ను కూర్చోబెట్టింది. నేను లేస్తేనే కానీ దెబ్బ కొట్టడానికి లేదని అంటుంది. అప్పుడు నువ్వు కూడా వీల్ చైర్ కి పరిమితం కావాల్సి వస్తుందని బసవయ్య దెప్పిపొడుస్తాడు. లాస్య కోపంగా వచ్చి తన కోపం వెళ్లగక్కుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 15th: 'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
'గోదావరి' సీరియల్: సూర్యతోనే నీ పెళ్లి.. మాటిచ్చేసిన భువన! జాను పరిస్థితేంటి?
Nindu Manasulu Serial Today August 15th: నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
నిండు మనసులు: ఐశ్వర్య మాటలకు తల పట్టుకున్న ప్రేరణ! ఐషూకి రంజిత్ చెప్పిన షాకింగ్‌ నిజాలు!
Gundeninda Gudigantalu August 15th:మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
గుండెనిండా గుడిగంటలు: మనోజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రోహిణి మళ్లీ దొంగ ఎత్తులు...మురళి ప్రేమ అంగీకరించిన విద్య
Podarillu Serial Today August 15th:చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ.
పొదరిల్లు: చక్రితో ఒడిబియ్యం పోయించుకున్న మహా...పున్నమి పూజ కోసం సిద్ధమైన మహాలక్ష్మీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Embed widget